Big Stories

TVS XL 100 Sales: మనూరి బండి.. అదరకొట్టిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. ఏంటయ్యా ఆ క్రేజ్!

TVS XL 100 Sales: చీపెస్ట్ ప్రైస్ మోపెడ్‌లకు మార్కెట్‌లో చాలా కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇవి ఎక్కువ బరువు, ఇద్దరు ప్రయాణికులతో సులభంగా ఎక్కువ దూరం ప్రయాణించగలవు. ఈ సెగ్మెంట్‌లో టీవీఎస్ కొత్త జనరేషన్ మోపెడ్ ఎక్స్‌ఎల్ 100 ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది. ఈ మోపెడ్‌కు డిమాండ్ విపరీతంగా పెరిగింది. జూన్ 2024లో మొత్తం 40491 యూనిట్లు విక్రయించింది. జూన్ 2023లో 34829 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ మోపెడ్ సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తుంది. గుంతల రోడ్లపై బెటర్ రన్నింగ్ అందిస్తోంది. దీనిలోని ముందు భాగంలో టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనుకవైపు డ్యూయల్ హైడ్రాలిక్ సస్పెన్షన్‌ ఉంటుంది.

- Advertisement -

TVS XL 100 ఫ్రంట్, బ్యాక్ టైర్లు రెండింటిలోనూ డ్రమ్ బ్రేక్‌లు ఉన్నాయి. అధిక పవర్ కోసం 99.7 cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది  4.29 bhp పవర్‌ని, 6.5 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హై స్పీడ్ మోపెడ్. ఇది హైవేపై గరిష్టంగా 60 కిమీ./గం. రైడర్ భద్రత కోసం దీని ముందు, వెనుక టైర్లలో డ్రమ్ బ్రేకులు చూడొచ్చు. ఇది పెద్ద టైర్ సైజ్, వైర్ స్పోక్ వీల్స్‌ను కలిగి ఉంది.

- Advertisement -

Also Read: వెస్పా నుంచి స్పెషల్ స్కూటర్.. ధర రూ. 14.27 లక్షలు!

TVS XL 100 లో 4 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఈ కొత్త జనరేషన్ మోపెడ్‌లో పెద్ద హెడ్‌లైట్, స్ప్లిట్ సీట్ ఎంపికలు అందుబాటులో ఉన్నాయి. స్ప్లిట్ సీటు దూర ప్రయాణానికి చాలా కంఫర్ట్‌‌‌గా ఉంటుంది. ఇది లాంగ్ రూట్ వాహనం. TVS XL 100లో స్టాండర్డ్ రౌండ్ లైట్లు, రెండు అద్దాలు ఉన్నాయి. ఇది టర్న్ ఇండికేటర్, సాధారణ హ్యాండిల్‌బార్‌ని కలిగి ఉంది. ఇందులో యువత కోసం కంపెనీ ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్లను అందిస్తోంది.

TVS XL 100 బరువు 88 కిలోలు. ఇది ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, అల్లాయ్ వీల్స్ ఎంపికను కూడా కలిగి ఉంది. రోడ్డుపై 53.5 kmpl వరకు సులభంగా మైలేజీని పొందవచ్చని కంపెనీ పేర్కొంది. దీని బేస్ మోడల్ రూ. 57,009 ఆన్ రోడ్. దీని టాప్ మోడల్ XL 100 కంఫర్ట్ ఐ-టచ్ రూ. 71155 ఆన్-రోడ్ ధరకే అందుబాటులో ఉంటుంది.

Also Read: దిమాక్ కరాబ్ బైక్స్.. త్వరలో లాంచ్.. క్రేజ్ వేరే లెవల్!

TVS XL 100 సీట్ ఎత్తు 787 mm. ఇది కంఫర్ట్‌గా ఉంటుంది. కుటుంబ అవసరాలకు సరిపోతుంది. మీడియా నివేదికల ప్రకారం ఈ మోపెడ్ 100 కిలోల కంటే ఎక్కువ బరువును సులభంగా మోయగలదు. డ్రమ్ బ్రేక్ కాకుండా అదనపు భద్రత కోసం కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ తీసుకొచ్చారు. ఈ సిస్టమ్ రైడర్‌కు రెండు టైర్లపై అదనపు గ్రిప్ అందిస్తుంది. కంపెనీ కేవలం రెండు వేరియంట్లను మాత్రమే అందిస్తోంది. ఈ మోపెడ్ 16 అంగుళాల టైర్ పరిమాణాన్ని కలిగి ఉంది. ఇది అట్రాక్ట్ లుక్ ఇస్తుంది. దాని వెనుక భాగంలో బ్యాక్ రెస్ట్ అందించబడింది. ఇది కిక్. స్టార్ట్ బటన్‌తో కూడా వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News