Big Stories

TVS Jupiter New Look: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

TVS Jupiter in New Look with Amazing Features: దేశంలో ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థల్లో టీవీఎస్ కూడా ఒకటి. అయితే  TVS మోటార్స్ తన అత్యంత ప్రజాదరణ పొందిన స్కూటర్ జూపిటర్ కొత్త ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను విడుదల చేయబోతోంది. ఈ కొత్త మోడల్‌లో చాలా మార్పులను చూడవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇప్పుడు మీరు ఇందులో కొన్ని కొత్త ఫీచర్లను కూడా చూడవచ్చు. ప్రస్తుతం ఈ స్కూటర్ 110సీసీ, 125సీసీ ఇంజన్లతో వస్తోంది. ప్రస్తుతం జూపిటర్ 110 మాత్రమే అప్‌డేట్ చేయనున్నారు. ఈ స్కూటర్‌లో ఫీచర్లు, ప్రత్యేకత ఏమిటో వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

కొత్త జూపిటర్ 110 డిజైన్‌లో చాలా కొత్తగా ఉండనుంది. మీరు దాని ఫ్రంట్ లుక్‌లో కొత్త LED హెడ్‌లైట్‌ని చూడబోతున్నారు. ఇది కాకుండా స్కూటర్ వెనుక లుక్‌లో కొత్త LED టైల్‌లైట్ కూడా కనిపించబోతోంది. ఇది మాత్రమే కాదు రైడర్ కోసం పొడవైన, మృదువైన సీటును చూడవచ్చు.

- Advertisement -

కొత్త మోడల్‌లో LCD డిస్‌ప్లే ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీతో ఉంటుంది. దీంతోపాటు నావిగేషన్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత మోడల్ ధర రూ. 73 వేల నుండి ప్రారంభమవుతుంది. అయితే కొత్త స్కూటర్ ధరను రూ. 5000 వరకు పెంచవచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

Also Read: స్కూటర్లకు LPG కిట్లు.. గ్యాస్ ఎలా నింపుతారు? మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా?

కొత్త జూపిటర్ 110 టాప్ ఫీచర్లు

  • కాంబి బ్రేక్
  • LCD డిస్‌ప్లే
  • బ్లూటూత్ కనెక్టివిటీ
  • టర్న్ నావిగేషన్
  • పొడవాటి సీటు
  • డ్రమ్ బ్రేక్
  • 21/13 అంగుళాల టైర్లు

TVS జూపిటర్‌లో 109.7cc ఇంజన్ ఉంది. ఇది 7.4 bhp పవర్, 8.4 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇంజన్ CVT గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ స్కూటర్‌‌లో ఎకో, పవర్ మోడ్‌ ఉంటాయి. ఈ స్కూటర్‌లో కంపెనీ మొత్తం 17 కలర్ ఆప్షన్‌లను అందిస్తుంది. ఈ స్కూటర్ ఇంజన్ చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది.

జూపిటర్ 125ని అప్‌డేట్ చేసే ఉద్దేశ్యం కంపెనీకి లేదు. కానీ కంపెనీ రెండు స్కూటర్‌లను కలిపి లాంచ్ చేయవచ్చు. ప్రస్తుతం 125సీసీ ఇంజన్‌తో కూడిన ఈ స్కూటర్‌కు మంచి ఆదరణ లభిస్తోంది. ఈ స్కూటర్‌లో ఇతర స్కూటర్లలో ఉండే అన్నీ ఫీచర్లు ఉంటాయి. ఇది 124.8cc ఇంజన్‌ను కలిగి ఉంది. ఇది 8.3PS పవర్, 10.5Nm పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఎకో థ్రస్ట్ ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని ఇందులో ఉపయోగించారు. ఇది మంచి మైలేజీని అందించడంలో సహాయపడుతుంది.

Also Read: కియా మరో ముందడుగు.. పోలీస్ క్యాంటీన్లలో అమ్మకాలు!

ఇందులో 32 లీటర్ల స్టోరేజ్ ఉంది. దీని కారణంగా మీరు 2 ఫుల్ ఫేస్ హెల్మెట్‌లను ఇక్కడ ఉంచుకోవచ్చు. మరే ఇతర స్కూటర్‌లోనూ ఇంత స్పేస్ ఉండదు. ఈ స్కూటర్‌లో అనలాగ్‌తో పాటు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. ఈ స్కూటర్ ఎక్స్-షో రూమ్ ధర రూ.83 వేల నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News