Big Stories

TVS Jupiter 125: మహిళలకు ఈ స్కూటరే బెటర్.. లీటర్ పెట్రోల్‌కు మంచి మైలేజ్.. ధర కూడా చాలా తక్కువ..!

TVS Jupiter 125: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికీ టూ వీలర్ అనేది తప్పనిసరి అయిపోయింది. ఉద్యోగాలు చేసే వారికి, ఇంటి దగ్గర ఉండి పనులు చేసే మహిళలకు, పిల్లలకు స్కూల్‌కి డ్రాప్ చేయటానికి మరేదైనా పనుల కోసం టూ వీలర్ బాగా ఉపయోగ పడుతుంది. అలాంటి సమయంలో చాలా మంది స్కూటర్లపై ఆసక్తి చూపిస్తుంటారు. ఇలాంటి పనుల కోసం స్కూటర్లు అయితేనే బాగుంటుందని అనుకుంటుంటారు. కానీ మైలేజీ, ధర, స్పెసిఫికేషన్ల పరంగా ఏ స్కూటర్ అయితే బాగుంటుందో అని ఆలోచించే వారికి TVS Jupiter 125 బెటర్ ఆప్షన్‌గా చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌కి మార్కెట్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ కంపెనీ స్కూటర్లపై వాహన ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు. అందులో TVS Jupiter 125 స్కూటర్ ఒకటి. ఈ స్కూటర్ చాలా తక్కువ ధరలో మార్కెట్‌లో అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం రూ.89,155 నుండి రూ.99,805 ఎక్స్ షోరూమ్ ధర మధ్య లభిస్తుంది. ఈ స్కూటర్ డిస్క్, డ్రమ్, SmartXonnect అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్కూటర్ 124.8సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది.

- Advertisement -

అదే సమయంలో 8.2 పిఎస్ గరిష్ట శక్తిని.. 10.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అయితే ఈ స్కూటర్‌ లీటర్ పెట్రోల్‌కు సుమారు 50 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇందులో 33 లీటర్ అండర్ సీట్ స్టోరేజ్ కంపార్ట్‌మెంట్ ఉంది. దీని ద్వారా హెల్మెట్‌లు ల్యాప్‌టాప్‌లు వంటి వస్తువులను చాలా సులభంగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఇందులో ఎల్ఈడీ ల్యాంప్‌, టెయిల్ ల్యాంప్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

  Also Read: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

వీటితో పాటు సేఫ్టీ కోసం డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ ఆప్షన్లు కూడా ఉన్నాయి. ఈ స్కూటర్ ఫ్రంట్ సైడ్ 12 అంగుళాల అల్లాయ్ వీల్స్ ట్యూబ్ లెస్ టైర్లతో ఉంటాయి. అందువల్ల ఒక మంచి ధరలో చక్కనైన ఫీచర్లు అందించే స్కూటర్ కొనుక్కోవాలని ప్లాన్ చేస్తున్న వారికి టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ చాలా బెటర్ అని చెప్పాలి. ఇదిలా ఉంటే.. ఈ స్కూటర్‌కు మార్కెట్‌లో మరే స్కూటర్ పోటీ లేదా అంటే ఉందనే చెప్పాలి.

టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్‌కు మార్కెట్‌లో హూండా డియో ప్రత్యర్ధిగా ఉంది. హూండా డియో కూడా మంచి క్రేజ్ ఉన్న బైకే.. ఇది రూ.74,629 నుంచి రూ.82,130 ఎక్స్ షోరూమ్ ధరతో లభిస్తుంది. అలాగే ఇది 109.51సిసి ఎయిర్ కూల్డ్ సింగిల్ పెట్రలో ఇంజిన్ ఆప్షన్లో లభిస్తుంది. అదే సమయంలో ఈ స్కూటర్ 7.85 పిఎస్ పవర్.. 9.03 ఎన్‌ఎమ్ టార్క్‌ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ స్కూటర్ లీటర్ పెట్రోల్‌కి 50 కి.మీ మైలేజీ అందిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News