Big Stories

Toyota Innova Hycross Hybrid: భలే డిమాండ్.. ఈ కారు కావాలంటే 14 నెలలు పక్కాగా ఆగాల్సిందే..!

Toyota Innova Hycross Hybrid Waiting Period: భారత మార్కెట్‌లో టయోటా కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ప్రస్తుతం టయోటా 8-సీటర్ MPV ఇన్నోవా హైక్రాస్ ఇండియన్ మార్కెట్‌లో ప్రకంపనలు సృష్టిస్తోంది. టయోటా ఈ 8-సీటర్ MPV అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి. ఇన్నోవా హైక్రాస్ బుకింగ్స్ ప్రారంభమైన వెంటనే వినియోగదారులు దాని హైబ్రిడ్ వేరియంట్‌‌ను దక్కించుకోడానికి దూసుకెళ్తున్నారు.

- Advertisement -

దీంతో కంపెనీ చేసేదేమిలేక దాని కొన్ని వేరియంట్‌ బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. టయోటా ఈ MPV ప్రస్తుతం కంపెనీకి అత్యంత డిమాండ్ ఉన్న కార్లలో ఒకటి. దీని హైబ్రిడ్ వేరియంట్ కోసం ఇంకా ఎక్కువ వెయిటింగ్ పీరియడ్ ఉండడానికి ఇదే కారణం. దీని వెయిటింగ్ పీరియడ్ గరిష్టంగా 14 నెలల వరకు ఉంటుంది. దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

టయోటా ఇన్నోవా హై క్రాస్ బేస్ వేరియంట్ గురించి మాట్లాడితే ఈ కారును దక్కించుకోవాలంటే కస్టమర్లు 14 నెలలు వేచి ఉండాలి. ఈ 8-సీటర్ పెట్రోల్ MPVపై జూన్ 2024లో బుకింగ్ చేసిన రోజు నుండి 6 నెలల వరకు వెయిటింగ్ పీరియడ్ ఉంది. అదే సమయంలో దాని హైబ్రిడ్ వేరియంట్‌పై బుకింగ్ చేసిన రోజు నుండి దాదాపు 14 నెలలు వేయిట్ చేయాలి. ప్రస్తుతం కంపెనీ హైబ్రిడ్ వేరియంట్‌ల ZX, ZX(O) బుకింగ్‌ను తాత్కాలికంగా నిలిపివేసింది. దీని కారణంగా దాని వెయిటింగ్ పీరియడ్ క్లారిటీ లేదు.

Also Read: రూ.1,499లకే EV.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ టైమ్‌కే ఫుల్ ఛార్జ్!

అనేక అద్భుతమైన ఫీచర్లతో కూడిన ఇందులో ట్విన్ 10-అంగుళాల వెనుక ప్యాసింజర్ డిస్‌ప్లే, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వెంటిలేటెడ్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, 360-డిగ్రీ కెమెరా, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ముందు, వెనుక పార్కింగ్ సెన్సార్లు వంటి ఫీచర్లు ఉన్నాయి.

టొయోటా ఇన్నోవా హైక్రాస్ ఇంజన్ పవర్‌ట్రెయిన్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 186ps పవర్. 206nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. దీని నాన్-హైబ్రిడ్ వెర్షన్‌లో కూడా అదే ఇంజన్ ఉంది. ఈ ఇంజన్ 174ps పవర్, 205nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది హైబ్రిడ్ ఇంజన్‌తో కూడిన e-CVT గేర్‌బాక్స్‌ను కలిగి ఉంది. అయితే నాన్-హైబ్రిడ్ వెర్షన్‌లో CVT గేర్‌బాక్స్ ఉంటుంది.

Also Read: ఈ ఐదు కార్లపైనే అందరిచూపు.. మైండ్ బ్లాక్ చేస్తున్న రేంజ్.. దుమ్ములేచిపోద్ది!

టయోటా ఇన్నోవా హై క్రాస్ హైబ్రిడ్ వేరియంట్ మైలేజ్ 21.1 కి.మీ/ లీటర్. ఈ 8-సీటర్ MPV కేవలం 9.5 సెకన్లలో 0 నుండి 100 kmph వేగాన్ని అందుకుంటుంది. హై క్రాస్ 8 సీటర్ ధర భారతీయ మార్కెట్‌లో దీని ధర బేస్ మోడల్‌కు రూ. 19.77 లక్షలు (ఎక్స్-షోరూమ్). టాప్ మోడల్‌కు రూ. 30.98 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News