Big Stories

Top Cars in India: మార్కెట్‌లో వీటికి యమ క్రేజీ.. అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లు!

Top 10 Selling Cars in India for may 2024: దేశంలో ఎక్కడా చూసిన ప్రస్తుతం కార్ల కొనుగోళ్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతి ఒక్కరూ లగ్జరీగా బతకాలనే కోరికతో పాటు ప్రయాణాలు సులువుగా సాగాలని అనుకుంటారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసేవారితోపాటు మధ్య తరగతి ప్రజలు సైతం సౌకర్యవంతమైన ప్రయాణం కోస్ం కార్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో కార్లకు రోజురోజుకు విపరీతమైన డిమాండ్ పెరుగుతోంది.

- Advertisement -

ఎక్కువ మంది అనుకున్న బడ్జెట్‌లో కుటుంబానికి సరిపోయేలా కార్లు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు ఈఎంఐ ఆప్షన్ ఉండడంతోపాటు కార్లు కొనుగోలు చేసేందుకు చాలామంది బ్యాంకుల నుంచి లోన్ సదుపాయం కల్పించడంతో ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. దాదాపు అన్ని బ్యాంకులు కారు లోన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. దీంతో కారు లోన్ తీసుకునే వారి సంఖ్య పెరగడంతో గత నెలలో కార్లు ఎక్కువగా అమ్ముడుపోయాయి.

- Advertisement -

మేలో అన్ని కంపెనీల కార్ల అమ్మకాల్లో జోరు కొనసాగింది. ముఖ్యంగా మారుతీ సుజుకీ ఎక్కువగా అమ్ముడుపోయయి. మే 2024లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో మారుతీ కంపెనీ ఆధిపత్యం చెలాయించింది. అయితే మారుతి స్విప్ట్, టాటా పంచ్, మారుతి డిజైర్, హ్యుందాయ్ క్రెటా, మారుతి వ్యాగన్, మారుతి బ్రెజ్జా, మారుతి ఎర్టిగా, మహీంద్రా స్కార్పియో, మారుతి బాలెనో, మారుతి ఫ్రాంక్స్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో చోటు దక్కించుకున్నాయి. ఈ టాప్ బెస్ట్ కార్లలో మారుతీ సుజుకీకి సంబంధించి 7 మోడళ్లు ఉన్నాయి. ఇక హ్యుందాయ్, టాటా, మహింద్రా కార్లు కూడా బాగా అమ్ముడుపోయాయి.

మారుతి స్విప్ట్:
మే 2024లో అత్యధికంగా అమ్ముడైన టాప్10 కార్లలో మారుతి సుజుకి కంపెనీకి చెందిన మారుతి స్విప్ట్ మొదటి స్థానంలో నిలిచింది. దీని కంపెనీ మేలో 19,393 యూనిట్లను విక్రయించింది. ఇక 12 శాతం అమ్మకాల వృద్ధిని సాధించింది.

టాటా పంచ్:
టాటా మోటార్స్ యొక్క పంచ్ టాప్ 10 కార్లలో బెస్ట్ సెల్లర్ జాబితాలో రెండో స్థానంలో ఉంది. ఈ కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడైన కార్లలో ఒకటి. మే 2024లో టాటా పంచ్18,949 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల వృద్ధిలో 70శాతం పెరుగుదలతో రికార్డు క్రియేట్ చేసింది.

మారుతి డిజైర్:
మారుతి సుజుకికి చెందిన డిజైర్.. మేలో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్లలో మూడో స్థానాన్ని ఆక్రమించింది. గత నెలలో 16,061 యూనిట్లను విక్రయించింది. అమ్మకాల్లో 42 శాతం వృద్ధిని సాధించింది.

హ్యుందాయ్ క్రెటా:
హ్యుందాయ్ కంపెనీకి చెందిన క్రెటా.. మే 2024లో అత్యధిక కార్ల అమ్మకాల్లో నాల్గో స్థానంలో నిలిచింది. గత నెలలో 14,662 యూనిట్లను విక్రయించింది. కేవలం 1 శాతం స్వల్ప వృద్ధిని సాధించింది.

మారుతి వ్యాగన్:
మారుతి కంపెనీకి చెందిన వ్యాగన్ టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచింది. మే 2024లో 14,492 యూనిట్లు విక్రయించింది. 11 శాతం వృద్ధిని సాధించింది.

Also Read: సరికొత్త‌గా యమహా RX 100.. పిచ్చెక్కిస్తున్న లుక్!

తర్వాతి స్థానాల్లో మారుతి బ్రెజ్జా.. 14,186 యూనిట్లు విక్రయించగా 6 శాతం వృద్ధి, మారుతి ఎర్టిగా.. 13,893 యూనిట్లు విక్రయించగా 32 శాతం వృద్ధి, మహీంద్రా స్కార్పియో.. 13,717 యూనిట్లు విక్రయించగా 47 శాతం వృద్ధి, మారుతి బాలెనో.. 12,842 యూనిట్లు విక్రయించగా 31శాతం వృద్ధి, మారుతి ఫ్రాంక్స్..12,681 యూనిట్లు విక్రయించగా 29 శాతం వృద్ధి సాధించింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News