Big Stories

Best Bikes Under 3 Lakhs: మతిపోయే బైక్స్.. రూ.3 లక్షల్లోపే.. చాలా స్టైలిష్.. గ్రాండ్ లుక్!

Best Bikes Under 3 Lakhs: ప్రస్తుత కాలంలో టూవీలర్లు చాలా అవసరంగా మారాయి. ప్రతి ఒక్కరు వారి అవసరాలకు అనుగుణంగా బైక్స్, స్కూటర్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లోని రద్ధీ రోడ్లు, ట్రాఫిక్ జామ్‌లు కారణంగా ప్రతి ఇంట్లో బైక్ లేదా స్కూటర్ ఉంటుంది. అంతేకాకుండా అప్‌డేట్ అవుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కంపెనీలు ఎప్పటికప్పుడు బైకులు, స్కూటర్లలో మార్పులు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీతోనే 2024 అనేక బైకులు దేశీయ మార్కెట్‌లో లాంచ్ అయ్యాయి. మీరు కూడా రోజువారీ రాకపోకలు, ట్రిప్పులు, ఆఫ్-రోడింగ్, ట్రాక్‌పై వెళ్లడానికి కొత్త బైక్‌ కొనాలని చూస్తున్నారా? అయితే రూ. 2-3 లక్షల బడ్జెట్‌లో 5 బైకుల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Royal Enfield Himalayan
రాయల్ ఎన్ఫీల్డ్ సెకండ్ జనరేషన్ హిమాలయన్ 450ని విడుదల చేసింది. ఇది ‘షెర్పా’ అనే 452cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌తో పనిచేస్తుంది. ఈ పవర్‌ట్రెయిన్ 8000rpm వద్ద 40PS, 5500rpm వద్ద 40Nm పవర్ రిలీజ్ చేస్తుంది. ADV ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ 17 లీటర్లు. మీరు దీన్ని రూ. 2.85 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

Harley Davidson
హార్లే డేవిడ్‌సన్ మొదట్లో చాలా ఖరీదైనదిగా ఉండేది. కంపెనీ ఇటీవలే హీరో మోటోకార్ప్‌తో కలిసి X440ని విడుదల చేసింది. ఇది 440cc, సింగిల్-సిలిండర్, ఎయిర్/ఆయిల్-కూల్డ్ ఇంజన్‌ ఆధారంగా ఇది 27.4PS, 38Nm పవర్ రిలీజ్ చేస్తుంది. మీరు దీన్ని రూ. 2.39 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Also Read: చరిత్ర సృష్టించనున్న టాటా.. నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీ.. దద్దరిల్లిపోద్ది!

Triumph Scrambler 400
ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400X 398cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్ ఇంజన్‌తో వస్తుంది. ఇది విశాలమైన హ్యాండిల్‌బార్, స్ట్రైట్‌గా ఉన్న రైడింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది సప్లిస్ సస్పెన్షన్ సెటప్‌తో కనిపిస్తుంది. మీరు దీన్ని రూ. 2.64 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Suzuki V-Strom 250 SX
V-Strom 250 SX ఫస్ట్‌ లుక్‌లోనే 250 cc బైక్ లాగా ఉండదు. ఫెయిరింగ్ పెద్ద కెపాసిటీ ఉన్న ADV లాగా కనిపిస్తుంది. ఇది 249 cc, సింగిల్ సిలిండర్, ఆయిల్-కూల్డ్ ఇంజన్‌తో ఇది 27 bhp, 23 Nm పవర్ రిలీజ్ చేస్తుంది. మీరు దీన్ని రూ. 2.11 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

Also Read: క్రేజీ అప్డేట్.. హోండా ఫ్రీడ్ నుంచి MVP వేరియంట్!

TVS Apache RR 310
టీవీఎస్ Apache RR 310 రోజూ వాడకానికి, యుటిలిటీ, పర్ఫామెన్స్, హ్యాండ్లింగ్‌లో మంచి బ్యాలెన్స్‌ అందిస్తుంది. ఇందులో, 312cc సింగిల్-సిలిండర్ లిక్విడ్-కూల్డ్ మోటార్ 34bhp, 27Nm బలమైన అవుట్‌పుట్‌ను ఉత్పత్తి చేస్తుంది. మీరు దీన్ని రూ. 2.72 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు చేయవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News