Big Stories

Best SUVs in India: సేఫ్టీ ముఖ్యం బిగులు.. ఫ్యామిలీ కోసం బెస్ట్ కార్లు ఇవే!

Best SUVs in India: భారతదేశంలో కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. ముఖ్యంగా దేశీయ కంపెనీల కార్లు ఎక్కువగా సేల్ అవుతున్నాయి. ఈ క్రమంలోనే మీరు కూడా ఫ్యామిలీ కోసం మంచి ఎస్‌యూవీని కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే.. సెఫ్టీ, పర్ఫామెన్స్ పరంగా ఐదు అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి చాలా స్పోర్టీ లుక్‌‌ను అందిస్తాయి. అలానే పవర్‌ఫుల్ ఇంజన్, స్ట్రాంగెస్ట్ సేఫ్టీ ఫీచర్లు వీటిలో పొందుపరిచారు. రండి ఈ కార్ల గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

TATA Harrier
మీరు టాటా హారియర్‌ను రూ. 15.49 లక్షల ప్రారంభ ధరతో కొనుగోలు చేయవచ్చు. ఈ టాటా SUV గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ సాధించింది. ఈ మిడ్ సైజ్ SUV 7 ఎయిర్‌బ్యాగ్‌లు, 360 డిగ్రీ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్‌తో వస్తుంది. హారియర్‌లో మునుపటి తరం క్రియోటెక్ 2.0-లీటర్ డీజల్ ఇంజన్‌తో వస్తుంది. ఇందులో 6-స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్  కలిగి ఉంది. డీజిల్ ఇంజన్ అధిక RPM వద్ద పెద్ద శబ్దం చేస్తుంది. 167 bhp వద్త 350 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది.

- Advertisement -

Also Read: డిమాండ్ తగ్గేలా లేదు.. దూసుకెళ్తున్న ఫుల్ సైజ్ ఎస్‌యూవీ అమ్మకాలు!

Volkswagen taigun, Skoda Kushak
వోక్స్‌వ్యాగన్ టైగన్ ప్రారంభ ధర రూ. 11.70 లక్షలు కాగా, స్కోడా కుషాక్ ధరలు రూ. 10.89 లక్షల నుంచి ప్రారంభమవుతాయి. ఈ SUVలలో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, మల్టీ-కొలిజన్ బ్రేక్ వంటి భద్రతా ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండు ఇంజన్ ఆప్షన్లలో వస్తున్నాయి. ఇందులోని శక్తివంతమైన 1.5-లీటర్ TSI ఇంజన్ 148 bhp పవర్ 250 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. టైగన్, కుషాక్ గ్లోబల్ NCAP నుండి 5-స్టార్ రేటింగ్‌ను పొందాయి.

Hyundai Creta N Line
హ్యుందాయ్ క్రెటా ఎన్ లైన్ ప్రారంభ ధర రూ. 16.82 లక్షలు. ఈ మిడ్‌సైజ్ SUVకి అనేక కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లు ఉన్నాయి. దీని ఎక్ట్సీరియర్, ఇంటీరియర్‌లో రెడ్ యాక్సెంట్‌లతో పాటు సస్పెన్షన్, స్టీరింగ్‌లో చిన్న మార్పులు చూడొచ్చు. క్రెటా ఎన్ లైన్ కొత్త 1.5-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో వస్తుంది. ఈ టర్బో-పెట్రోల్ ఇంజన్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చిన ఏకైక క్రెటాలో N లైన్ మాత్రమే. క్రెటా N లైన్‌లో హ్యుందాయ్ స్మార్ట్‌సెన్స్-లెవల్ 2 అడ్వాన్స్‌డ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS), హిల్-స్టార్ట్ అసిస్ట్, ESC కూడా ఉన్నాయి.

Also Read: జీప్ నుంచి చౌకైన SUV.. ధర ఎంతంటే?

Tata Nexon
టాటా నెక్సాన్ ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 8 లక్షలు. ఈ SUV గ్లోబల్ NCAPలో 5-స్టార్ రేటింగ్ పొందింది. 2023 టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు 1.5-లీటర్ డీజిల్ యూనిట్‌తో వస్తుంది. ఈ SUV 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ESC, హిల్-అసిస్ట్, 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News