Big Stories

Safest SUV’s in India: దేశంలో సేఫెస్ట్ కార్లు.. కళ్లుమూసుకొని కొనేయండి!

Safest SUV’s in India: ఈ రోజుల్లో కార్లలోని సేఫ్టీ ఫీచర్లపై ఎక్కువ శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పుడు కొత్త కారును కొనుగోలు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకొని తర్వాత మాత్రమే షోరూమ్‌‌కి వెళుతున్నారు. ప్రభుత్వం బేస్ మోడల్‌లో కొన్ని భద్రతా ఫీచర్లు అదించాలని కంపెనీలకు స్పష్టం చేసింది. అయితే ఇది కొన్ని సంవత్సరాల క్రితం వరకు ఇలా ఉండేదికాదు. ఇప్పుడు గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్ సేఫ్టీ రేటింగ్‌లు కొనుగోలుదారులకు చాలా నమ్మకాన్ని కలిగిస్తున్నాయి. దేశంలో టాటా, మహీంద్రా కార్లు భద్రతలో అగ్రస్థానంలో ఉన్నాయి. 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందిన భారతదేశంలోని సురక్షితమైన SUVల గుర్తింపు దక్కించుకున్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Tata Safari
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో టాటా సఫారీ 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. 34 మార్కులకు 33.05 మార్కులు వచ్చాయి. దీని డిజైన్ ఇప్పుడు చాలా ఆకట్టుకుంటుంది. టాటా సఫారిలో 2.0L టర్బో ఇంజన్ ఉంది. ఇది 170PS పవర్, 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 6 స్పీడ్ AT గేర్‌బాక్స్ ఫెసిలిటిని కలిగి ఉంది. టాటా సఫారీ ధర రూ.16.19 లక్షల నుంచి రూ.25.59 లక్షల వరకు ఉంది.

- Advertisement -

Mahindra Scorpio-N
మహీంద్రా స్కార్పియో N దాని విభాగంలో అత్యధికంగా అమ్ముడవుతున్న SUV. ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. 34 మార్కులకు గాను 29.25 మార్కులు సాధించింది. దీని ధర రూ.13.60 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. స్కార్పియో N 1997cc, 2198cc ఇంజిన్‌లను కలిగి ఉన్న రెండు ఇంజన్ వేరియంట్‌లలో వస్తుంది. ఈ ఇంజన్లు వరుసగా 130bhp, 200bhp పవర్ రిలీజ్ చేస్తాయి. ఇందులో మీకు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కూడా లభిస్తుంది.

Volkswagen Virtus
గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో Volkswagen Virtus 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. 34 మార్కులకు 33.05 మార్కులు సాధించింది. డిజైన్, ఫీచర్ల పరంగా ఇది బెస్ట్‌గా ఉంటుంది. Virtus ధర రూ. 11.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది. ఇంజన్ గురించి మాట్లాడితే మీకు 1.0 లీటర్, 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది ఒక లీటర్‌‌కి 22 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇందులో మీరు చాలా మంచి స్పేస్, ఫీచర్లను చూస్తారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News