Big Stories

Tata Punch EV Crash Test: మీ ప్రయాణాలకు ఇదే సేఫ్ కారు.. క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్ సాధించిన టాటా పంచ్ EV..!

Tata Punch EV got 5 Star Rating in Crash Test: టాటా పంచ్ ఎలక్ట్రిక్ ఇండియా NCAPలో క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. ఈ టెస్ట్‌లో కారు పెద్దలు, పిల్లలు ఇద్దరికీ 5-స్టార్ రేటింగ్‌ని పొందింది. ఈ మేరకు ఇది టాటా మోటార్స్ నుంచి భారతదేశంలో తయారు చేయబడిన 5-స్టార్ రేటింగ్ కలిగిన కార్ల జాబితాలో చేర్చారు. ఈ ఎలక్ట్రిక్ SUV క్రాష్ టెస్ట్ ఏప్రిల్ 2024లో జరిగింది. ఇప్పుడు దాని రిజల్ట్ పబ్లిక్‌గా వచ్చింది.

- Advertisement -

ఈ క్రాష్ టెస్ట్ రిపోర్ట్ తర్వాత పంచ్ EV అమ్మకాలు ఊపందుకోవచ్చని కంపెనీ భావిస్తోంది. మేలో దేశంలో అత్యధికంగా అమ్ముడైన రెండవ కారుగా పంచ్ నలిచింది. అదే సమయంలో ఇది చౌకైన ఎలక్ట్రిక్ SUVగా కూడా ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.10.99 లక్షలు. టాటా హారియర్, టాటా సఫారి, టాటా నెక్స్ EV కూడా ఇండియా NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించాయి.

- Advertisement -

BNCAP టెస్ట్‌లో అడల్ట్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (AOP) కోసం పంచ్ EV 32కి 31.46 పాయింట్లను స్కోర్ చేసింది. ఇది ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 14.26, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16 పాయింట్లలో 15.6 స్కోర్ చేసింది. మరోవైపు చైల్డ్ ఆక్యుపెన్సీ ప్రొటెక్షన్ (COP) కోసం 49 పాయింట్లకు 45 వచ్చింది.

Also Read:రికార్డులు బద్దలుకొట్టిన కియా.. విదేశాల్లో భారీగా పెరిగిన క్రేజ్!

డైనమిక్ టెస్టింగ్‌లో 24 పాయింట్లకు 23.95 పాయింట్లు, CRS (చైల్డ్ సీట్ రెస్ట్రెయింట్) విభాగంలో 12కి 12 పాయింట్లు, వెహికల్ అసెస్‌మెంట్‌లో 13కి 9 పాయింట్లు వచ్చాయి. భద్రత కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, అన్ని సీట్లకు మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు, ISOFIX మౌంట్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.

టాటా పంచ్ EV  డిజైన్, ఫీచర్లు, స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే ఫీచర్లు Nexon EV నుండి తీసుకోబడ్డాయి. Nexon ఫేస్‌లిఫ్ట్‌లో ఉన్నట్లుగా ఇందులో LED లైట్ బార్‌ ఉంటుంది. ఇది సిమిలర్ బంపర్, గ్రిల్ డిజైన్‌తో తీసుకొస్తున్నారు. దీని ఫ్రంట్ బంపర్‌లో ఇంటిగ్రేటెడ్ స్ప్లిట్ LED హెడ్‌లైట్‌లు, వర్టికల్ స్ట్రెక్స్‌తో రీ-డిజైన్ చేయబడిన లోయర్ బంపర్, సిల్వర్ ఫాక్స్ స్కిడ్ ప్లేట్ ఉన్నాయి.

Also Read: Tata Harrier EV: టాటా హారియర్ ఈవీ వచ్చేస్తుంది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 500 కి.మీ మైలేజీ..!

టాటా పంచ్ EV వెనుక భాగంలో ICE మోడల్ లానే టైల్‌లైట్ డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో Y-ఆకారపు బ్రేక్ లైట్లు, రూఫ్-మౌంటెడ్ స్పాయిలర్, బంపర్ డిజైన్ ఉన్నాయి. సైడ్ ప్రొఫైల్‌లో ఇప్పుడు 16-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, అన్ని చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

పంచ్ EVని కంపెనీ తన acti.ev ప్యూర్ ఎలక్ట్రిక్ ప్లాట్‌ఫారమ్‌లో డెవలప్ చేసింది. మీరు రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్‌తో టాటా పంచ్ EVని కొనుగోలు చేయవచ్చు. కారులో 25 kWh, 35 kWh బ్యాటరీ ప్యాక్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 7.2 kW ఫాస్ట్ హోమ్ ఛార్జర్ (LR వేరియంట్ కోసం) 3.3 kW వాల్‌బాక్స్ ఛార్జర్ ఉన్నాయి. 25 kWh బ్యాటరీ ప్యాక్ రేంజ్ 421Km.

Also Read: దుమ్ములేపనున్న మారుతీ.. నాలుగు CNG కార్లు.. మైలేజ్ చూస్తే నమ్మలేరు!

అయితే 35 kWh బ్యాటరీ ప్యాక్ రేంజ్ 315Km. ఇందులో బోనెట్ కింద 14-లీటర్ ఫ్రంక్ కూడా ఉంటుంది. పంచ్ EVకి డ్యూయల్-టోన్ ఇంటీరియర్ థీమ్, ప్రీమియం ఫినిషింగ్‌తో సీట్ అప్హోల్స్టరీ, టాటా లోగోతో కూడిన టూ-స్పోక్ స్టీరింగ్ వీల్, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్ ఉన్నాయి.

ఈ ఎలక్ట్రిక్ కారు 10.25-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఇందులో 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్,  పెద్ద టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ కూడా ఉన్నాయి. ఈ EVని ఏదైనా 50Kw DC ఫాస్ట్ ఛార్జర్‌తో 56 నిమిషాల్లో 10 నుండి 80 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చు. ఇది వాటర్ ప్రూఫ్ బ్యాటరీని కలిగి ఉంది.

Also Read: Best CNG Cars Under 8 Lakhs: బడ్జెట్ తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఈ CNG కార్లను మిస్ చేయకండి

ఈ బ్యాటరీపై 8 సంవత్సరాలు లేదా 1,60,000 కిమీ వారంటీని ఇస్తోంది. ఇది 5 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. దీనిలో మూడు డ్రైవింగ్ మోడ్‌లు ఉన్నాయి. అడ్వెంచర్, ఎంపవర్డ్, ఎంపవర్డ్+. ఇందులో 4 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. భద్రత పరంగా 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS, ESC, ESP, క్రూయిజ్ కంట్రోల్, 360-డిగ్రీ కెమెరా వంటి ఫీచర్లు పంచ్ EVలో ఉంటాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News