Big Stories

Tata Nexon CNG Turbo: చరిత్ర సృష్టించనున్న టాటా.. నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీ.. దద్దరిల్లిపోద్ది..!

Tata Nexon CNG Turbo: దేశంలోని ప్రముఖ కార్ల తయారీ సంస్థ టాటా మోటార్స్ కొత్త టెక్నాలజీతో కార్లను తీసుకొస్తుంది. ఇటీవలే కంపెనీ అత్యంత వేగవంతమైన హ్యాచ్‌బ్యాక్ కారు ఆల్ట్రోజ్ రేసర్‌ను విడుదల చేసింది.ఇప్పుడు టాటా తన ప్రసిద్ధ కాంపాక్ట్ SUV నెక్సాన్ CNG వెర్షన్‌ను ఈ సంవత్సరం తీసుకువస్తున్నట్లు ధృవీకరించింది. విశేషమేమిటంటే నెక్సాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో రానున్న ప్రపంచంలోనే మొట్టమొదటి CNG SUV. రెండు చిన్న CNG సిలిండర్లు ఇందులో ఉంటాయి.

- Advertisement -

ఈ సంవత్సరం ప్రారంభంలో నెక్సాన్ iCNG కాన్సెప్ట్ మోడల్‌ను భారత్ మొబిలిటీ షోలో విడుదల చేశారు. ఈ మోడల్‌లో రెండు చిన్న CNG సిలిండర్‌ సెట్ ఉంటుంది. దీని కారణంగా బూట్‌ స్పేస్‌లో ఎటువంటి సమస్య ఉండదు. Nexon CNG డిజైన్, ఇంటీరియర్‌లో ఎటువంటి మార్పు ఉండదు. iCNG లోగో మాత్రమే కనిపిస్తుంది. కానీ దాని సస్పెన్షన్‌లో కొన్ని మార్పులు కచ్చితంగా ఉంటాయి.

- Advertisement -

టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ నెక్సాన్ 1.2 లీటర్ 3 సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్‌తో నెక్సాన్ టర్బోచార్జ్డ్ ఇంజన్‌తో భారతదేశపు మొదటి CNG SUV అవుతుంది. ఈ ఇంజన్ 120PS పవర్, 170 Nm టార్క్ రిలీజ్ చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు ఆటో గేర్ షిఫ్ట్ కూడా ఇందులో చూడొచ్చు. ఈ వాహనంలో AMT గేర్‌బాక్స్ సౌకర్యం కూడా ఉంటుంది. Nexon CNGలో వివిధ ఇంజన్ వేరియంట్‌లలో రావచ్చు.

Also Read: ఇక పెట్రోల్ అక్కర్లేదు గురూ.. రూ.15 వేలకే CNG.. ఏకంగా 100 కిమీ మైలేజ్

Nexon CNG రెండు వేరియంట్లలో విడుదల అవుతుంది. Nexon CNG కొంచెం తక్కువ పవర్, టార్క్ పొందుతుంది. ఇది హై గ్రౌండ్ క్లియరెన్స్‌తో రానుంది. మాన్యుఫ్యాక్చరింగ్ సమయంలో అమర్చిన CNG సిస్టమ్‌లో థర్మల్ ఇన్‌సిడెంట్ సేఫ్టీ, మైక్రో స్విచ్, 6-పాయింట్ సిలిండర్ మౌంటు స్కీమ్, సింగిల్ ECUతో పాటు అధిక నాణ్యత గల మెటీరియల్స్ ఉంటాయి. అంటే వాహనంలో భద్రతపై పూర్తి జాగ్రత్తలు తీసుకున్నారు Nexon CNG అంచనా ధర రూ.9.25 లక్షలు కావచ్చు. దీని ప్రత్యక్ష పోటీ మారుతి సుజుకి బ్రెజ్జా CNGతో ఉంటుంది. దీని ధర రూ. 10.64 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News