Big Stories

2024 Maruti Suzuki Swift Bookings: ఏమి క్రేజ్ సామీ.. మారుతి కొత్త స్విఫ్ట్ బుకింగుల వరద!

2024 Maruti Suzuki Swift Bookings: దేశంలోని అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ మారుతీ సుజుకి ఫోర్త్ జనరేషన్  స్విఫ్ట్ 2024ని మే 2024లోనే భారత మార్కెట్‌లో విడుదల చేసింది. కంపెనీ ఈ కారును విడుదల చేసినప్పటి నుండి అద్భుతమైన స్పందనను అందుకుంటుంది. కొద్ది రోజుల్లోనే ఈ కారు కోసం కంపెనీకి 40 వేలకు పైగా బుకింగ్స్ వచ్చాయి. ఈ కారులో ఏ వేరియంట్‌కు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది..? తదితర వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

మారుతి సుజుకీ ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్ 2024ని 9 మే 2024న భారత మార్కెట్లో విడుదల చేసింది. ఇంతకుముందు దాని థార్డ్ జనరేషన్ భారతీయ మార్కెట్లో అందించనుంది. విడుదలైనప్పటి నుండి కొత్త తరం స్విఫ్ట్ మార్కెట్లో అధిక డిమాండ్ ఏర్పడింది.  మారుతి సుజుకి హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ 2024 మొత్తం ఐదు వేరియంట్‌లలో విడుదలైంది. కానీ దాని VXI, VXI (O) వేరియంట్‌లకు మార్కెట్లో అత్యధిక డిమాండ్ ఉంది.

- Advertisement -

కారు మొత్తం బుకింగ్స్‌లో ఈ రెండు వేరియంట్‌ల వాటా 60 శాతానికి పైగా ఉంది. అయితే బేస్ వేరియంట్ LXI వాటా 11 శాతం, టాప్ వేరియంట్‌ల ZXI, ZXI+ వాటా 19 శాతం కంటే ఎక్కువ.కంపెనీ ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఈ కారు విడుదలకు ముందే 10 వేలకు పైగా బుకింగ్‌లు వచ్చాయి. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 40 వేలకు పైగా ఆర్డర్‌లు పెండింగ్‌లో ఉన్నాయి.

Also Read: సేల్స్‌లో అదరకొట్టిన నిస్సాన్ ఇండియా.. త్వరలో స్పెషల్ ఎడిషన్ లాంచ్!

మారుతి ఫోర్త్ జనరేషన్ స్విఫ్ట్‌లో కొత్త Z సిరీస్ ఇంజన్‌ను తీసుకొచ్చింది. ఇందులో మూడు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయి. కొత్త ఇంజిన్ నుండి ఇది 60 kW పవర్, 111.7 న్యూటన్ మీటర్ల టార్క్ రిలీజ్ చేస్తుంది. దీనికి 5 స్పీడ్ మ్యాన్యువల్, AMT ట్రాన్స్‌మిషన్ ఉన్నాయి. ఈ వాహనాన్ని AGS ట్రాన్స్‌మిషన్‌తో ఒక లీటర్ పెట్రోల్‌పై 25.75 కిలోమీటర్ల వరకు నడపవచ్చు. దీని మాన్యువల్ వేరియంట్‌తో వెహికల్ 24.80 కిలోమీటర్ల వరకు నడపవచ్చు.

మారుతి స్విఫ్ట్ 2024ని కంపెనీ ఐదు వేరియంట్లలో పరిచయం చేసింది. దీని బేస్ వేరియంట్  ఎక్స్-షోరూమ్ ధర రూ.6.49 లక్షల నుండి ప్రారంభమవుతుంది. అయితే దీని టాప్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.9.64 లక్షలుగా ఉంది. దాని VXI మాన్యువల్ వేరియంట్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.29 లక్షలు. VXI (O) మాన్యువల్ ఎక్స్-షోరూమ్ ధర రూ. 7.56 లక్షలుగా ఉంది.

Also Read: మహీంద్రా స్కార్పియోపై బిగ్ డీల్.. డిస్కౌంట్ ఎంతంటే?

మారుతి న్యూ స్విఫ్ట్ 2024లో కంపెనీ అనేక గొప్ప ఫీచర్లను అందించారు. ఇందులో ఆరు స్పీకర్ సెటప్, ముందు భాగంలో ట్విట్టర్, తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్, సరికొత్త సస్పెన్షన్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, సుజుకి కనెక్ట్, హైడ్రాలిక్ క్లచ్, వెనుక ఏసీ వెంట్లు, వెనుక ప్రయాణీకులు తమ ఫోన్‌లను ఛార్జ్ చేయడానికి రెండు ఛార్జింగ్ పోర్ట్‌లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, స్టీరింగ్‌పై ఆడియో నియంత్రణలు కాకుండా, క్రూయిజ్ కంట్రోల్ అలాగే ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనితో పాటు సేఫ్టీ పరంగా హిల్ హోల్డ్ అసిస్ట్, ESP, రివర్స్ పార్కింగ్ కెమెరా, ABS, EBD వంటి ఫీచర్లను అందించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News