Big Stories

Honda Freed Compact MPV: క్రేజీ అప్డేట్.. హోండా ఫ్రీడ్ నుంచి MVP వేరియంట్..!

Honda Freed Compact MPV: హోండా ఎలివేట్ SUVకి దేశీయ మార్కెట్‌లో ఊహించని స్పందన లభిస్తోంది. కంపెనీకి బెస్ట్ సెల్లింగ్ కారుగా కూడా నిలిచింది. దీంతో కంపెనీ దృష్టి ఇప్పుడు SUV వేరియంట్‌పై పడింది. మరోవైపు ఎమ్‌పివి సెగ్మెంట్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. దేశీయ ఎమ్‌పివి సెగ్మెంట్‌లో కూడా హోండా బలంగా ఉంది. ఇప్పుడు కంపెనీ జపాన్‌లో సరికొత్త హోండా ఫ్రీడ్ ఎమ్‌పివిని విడుదల చేసింది. దీని ధర 2.508 మిలియన్ యెన్ (సుమారు రూ. 13 లక్షలు) నుండి 3.437 మిలియన్ యెన్ (సుమారు రూ. 17 లక్షలు) మధ్య ఉంటుంది.

- Advertisement -

2024 హోండా ఫ్రీడ్ రెండు పవర్‌ట్రెయిన్‌లలో విడుదలైంది. 1.5L NA పెట్రోల్, e:HEV డ్యూయల్-మోటార్ సిస్టమ్‌తో మరో 1.5L పెట్రోల్ ఉన్నాయి. దీని ముందు వేరియంట్ 6,600 rpm వద్ద 118 PS, 4,300 rpm వద్ద 142 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఇది CVTతో జత చేయబడింది. ఇందులో AWD ఆప్షన్ కూడా అందుబాటులో ఉంటుంది. హోండా ఫ్రీడ్ MPV పొడవు 4,310mm, వెడల్పు 1,720mm, ఎత్తు 1,780mm, వీల్‌బేస్ 2,740mm.

- Advertisement -

Also Read: చరిత్ర సృష్టించనున్న టాటా.. నెక్సాన్ సీఎన్‌జీ ఎస్‌యూవీ.. దద్దరిల్లిపోద్ది!

హోండా e:HEV అనేది డ్యూయల్-మోటార్ హైబ్రిడ్ సిస్టమ్. ఇందులో 1.5L NA ఫోర్-పాట్ పెట్రోల్ ఇంజన్ 106 PS, 127 Nm పవర్ రిలీజ్ చేస్తుంది. ఇది 48-Ah Li-ion బ్యాటరీ, ఒక హైబ్రిడ్ సిస్టమ్‌ను కోసం 123 PS, 253 Nm రిలీజ్ చేసే ఎలక్ట్రిక్ మోటారుతో కలిపి ఉంటుంది. అవసరమైనప్పుడు వెనుక చక్రాలరకు పవర్ ఇవ్వడానికి ఇంటెలిజెంట్ పవర్ యూనిట్ (IPU), సెకండరీ ఎలక్ట్రిక్ మోటార్‌ను అందిచారు. ఇది AMDని సులభతరం చేస్తోంది.

దాని హైబ్రిడ్ వేరియంట్ 25 kmpl మైలేజీని అందిస్తోంది. నార్మల్ NA పెట్రోల్ 16.2 kmpl మైలేజీని ఇస్తోందని కంపెనీ పేర్కొంది. ఈ కారు ఇంటీరియర్ మొత్తం క్రాస్‌రోడ్ ఆధారంగా రూపొందించారు. క్రాస్‌స్టార్ వేరియంట్ గ్రిల్, క్లాడింగ్, స్కిడ్ ప్లేట్‌పై మరింత ధృడంగా ఉంటుంది. ఇంటీరియర్ కొత్త డ్యాష్‌బోర్డ్‌ను కలిగి ఉంది. ఇది లేటెస్ట్ N-బాక్స్‌ను పోలి ఉంటుంది.

Also Read: ఇక పెట్రోల్ అక్కర్లేదు గురూ.. రూ.15 వేలకే CNG.. ఏకంగా 100 కిమీ మైలేజ్

ఫ్రీడ్ ఎయిర్‌ను 6, 7 సీట్ల లేఅవుట్‌లలో కొనుగోలు చేయవచ్చు. అయితే క్రాస్‌స్టార్ 5, 5 సీట్ల కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంది. హోండా సెన్సింగ్ సూట్ MPVలో AEB (అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్), ACC (అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్), LKA (లేన్ కీప్ అసిస్ట్) వంటి ఫీచర్లతో వస్తుంది. ఈ కారు డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫాబ్రిక్ ట్రిమ్‌తో పెద్ద సెంట్రల్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రీపోజిషన్డ్ AC వెంట్స్ వంటి ఫీచర్లను పొందుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News