Big Stories

Recharge plan: మొబైల్ రీచార్జ్ ధరలు భారీగా పెంపు.. చౌక ధరల్లో జియో ప్లాన్స్

Recharge plan: మొబైల్ యూజర్లకు టెలికాం సంస్థలు షాక్ ఇచ్చాయి. భారీగా మొబైల్ రీచార్జ్ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఈ ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి. ముఖ్యంగా టెలికాం కంపెనీల్లో దిగ్గజ కంపెనీ అయిన రిలయన్స్ జియోతో సహా ఎయిల్ టెల్, వోడాఫోన్, ఐడియా కూడా రీచార్జ్ ధరల్లో మార్పులు చేశాయి. తాజా మార్పులను మిగతా కంపెనీలతో పోలిస్తే జియో అమలు చేయబోయే కొత్త ప్లాన్స్ అతి తక్కువ ధరలకు అందుబాటులో ఉండబోతున్నాయి.

- Advertisement -

కాగా, ఇటీవల జియో కంపెనీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీచార్జ్ ధరలను దాదాపు 10 నుంచి 21 శాతం వరకు పెంచిన విషయం తెలిసిందే. అయితే జియో పెంచిన అనంతరం ఎయిర్‌టెల్ కూడా 25 శాతం వరకు పెంచింది. జియో చార్జీలను పెంచినా కూడా మిగతా కంపెనీల కంటె తక్కువ ధరల్లోనే అందుబాటులో ఉంటున్నాయి. జియో 1 జీబీ డేటా అన్ లిమిటెడ్ ప్లాన్ రూ. 249లకే అందుబాటులోకి రానుంది. మరోవైపు ఎయిర్ టెల్ ప్లాన్ రూ. 299లకు అందుబాటులో ఉండనుంది. దీంతో ఎయిర్ టెల్ కంటే జియో 20 శాతం తక్కువ ధరకే ప్లాన్ ను ఇవ్వనుంది. ఇక 1.5జీబీ జియో అన్ లిమిటెడ్ ప్లాన్ కోసం రూ. 299లకు అందుబాటులోకి తెచ్చింది.

- Advertisement -

ఎయిర్‌టెల్ ప్లాన్ :

డెయిలీ 2 జీబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ప్లానింగ్ తో జియో రూ. 349లకు అందుబాటులోకి తీసుకువస్తుంది. మరోవైపు ఇదే ప్లాన్ ను ఎయిర్ టెల్ రూ. 379లకు యూజర్లకు అందిస్తుంది. దీంతో 9 శాతం తక్కువకే జియో ప్లాన్ అందిస్తుంది. జియోలో 3 నెలల ప్లాన్ 6జిబి డెటా, అన్‌లిమిటెడ్ కాలింగ్‌ను రూ. 479లకే అందుబాటులో తెచ్చింది. ఇందులో మరో రూ. 30 ఎక్కువ ధరకు ఎయిర్ టెల్ అందిస్తోంది. మరోవైపు సంవత్సరం పాటు 24 జిబీ డెటా, అన్ లిమిటెడ్ కాలింగ్ ను జియో రూ. 1899లకే అందిస్తుండగా.. ఎయిర్ టెల్ దీనిని రూ. 1999లకే అందిస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News