Big Stories

Tata Harrier EV Launch: టాటా హారియర్ ఈవీ వచ్చేస్తుంది.. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే ఏకంగా 500 కి.మీ మైలేజీ!

Tata Harrier EV to be Launch in FY2025: దేశీయ కార్ మార్కెట్‌లో టాటా కంపెనీది ప్రత్యేక శైలి. కొత్త కొత్త కార్లను పరిచయం చేస్తూ వాహన ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇప్పటికే టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల సిగ్మెంట్‌లో తన సత్తా చాటుతోంది. టాటా నెక్సాన్, టియాగో, టిగోర్, పంచ్ వంటి మోడళ్లు దేశీయ మార్కెట్‌లో అదరగొడుతున్నాయి. ఇతర కార్ కంపెనీలతో పోలిస్తే టాటా కంపెనీ ఎలక్ట్రిక్ కార్ల కేటగిరీలో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది.

- Advertisement -

ఇదిలా ఉంటే టాటా కంపెనీ ఇప్పుడు మరొక మోడల్‌ను మార్కెట్‌లో దించేందుకు సిద్ధమవుతోంది. టాటా మోటార్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మార్చి 31, 2025తో ముగిసే నాటికి టాటా హారియర్ ఈవీని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. వచ్చేఏడాది 2025లో హానిచన్ ఈవీ అండ్ హారియర్ పెట్రోల్ వెర్షన్లను లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

Also Read: టాటా మోటార్స్‌లో డిస్కౌంట్ల జాతరే జాతర.. ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్లీ కొనలేరు

ఇప్పటికే హారియర్ డీజిల్ వెర్షన్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. అందువల్ల త్వరలో పెట్రోల్ వెర్షన్‌ను కూడా పరిచయం చేసే ఛాన్స్ ఉందని అంటున్నారు. అయితే దీనికి సంబంధించి టాటా కంపెనీ నుంచి ఎలాంటి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాలేదు. కానీ కొన్ని నివేదికల ప్రకారం.. భారతీయ మార్కెట్‌లోకి రాబోయే టాటా హారియర్ ఎలక్ట్రిక్ వెహికల్ దాదాపు 60kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంటుందని అంచనా వేయబడింది. అదే సమయంలో దీనికి ఒక్కసారి ఛార్జింగ్‌ పెడితే సుమారు 500 కిలోమీటర్ల మైలేజీ అందిస్తుందని సమాచారం. అంతేకాకుండా అదనంగా హారియర్ EV ఆల్-వీల్-డ్రైవ్ కాన్ఫిగరేషన్‌ను అందిస్తూ.. రెండు యాక్సిల్స్‌లో ఎలక్ట్రిక్ మోటార్లు అమర్చబడి ఉంటుందని భావిస్తున్నారు.

ఇకపోతే హారియర్ EV డిజైన్‌ ఆటో ఎక్స్‌పో 2023లో ప్రదర్శించబడిన కాన్సెప్ట్‌ను చాలా దగ్గరగా పోలి ఉంటుందని భావిస్తున్నారు. ప్రొడక్షన్ మోడల్‌లో క్లోజ్డ్ ఆఫ్ గ్రిల్ ఏరియా, కొత్త ఫ్రంట్, రియర్ బంపర్‌లు, కూపే లాంటి రూఫ్‌లైన్ వంటి ఫీచర్లు ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ ఎస్యూవీలో 12.3 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది.

Also Read: Maruti Suzuki Wagon R: చెబితే నమ్మరు.. రూ.1.5 లక్షలకే మారుతీ వ్యాగన్ ఆర్.. కిర్రాక్ డీల్ మామ!

అంతేకాకుండా ఇందులో 10.25 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేస్.. అలాగే వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 6-వే పవర్ డ్రైవర్ సీట్, డ్యూయల్ జోన్ ఆటోమేటిక్ ఏసీ, వంటి ఫీచర్లతో ఈ హారియర్ ఎస్యూవీ వచ్చే ఏడాదిలో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు. ఇక దీని ధర విషయానికొస్తే.. అందుతున్న సమాచారం ప్రకారం.. హారియర్ ఈవీ రూ.30 లక్షల (ఎక్స్ షోరూమ్) ధరకు లాంచ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే టాటా కంపెనీ తన లైనప్‌లో ఉన్న మరో ఉత్తమమైన మోడల్ నెక్సాన్ సిఎన్‌జీ వేరియంట్‌ను మరికొన్ని నెలల్లో లాంచ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News