Big Stories

Tata Altroz Racer Review: ఆల్ట్రోజ్ రేసర్‌ కొంటున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Should know Before Buying Tata Altroz Racer: ప్రస్తుతం ప్రజలు తమ బడ్జెట్‌లో ఏ కారు సరిపోతుందో తెలియక చాలా అయోమయంలో ఉన్నారు. అటువంటి పరిస్థితిలో ఏదైనా కారును కొనుగోలు చేసే ముందు దాని గురించి పూర్తి సమాచారం తెలుసుకుంటే మంచిది. ఇలా చేయడం ద్వారా నష్టపోకుండా మంచి కారును ఎంచుకోవచ్చు. అయితే టాటా నుంచి వచ్చిన ఆల్ట్రోజ్ లేటెస్ట్ వేరియంట్ రేసర్‌ను కొనుగోలు చేసేందుకు ఇంటరెస్ట్ చూపుతున్నారు. మీచు కూడా ఈ లిస్టులో ఉండినట్లయితే.. ఈ కారు ఇంజన్, లేటెస్ట్ ఫీచర్లు, ధర తదితర వివరాలపై ఓ లుక్కేయండి.

- Advertisement -

కంపెనీ టాటా ఆల్ట్రోజ్ రేసర్‌ ఫుల్ సైజ్ హాట్ హాచ్ కారు. ఇందులో కంపెనీ iTurbo ఇంజన్‌ను అందించింది. ఈ టాటా కారు చాలా బెటర్‌గా పర్ఫామ్ చేస్తుంది. ఇది చాలా శక్తివంతమైనది కూడా. అలానే ఈ కారులో స్పోర్టీ లుక్ కోసం అనేక ఫీచర్లు ఉన్నాయి. ఈ టాటా కారు 120బిహెచ్‌పి పవర్, 30ఎన్ఎమ్ టార్క్ రిలీజ్ చేస్తుంది. అయితే ఈ కారు టాప్, క్యాబిన్ మంచి ఫినిషింగ్‌తో వస్తాయి.

- Advertisement -

ఈ టాటా కారులో టచ్ స్క్రీన్ సౌకర్యంతో కూడిన పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనిని రెండు విధాలుగా ఉపయోగించవచ్చు. సేఫ్టీ కోసం ఈ కారులో 360 డిగ్రీల కెమెరా ఉంటుంది. ఈ టాటా కారులో కొత్త స్టీరింగ్ వీల్, కొత్త షిఫ్టర్ కూడా ఉన్నాయి. ఇది చాలా కంఫర్ట్ ఫీల్‌ను ఇస్తుంది.

Also Read: 2024 Nissan X-Trail SUV: నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ లాంచ్‌కు సిద్ధం.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

ఈ టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు స్పోర్టీ లుక్‌తో వస్తుంది. ఈ కారులో డిఫాల్ట్ స్పోర్ట్ డ్రైవ్ మోడ్‌ను తీసుకొచ్చారు. టర్బో మోడ్ సహాయంతో ఈ కారు పీక్ టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. ఈ కారులో ఇన్స్టాల్ చేయబడిన గేర్ బాక్స్ కాస్త డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ టాటా రేసర్ కారును ఆటోమేటిక్ డీసీఏ వేరియంట్‌తో మార్కెట్లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది.

టాటా హ్యాచ్‌బ్యాక్ రేసర్ కారు డ్రైవింగ్ గురించి మాట్లాడితే ఈ కారు లుక్స్‌లో అద్బుతంగా ఉన్నప్పటికీ పర్ఫామెన్స్ పరంగా ఏమాత్రం తక్కువ కాదు. iTurbo ఇంజన్‌తో కూడిన ఈ టాటా రేసర్ కారులో అనేక అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. టాటా ఆల్ట్రోజ్ రేసర్ కారు ఆటోమేటిక్ వేరియంట్‌లో మరింత అట్రాక్ట్‌గా ఉంటుంది. ఈ కారు మార్కెట్‌లో మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర సుమారు రూ. 6.65 లక్షలు. మీ బడ్జెట్ సుమారు 7 నుండి 8 లక్షలు ఉంటే ఈ కారు బెస్ట్ ఆప్షన్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News