Big Stories

LPG Scooters: స్కూటర్లకు LPG కిట్లు.. గ్యాస్ ఎలా నింపుతారు..? మైలేజీ ఎంత ఇస్తుందో తెలుసా..?

LPG Scooters: త్వరలో రోడ్లపైకి CNG బైక్‌లు రాబోతున్నాయని మందరికి తెలిసిందే. ఈ బైక్‌ల భవిష్యత్తు ఎలా ఉంటుంది? ఇది పెట్రోల్ బైక్‌ల ప్లేస్‌ను రీప్లేస్ చేయగలదా? పెట్రోల్ బైక్‌ల కంటే వాటి రన్నింగ్ కాస్ట్ తక్కువగా ఉంటుందా? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు ఈ మోటార్ సైకిళ్ల రాక తర్వాత మాత్రమే అందుబాటులోకి వస్తాయి. అయితే వీటన్నింటి మధ్య ఓ పెద్ద వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పుడు కొన్ని స్కూటర్లకు LPG కిట్‌‌లు రానున్నాయి. అంటే ద్విచక్ర వాహనం ఇప్పుడు లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్‌తో నడుస్తుంది.

- Advertisement -

LPG అనేది అనేక హైడ్రోకార్బన్ వాయువుల మిశ్రమం, దీనిని మనం మన ఇళ్లలో వంట చేయడానికి లేదా ఇతర వస్తువులకు, కొన్ని చిన్న వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తాము. ఈ గ్యాస్‌తో వాహనాన్ని నడపడంపై చర్చ జరగడం ఇదే మొదటిసారి కాదు. గతంలో మారుతీ సుజుకీ ఎల్‌పిజి గ్యాస్‌తో నడిచే కారును ప్రవేశపెట్టింది. LPG సిలిండర్‌తో వచ్చిన ఫేమస్ కార్లలో WagonR ఒకటి.

- Advertisement -

ఈ ప్రయోగం తర్వాత ముఖ్యంగా నగరంలోని పెట్రోల్ బంక్‌లు వద్ద ఒకటి లేదా రెండు LPG గ్యాస్ ఫిల్లింగ్ మెషీన్‌లను ఏర్పాటు చేశారు. కానీ కాలానుగుణంగా గ్యాస్ సరఫరా ఆలస్యం లేదా అందుబాటులో లేకపోవడంతో ఈ వాహనాలు విజయవంతం కాలేదు. ఇది కాకుండా LPG గ్యాస్‌తో నడిచే వాహనాలు పెట్రోల్‌తో పోలిస్తే తక్కువ పవర్, టార్క్‌ను రీలీజ్ చేస్తాయి. దీని కారణంగా వాహనం స్పీడ్, పికప్ తక్కువగా ఉంటుంది. గ్యాస్‌తో నడిచేటప్పుడు కారుకు మరింత మెయింటెనెన్స్ అవసరం. ఇంజన్‌పై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఇంజన్ పార్ట్స్ త్వరగా అరిగిపోతాయి. ఇప్పుడు చాలా వరకు LPG ఫిల్లింగ్ స్టేషన్లు మూతపడ్డాయి. ఎల్‌పీజీతో నడిచే స్కూటర్లకు కూడా ఇదే సవాలు ఎదురవుతుంది.

Also Read: లిమిటెడ్ ఆఫర్.. కారుపై రూ.2.62 లక్షల డిస్కౌంట్!

మీడియా నివేదికల ప్రకారం తమిళనాడుకు చెందిన కంపెనీ KR ఫ్యూయెల్స్ ఆటో LPG ఇండస్ట్రీ ద్విచక్ర వాహనాల కోసం LPG కన్వర్టర్ కిట్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి అనుమతి పొందింది. దీని తరువాత LPG పవర్డ్ స్కూటర్ల గురించి భారీగా చర్చ నడుస్తోంది. చెప్పాలంటే BS 4-కంప్లైంట్ స్కూటర్లలో LPG రెట్రోఫిట్‌మెంట్ కిట్‌లను ఇన్‌స్టాల్ చేయడానికి కంపెనీ ధృవీకరణను పొందింది. దీని వెనుక ఉన్న ఆలోచన ఖర్చులు, కాలుష్యాన్ని తగ్గించడమేనని కంపెనీ వెల్లడించింది.

పాత స్కూటర్‌లో ఎల్‌పీజీ కిట్‌ను అమర్చాలంటే దాదాపు రూ.15,000 ఖర్చవుతుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ స్కూటర్ ఎంత మైలేజీని ఇస్తుంది? అందులో ఎన్ని కేజీల సిలిండర్లు ఉంటాయి. అది ఎలా పని చేస్తుంది, ఎక్కడ, ఎలా గ్యాస్ నింపుతారు అనే విషయాలను కంపెనీ ఇంకా బయటకురాలేదు.

Also Read: టాటా హారియర్ EV.. మైండ్ బ్లాక్ చేస్తున్న ఫీచర్లు.. వేరే లెవల్ అంతే!

బజాజ్ తన CNG బైక్‌ను తీసుకురాబోతోంది. ఇందులో 125సీసీ ఇంజన్ ఉంటుంది. ఈ కొత్త బైక్‌ను 2024 జూలై 5న విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇటీవల ఈ బైక్‌ను పరీక్షిస్తున్న సమయంలో గుర్తించారు. పెట్రోల్‌తో పోలిస్తే CNG బైక్‌లో ఇంధన వినియోగం దాదాపు 50 శాతం తగ్గుతుంది. ఇది కాలుష్యం, నిర్వహణ ఖర్చులను తగ్గిస్తుంది. కొత్త బైక్‌లో భద్రత కోసం డిస్క్ బ్రేక్, సింగిల్ పీస్ సీటు ఉంటుంది. CNG బైక్‌లో అల్లాయ్ వీల్స్, డిజిటల్ కన్సోల్, సౌకర్యవంతమైన టెలిస్కోపిక్ ఫోర్కులు. వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉంటాయి. ప్రస్తుతం కంపెనీ దీని ధరను వెల్లడించలేదు. ఈ బైక్ ధర రూ.లక్ష నుంచి ప్రారంభం కావచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News