Big Stories

Stock market: స్టాక్‌మార్కెట్ ఓపెనింగ్ అదుర్స్, 80వేల మార్క్‌ని టచ్ చేసిన..

Stock market: బాంబే మార్కెట్ సరికొత్త రికార్డును నమోదు చేసింది. బుధవారం ఉదయం లాభాలతో ప్రారంభమైంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో మార్కెట్ జోరందుకుంది. కాసేపటికే బీఎస్ఈ 80 వేల బెంచ్ మార్క్‌ని తాకి సరికొత్త రికార్డు నమోదు చేసింది.

- Advertisement -

బుధవారం ఉదయం 9 గంటల 24 గంటలకు మార్కెట్ ఓపెన్ అయ్యింది. ఆ సమయంలో సెన్సెక్స్‌ 487 పాయింట్ల లాభంతో 79,928 వద్ద ట్రేడవుతోంది. కాసేపటికి 80 వేల మార్క్‌ని టచ్ చేసి కొత్త రికార్డును నెలకొల్పింది. దాదాపు 13 మేజర్ సెక్టార్లు జోరందుకున్నాయి. అటు నిఫ్టీ 104 పాయింట్లు పుంజుకొని 24,228 దగ్గర ట్రేడ్ అవుతోంది.

- Advertisement -

మధుపరులు కొనుగోళ్లకు పాల్పడడంతో బ్యాంకింగ్ జోరందుకున్నాయి.  సెన్సెక్స్‌-30 సూచీలో హెచ్డీఎఫ్‌సీ, ఫైనాల్సియల్, ప్రైవేటు బ్యాంకులు, ఐటీసీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, నెస్లే ఇండియా, టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌యూఎల్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. సన్‌ఫార్మా, టీసీఎస్‌, ఇన్ఫోసిస్‌, టెక్‌ మహీంద్రా, టైటన్‌, పవర్‌గ్రిడ్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

ALSO READ: దిమాక్ కరాబ్ బైక్స్.. త్వరలో లాంచ్.. క్రేజ్ వేరే లెవల్!

ఇక డాలర్‌తో పొలిస్తే రూపాయి మారకం విలువ రూ 83. 53 వద్ద ప్రారంభమైంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర 86.6 అమెరికన్ డాలర్ల వద్ద కొనసాగుతోంది. అటు అమెరికా మార్కెట్లు గడిచిన సెషన్‌లో లాభాలతో ముగిశాయి. దాని ప్రభావం ఆసియా మార్కెట్లపై పడింది. మరి బాంబే స్టాక్ మార్కెట్ రోజంతా ఇదే జోరు కొనసాగుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. మధుపరులు సైతం మార్కెట్ హెచ్చుతగ్గులను గమనిస్తున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News