Big Stories

SBI Plans to Expand Branch Network: పెరగనున్న ఎస్‌బీఐ బ్రాంచ్‌లు..ఇక నిమిషాల్లోనే!

SBI Plans to Expand Branch Network: దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ బ్యాంకు.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. తన నెట్ వర్క్‌ను మరింత విస్తరించుకునే దిశగా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే దేశ వ్యాప్తంగా 400బ్రాంచ్‌లు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. గతేడాది 137 శాఖలను ప్రారంభించగా.. ఇందులో 59 బ్రాంచ్‌లు గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రారంభించింది.

- Advertisement -

అయితే, ప్రస్తుతం కొన్ని బ్యాంకులో డిజిటల్ లావాదేవీలు కొనసాగుతున్నాయి. అలాగే ప్రతి బ్యాంకులోనూ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఈ నేపథ్యంలో ప్రతి వినియోగదారుడు ఆన్ లైన్ లేదా డిజిటల్ విధానాన్ని ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ప్రత్యేకంగా బ్యాంకులకు సంబంధించిన యాప్‌ల ద్వారా సేవలు పొందుతున్నారు. ఇలాంటి తరుణంలో ఎస్‌బీఐ ఏకంగా 400 బ్రాంచ్‌లను ఓపెన్ చేయనున్నట్లు ఇటీవల ప్రకటన వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.

- Advertisement -

ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ బ్రాంచ్‌లు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలల్లో బ్రాంచ్‌లు ఉండగా.. కొత్త బ్రాంచ్‌లు ఎందుకు అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఈ విషయంపై ఎస్‌బీఐ స్పందించింది. 89 శాతం వరకు డిజిటల్ సేవలు జరుగుతున్నాయి. అలాగే 98శాతం వరకు లావాదేవీలు సైతం జరుగుతుండగా.. కొత్త బ్రాంచ్‌లు అవసరం లేదు కదా? అనుకుంటారు. కానీ, ఆన్‌లైన్ లావాదేవీలు జరుగుతున్నప్పటికీ..కొత్త కొత్త విభాగాలు పుట్టుకొస్తున్నాయి. కావున కొత్త బ్రాంచ్‌లు అవసరముందని బ్యాంక్ తెలిపింది. ఎందుకంటే వెల్త్ అండ్ అడ్వైజరీలకు సంబంధించిన సర్వీసులు బ్యాంకుల్లోనే జరుగుతున్నందున..కస్టమర్లు బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుందని తెలిపింది.

Also Read: స్టాక్‌మార్కెట్ ఓపెనింగ్ అదుర్స్, 80వేల మార్క్‌ని టచ్ చేసిన..

దేశ వ్యాప్తంగా ఎస్‌బీఐ బ్రాంచ్‌లు 2024 మార్చి వరకు చూస్తే.. 22,542 బ్రాంచ్‌లు ఉన్నాయి. అలాగే ఇందులో అనుబంధ సంస్థలుగా ఎస్‌బీఐ ఇన్సూరెన్స్, ఎస్‌బీఐ పేమెంట్ సర్వీసెస్ వంటివి ఉన్నాయి. ఈ అనుంబంధ సంస్థల కార్యకాలపాలను మరింత విస్తరించిన తర్వాత..వీటిని ఎక్స్చేంజీలో నమోదు చేయనుంది. అయితే ఎక్కడ ఎక్కువగా సేవలు అవసరమున్నాయో.. ఆ ప్రాంతాలను గుర్తించనున్నారు. తర్వాత అక్కడ కొత్తగా బ్రాంచ్‌లను ఓపెన్ చేసేందుకు అవకాశం ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News