Big Stories

Full Size SUV Sales May 2024: డిమాండ్ తగ్గేలా లేదు.. దూసుకెళ్తున్న ఫుల్ సైజ్ ఎస్‌యూవీ అమ్మకాలు!

Full Size SUV Sales May 2024: దేశంలో ప్రతి నెలా లక్షల వాహనాలు అమ్ముడవుతున్నాయి. వీటిలో ఎస్‌యూవీ సెగ్మెంట్ వాహనాలకు అత్యధిక డిమాండ్ ఉంది. SUV సెగ్మెంట్ వాహనాలు మార్కెట్‌లోని ఇతర సెగ్మెంట్‌లతో పోలిస్తే ఎక్కువ సేల్స్ నమోదు చేస్తున్నాయి. Toyota, MG, Skoda వంటి కంపెనీలు అందించే SUVలు మే 2024లో అత్యధిక అమ్మకాలను సాధించాయి. ఏ కంపెనీకి చెందిన ఫుల్ సైజ్ SUVకి అత్యధిక డిమాండ్ ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Toyota Fortuner
టయోటా ఫార్చ్యూనర్‌ను టయోటా ఫుల్ సైజ్‌ SUVగా అందిస్తోంది. కంపెనీ ఈ SUVలను మొత్తం 2422 యూనిట్లు మే 2024లో అమ్మకాలు జరిపింది. దీనితో పాటు టాప్-5 ఫుల్ సైజ్ ఎస్‌యూవీల జాబితాలో నంబర్-1 స్థానంలో నిలిచింది. కానీ ఏడాది ప్రాతిపదికన చూస్తే ఈ SUV డిమాండ్‌లో 16 శాతం క్షీణత ఉంది. గత సంవత్సరం మే నెలలో కంపెనీ ఈ SUVని మొత్తం 2887 యూనిట్లను సెల్ చేసింది.

- Advertisement -

Also Read: జీప్ నుంచి చౌకైన SUV.. ధర ఎంతంటే?

MG Gloster
గ్లోస్టర్ భారతదేశంలో ఫుల్ సైజ్ SUV సెగ్మెంట్‌లో బ్రిటిష్ కార్ల తయారీ సంస్థ MG మోటార్స్ అందించింది. కంపెనీ ఈ SUV మొత్తం 135 యూనిట్లు మే 2024లో విక్రయించబడ్డాయి. మే 2023లో మొత్తం 217 యూనిట్ల గ్లోస్టర్ అమ్ముబయ్యాయి. నివేదికల ప్రకారం SUV విక్రయాలలో 38 శాతం క్షీణత ఉంది.

Skoda Kodiaq
స్కోడా కొడియాక్ కూడా ఈ జాబితాలో మూడవ స్థానంలో కొనసాగింది. మే 2024లో కంపెనీ ఈ SUV మొత్తం 185 యూనిట్లను విక్రయించింది. గత సంవత్సరం ఈ SUV మొత్తం 157 యూనిట్లు భారతీయ మార్కెట్లో విక్రయించబడ్డాయి. ఏడాది ప్రాతిపదికన కంపెనీ 18 శాతం వృద్ధిని నమోదు చేసింది.

Also Read: మహీంద్రా నుంచి కొత్త పికప్ ట్రక్.. రూ. 25 లక్షలతో త్వరలో లాంచ్!

Volkswagen Tiguan
జర్మన్ కార్ కంపెనీ వోక్స్‌వ్యాగన్ కూడా టిగువాన్‌ను ఫుల్ సైజ్ SUV సెగ్మెంట్‌లో అందిస్తోంది. కంపెనీ  ఈ SUVలను మొత్తం 102 యూనిట్లు మే 2024లో సేల్ అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మేలో 40 శాతం క్షీణత నమోదైంది. మే 2023లో టిగువాన్ మొత్తం అమ్మకాలు 171 యూనిట్లుగా ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News