Big Stories

Royal Enfield Guerrilla 450: రాయల్ ఎన్‌ఫీల్డ్ నుంచి కొత్త బైక్ రెడీ.. లాంచ్ డేట్, ధర, స్పెసిఫికేషన్లు ఇవే..!

Royal Enfield Guerrilla 450 Launch in india soon: రాయల్ ఎన్‌ఫీల్డ్.. ఈ పేరు వినగానే యూత్‌లో ఏదో తెలియని గూస్ బంప్స్. ఆ బైక్ సౌండ్ వారిలో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అందువల్లనే ఈ బైక్‌లకు దేశీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో సూపర్ క్రేజ్‌ ఉంది. దీని కారణంగానే ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో ఈ కంపెనీ నుంచి కొత్త కొత్త బైక్‌లు మార్కెట్‌లోకి వస్తున్నాయంటే బైక్ ప్రియులు ఎగబడి కొనేస్తుంటారు. ఇందులో భాగంగానే కంపెనీ బైక్ ప్రియుల టేస్ట్‌కు తగ్గట్టుగా మరొక కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది.

- Advertisement -

తాజాగా ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌ లాంచ్ పై ఓ అప్డేట్ వచ్చింది. కంపెనీ త్వరలో ‘రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450’ బైక్‌ను మార్కెట్‌లో తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ఈ బైక్ టీజర్‌ను రిలీజ్ చేసింది. అంతేకాకుండా ఈ బైక్ లాంచ్ పై కూడా అప్డేట్ అందించింది. వచ్చే నెల అంటే జూలై 17న రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ గ్లోబల్ వైడ్‌గా లాంచ్ ఉంటుందని చెప్పుకొచ్చింది. దీంతో ఈ బైక్ కోసం వాహన ప్రియులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పుడు దీనికి సంబంధించి పూర్తి స్పెసిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

ఈ కొత్త గెరిల్లా 450 బైక్‌లో రౌండ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ ఉండనుంది. అంతేకాకుండా నావిగేషన్స్‌తో పాటు మరిన్ని కనెక్టివిటీ ఆప్షన్లను కూడా ఇందులో అందించే ఛాన్స్ ఉంటుంది. ఈ గెరిల్లా 450 బైక్‌లో డిఫరెంట్ రైడింగ్ ట్రయాంగిల్స్, ఫ్లాట్ హ్యాండిల్ బార్, రోడ్ బయాస్డ్ టైర్ల‌తో అల్లాయ్ వీల్స్ వంటివి ఉన్నాయి. కాగా ఈ బైక్‌లో 452సిసి సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉండనుంది. అలాగే ఇది 39bhp పవర్, 40nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

Also Read: రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450.. ధర, లాంచ్ వివరాలివే!

కొత్త హిమాలయన్ ఫ్లాట్ ఫార్మ్ ఆధారంగా రూపొందుతున్న సెకండ్ బైక్ రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450. ఇందులో కొత్తగా డెవలప్ చేసిన 450 ఇంజిన్ ఉంటుంది. అంతేకాకుండా ఎల్‌ఈడీ ఇండికేటర్లు, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు వంటివి హిమాలయాన్ బైక్ నుంచి తీసుకువచ్చారు. అలాగే ఇందులో ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులను అందించారు. బ్యాక్ సైడ్ ప్రీలోడ్ మోనోషాక్ సస్సెన్షన్ సెటప్ వంటివి ఉండే అవకాశం ఉంది.

వీటితో పాటు గెరిల్లా 450 బైక్‌లో 6స్పీడ్ గేర్ బాక్స్‌ని అందించే ఛాన్స్ ఉంది. అయితే ఈ బైక్ గ్లోబల్‌గా 2024 జూలై 17న లాంచ్ కానుండగా.. ఇండియాలో మాత్రం వచ్చే ఏడాది సంక్రాంతి సీజన్ సమయంలో లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక ఈ కొత్త రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 బైక్ ధర విషయానికొస్తే.. ఇది సుమారు రూ.2.6 లక్షలకు పైగా ఎక్స్ షోరూమ్ ధరతో లాంచ్ అవుతుందని అంచనా వేయబడింది. కాగా ఈ బైక్.. ట్రయంఫ్ స్పీడ్ 400, యెజ్డీ రోడ్‌స్టర్, హార్లీ డేవిడ్‌సన్ ఎక్స్ 440 వంటి ఖరీదైన బైక్‌లకు గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. త్వరలో ఈ బైక్‌కు సబంధించిన మరిన్ని స్పెసిఫికేషన్లు వెల్లడికానున్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News