Big Stories

Royal Enfield Guerrilla 450 Teased: రేసింగ్ థ్రిల్లర్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్.. ఊపేస్తున్న లుక్!

Royal Enfield Guerrilla 450 Teased: రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను చాలా మంది స్టేటస్‌కు సింబల్‌గా భావిస్తారు. ధడ్‌ధడ్ మంటూ ఈ బైక్ ఇచ్చే శబ్ధం బైక్ లవర్స్‌ను వేరే ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఆ బైక్ డ్రైవ్ చేస్తే వచ్చే మజానే వేరు. ఈ క్రేజ్ నేపథ్యంలోనే రాయల్ ఎన్‌ఫీల్డ్ తన బ్రాండ్ నుంచి కొత్త గెరిల్లా 450 రోడ్‌స్టర్‌ను త్వరలో తీసుకురానుంది. కంపెనీ దీని లుక్‌‌ను తాజాగా టీజ్ చేసింది. ఇది రేసింగ్ ప్రియుల హృదాయాలను కట్టిపడేస్తోంది. అంతేకాకుండా బైక్  గ్లోబల్ ప్రీమియర్ జూలై 17, 2024 న ఉంటుందని ప్రకటించారు. రాయల్ ఎన్‌ఫీల్డ్ ఈ స్పెషల్ బైక్ గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

హిమాలయన్ ఏ ప్లాట్‌ఫామ్ అయితే తయారైందో గెరిల్లా 450 కూడా అదే ఫ్లాట్‌ఫామ్ మీద తీసుకొస్తున్నారు. ఈ ఫ్లాట్‌‌ఫామ్ నిర్మించిన రెండో బైక్ ఇది. ఇందులో కొత్తగా డెవలప్ చేసిన షెర్పా 450 ఇంజన్ ఉంటుంది. టీజర్‌లో చూపించిన కొన్ని ప్రత్యేక విషయాల గురించి చెప్పాలంటే.. రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో హిమాలయన్ వంటి LED హెడ్‌ల్యాంప్‌లు, LED ఇండికేటర్స్ ఉంటాయి.

- Advertisement -

Also Read: స్టైలిష్ ‌లుక్స్‌‌తో అదరిపోయే బైకులు.. కేకపెట్టిస్తున్న డిజైన్, మైలేజ్!

ఇది కాకుండా ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్‌లో టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్కులు కనిపిస్తాయి. ఇది వెనుకవైపు ప్రీలోడ్ మోనోషాక్ సస్పెన్షన్‌ను కలిగి ఉంటుంది. అంతే కాకుండా గుండ్రని డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్ అందుబాటులో ఉంటుంది. ఇది నావిగేషన్ వంటి కనెక్టివిటీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

అట్రాక్టివ్ రైడింగ్ అనుభవం కోసం రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 ఫ్లాట్ హ్యాండిల్ బార్, అల్లాయ్ వీల్స్, రోడ్-ఓరియెంటెడ్ టైర్లు ఉంటాయి. ఇందులో ప్రత్యేకమైన రైడింగ్ ట్రయాంగిల్‌ను కలిగి ఉంది. ఈ బైక్ హిమాలయన్ 450 కంటే చాలా తేలికగా ఉంటుంది. అయితే ఇది ఎంత తేలికగా ఉంటుందో ఇంకా స్పష్టంగా తెలియలేదు.

పవర్‌ఫుల్ పర్ఫామెన్స్ కోసం రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450లో హిమాలయన్‌లో కనిపించే 452cc, సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజన్‌ను ఉంటుంది. ఈ ఇంజన్ దాదాపు 39బిహెచ్‌పి పవర్, 40ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. గెరిల్లా 450 కూడా అదే పవర్, టార్క్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అయితే 6-స్పీడ్ గేర్‌బాక్స్‌లో గేర్ ప్రాపర్టీస్‌లో మార్పులు ఉండవచ్చు.

రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 గురించిన మరిన్ని వివరాలు వచ్చే నెలలో బయటకు వచ్చే అవకాశం ఉంది. ప్రీమియర్‌కు ముందు కంపెనీ మరిన్ని టీజర్‌లను విడుదల చేయవచ్చు. భారతదేశంలో గెరిల్లా 450 లాంచ్ పండుగ సీజన్‌కు దగ్గరగా జరిగే అవకాశం ఉంది. దీని ధర రూ. 2.6 లక్షలు (ఎక్స్-షోరూమ్) కంటే ఎక్కువగా ఉండవచ్చని అంచనా.

Also Read: బైక్ లవర్స్‌కు పండగే.. డూకాటి నుంచి స్పోర్టీ బైక్.. కెటిఎమ్ కోసమేనా?

ఈ రాయల్ ఎన్ఫీల్డ్ గెరిల్లా 450 మార్కెట్‌లో ఉన్న హార్లే-డేవిడ్సన్ X440, ట్రయంఫ్ స్పీడ్ 400, BMW G 310 R, Yezdi రోడ్‌స్టర్, ఇతర బైక్‌లతో పోటీపడుతుంది. ఓవరాల్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్ గెరిల్లా 450 ఒక సింప్లీ రేసింగ్ బైక్‌గా ఉండబోతోంది. ఇది బైక్ ప్రియులకు రైడింగ్‌లో కొత్త థ్రిల్‌ను కలిగిస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News