Big Stories

Discount on Renault Cars: ఇచ్చిపడేశాడు బ్రో.. ఈ కార్లపై ఊహకందని డిస్కౌంట్.. ఆఫర్ కొద్ది రోజులే!

Huge Discount Offers on Renault Kiger, Triber and Kwid Car on June Month: ప్రస్తుతం మార్కెట్‌లోకి రకరకాల కంపెనీలు తమ కార్లను లాంచ్ చేస్తున్నాయి. కొన్ని కంపెనీలు అద్భుతమైన ఫీచర్లు గల కార్లను అధిక ధరకు తీసుకొస్తుంటే.. మరికొన్ని కంపెనీలు తక్కువ ధరలో తమ కార్లను రిలీజ్ చేస్తున్నాయి. అయితే ఇంకొన్ని కంపెనీలు మాత్రం తమ కార్ సేల్స్ మరింత పెంచుకునేందుకు ఎప్పటికప్పుడు భారీ డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. అదే క్రమంలో ఈ జూన్‌లో రెనాల్ట్ ఇండియా తన మొత్తం శ్రేణి కార్లపై డిస్కౌంట్లను అందిస్తోంది.

- Advertisement -

అందులో కిగర్ కాంపాక్ట్ SUV, క్విడ్ హ్యాచ్‌బ్యాక్, ట్రైబర్ సెవెన్-సీటర్ వంటి మోడళ్లు ఉన్నాయి. అంతేకాకుండా కొనుగోలుదారులు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, లాయల్టీ బోనస్, అదనపు రిఫరల్, కార్పొరేట్, లాయల్టీ ప్రయోజనాలను కూడా పొందవచ్చు. కొత్త రెనాల్ట్ కొనుగోలుపై మీరు ఎంత ఆదా చేయవచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: ఇరగదీసిండు.. సింగిల్ ఛార్జింగ్‌తో 400 కి.మీ మైలేజీ.. కొత్త రెనాల్ట్ కార్ అదిరిపోయింది బాసు..!

రెనాల్ట్ కిగర్:

రెనాల్ట్ కిగర్ రూ. 40,000 వరకు విలువైన ప్రయోజనాలతో అందించబడుతోంది. వీటిలో రూ. 15,000 నగదు తగ్గింపు, రూ. 15,000 వరకు ఎక్స్ఛేంజ్ ప్రయోజనాలు, రూ. 10,000 లాయల్టీ బోనస్ వంటివి ఉన్నాయి. Kiger ధర రూ. 6 లక్షల నుండి రూ. 11.23 లక్షల మధ్య ఉంది. ఇందులో రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి. అందులో 72hp, 1.0-లీటర్ NA పెట్రోల్ యూనిట్ లేదా 100hp, 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఉన్నాయి. రెండూ మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లను అందిస్తాయి.

రెనాల్ట్ ట్రైబర్:

రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు ఏడు సీట్లను కలిగి ఉంటుంది. దీనిపై ఇప్పుడు రూ. 45,000 వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ఇది గత నెల కంటే రూ. 10,000 ఎక్కువ డిస్కౌంట్‌తో వచ్చింది. ఈ రెనాల్ట్ ట్రైబర్ రూ. 6 లక్షల నుండి రూ. 8.97 లక్షల ధరతో అందుబాటులో ఉంది. ట్రైబర్‌కి కిగర్ మాదిరిగానే 72 హెచ్‌పి, 1.0-లీటర్ NA పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా ఆప్షనల్ AMTతో వస్తుంది.

Also Read: మహీంద్రా స్కార్పియో ఎన్​ ఆన్​రోడ్​ ధరలు హైదరాబాద్‌లో ఎలా ఉన్నాయంటే..?

రెనాల్ట్ క్విడ్:

రెనాల్ట్ దాని ఎంట్రీ-లెవల్ హ్యాచ్ క్విడ్‌పై రూ. 40,000 వరకు ప్రయోజనాలను అందిస్తోంది. దీని ధర రూ. 4.70 లక్షల నుండి రూ. 6.45 లక్షల మధ్య ఉంది. ఈ Kwid 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో 68hp, 91Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ MT లేదా ఆప్షనల్ 5-స్పీడ్ AMTతో వస్తుంది.

అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. డిస్కౌంట్‌లు నగరం నుండి నగరానికి మారుతూ ఉంటాయి. అంతేకాకుండా స్టాక్‌ను బట్టి కూడా ఈ డిస్కౌంట్ ఆపర్లు లభిస్తాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News