Big Stories

Renault Kiger Sporty: రెనాల్ట్ కిగర్ నుంచి స్పోర్టియర్ వెహికల్.. ఫీచర్లు మాములుగా లేవు!

Renault Kiger Sporty: ఫ్రెంచ్ కార్ మేకర్ అయిన రెనాల్ట్ ప్రస్తుతం భారతదేశంలో మూడు మోడళ్లను అందిస్తుంది. వీటిలో క్విడ్ హ్యాచ్‌బ్యాక్, కిగర్ సబ్-కాంపాక్ట్ SUV, ట్రైబర్ కాంపాక్ట్ SUV  వెహికల్స్ ఉన్నాయి. అయితే కంపెనీ ఈ ఏడాదిలో కొత్త జనరేషన్ డస్టర్ 5- 7 సీటర్ వెహికల్, ఒక EVని లాంచే చేయనుంది. రాబోయే మూడేళ్లలో 5 కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నట్లు వెల్లడించింది. ఇటీవల కంపెనీ రెనాల్ట్ కిగర్ యొక్క స్పోర్టియర్ వేరియంట్‌ను ఆటోమొబైల్ మార్కెట్‌లో విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఇది టాప్ ఎండ్ RXZ ట్రిమ్‌పై ఆధారపడి ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

కొత్త Renault Kiger Sportier వేరియంట్ సాధారణ మోడల్‌తో పోలిస్తే కొత్త అప్‌డేట్‌‌లతో రావచ్చు. దీని గురంచి పూర్తి వివరాలు ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇది బాడీ ప్యానెల్‌లు, బ్రేక్ కాలిపర్‌లపై కాంట్రాస్టింగ్ యాక్సెంట్‌లను కలిగి ఉండే అవకాశం ఉంది. కారు ముందు, వెనుక బంపర్‌లలో కూడా కొన్ని మార్పులు ఉంటాయి.  రెనాల్ట్ కొత్త డైమండ్ లోగోను ఇందులో చూడొచ్చు.

- Advertisement -

Also Read: ఎలక్ట్రిక్ స్కూటర్లపై ఆఫర్ల వర్షం.. వీటిని వదలొద్దు!

స్పోర్టియర్ వేరియంట్ ఇంటీరియర్ థీమ్ దాని పనితీరు ప్రతిబింబించేలా అప్‌డేట్ చేయవచ్చు. ఫీచర్ల గురించి మాట్లాడితే.. కొత్త రెనాల్ట్ కిగర్ స్పోర్టియర్ వేరియంట్ సాధారణ RXZ ట్రిమ్‌లో కనిపించే అన్ని ఫీచర్లను, ఆడియో కంట్రోల్ కలిగి ఉంటుంది. లెథర్ స్టీరింగ్ వీల్, వైర్‌లెస్ ఆపిల్ కార్‌ప్లే , ఆండ్రాయిడ్ ఆటో, యాంబియంట్ లైటింగ్, 4 స్పీకర్, 4 ట్వీటర్ ఆర్కిమేజ్ ఆడియో సిస్టమ్, PM2.5 ఎయిర్ ఫిల్టర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంటీ పించ్ ఫంక్షన్‌తో డ్రైవర్ సైడ్ విండో ఆటో అప్/ డౌన్ , కూల్డ్ లోయర్ గ్లోవ్ బాక్స్, పవర్ ఫోల్డింగ్ ORVMలు, LED హెడ్‌ల్యాంప్‌లు, 16 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, వెనుక డీఫాగర్ ఉంటాయి.

Also Read: కిర్రాక్ లుక్‌తో స్టైలిష్ ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N250 కొత్త వెర్షన్!

Kiger కొత్త స్పోర్టీ వేరియంట్ 1.0L టర్బో పెట్రోల్ ఇంజిన్‌ను పొందే అవకాశం ఉంది. ఇది 100bhp, 160Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ రెండింటితో వస్తోంది. అయితే CVT యూనిట్‌తో జత చేసినప్పుడు టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ట టార్క్ ఫిగర్ 153Nm వద్ద ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News