Big Stories

Priyanka Chopra’s restaurant to close: హీరోయిన్ ప్రియాంకచోప్రా, న్యూయార్క్‌లో రెస్టారెంట్ క్లోజ్, ఏమైంది?

Priyanka Chopra’s restaurant to close: బాలీవుడ్ ఫేమస్ హీరోయిన్ ప్రియాంక‌‌చోప్రా మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది. ఓ వైపు బాలీవుడ్‌ సినిమాలు, మరోవైపు హాలీవుడ్‌లో టీవీ షోలు చేస్తోంది. అక్కడి ప్రేక్షకులకు దగ్గరైంది. పలు ప్రాజెక్టులతో బిజీగా మారింది ఈ అమ్ముడు. తన ఇమేజ్‌ని వ్యాపారానికి వినియోగించు కుంది. మూడేళ్ల కిందట న్యూయార్క్‌లో సోనా పేరిట ఓ రెస్టారెంట్‌ను ఓపెన్ చేసింది.

- Advertisement -

పార్టనర్‌షిప్‌తో మొదలైన ఈ వ్యాపారాన్ని ప్రియాంకచోప్రా- నిక్ జోనాస్ దంపతులు ఘనంగా ప్రారంభించారు. బాలీవుడ్ నుంచే కాకుండా హాలీవుడ్ నుంచి పలువురు సెలబ్రిటీలు ఫుడ్ కోసం అక్కడికి  వచ్చేవారు. షూటింగ్ నిమిత్తం బాలీవుడ్ స్టార్స్ అనుపమ్ ఖేర్, విక్కీ‌కౌషల్, కత్రినాకైఫ్ వెళ్లేవారు. రెస్టారెంట్ బిజినెస్ ఈ బ్యూటీకి మూడు పువ్వులు, ఆరుకాయలుగా మారింది.

- Advertisement -

ముఖ్యంగా ఇండియన్ ఫుడ్‌కి సోనా రెస్టారెంట్ మాంచి ఫేమస్. వివిధ రాష్ట్రాల నుంచి ఫేమస్ వంటకాలను వినియోగదారులను ఆకట్టుకునేవి. కేరళ రోస్ట్ చికెన్, పంప్కిన్ కోఫ్తా, పన్నీర్ లబబ్దార్ వంటి వంటకాలు ఘుమఘుమలాడేవి. రెస్టారెంట్‌ను మూడేళ్ల అగ్రిమెంట్ మీద ప్రియాంక‌చోప్రా, ఆమె పార్టనర్ మనీషా గోయల్ జాయింట్‌గా మొదలుపెట్టారు. జూన్ 30తో అగ్రిమెంట్ ముగియనుంది. ఈ వారం కాకుండా వచ్చేవారంతో సోనా రెస్టారెంట్ మూతపడబోతోంది.

దీనికి సంబంధించి ఇన్‌స్టాలో రెస్టారెంట్ ఆర్గనైజర్స్ ఓ పోస్టు పెట్టారు. చివరి సర్వీసు ఈనెల 30 ఆదివారంతో ముగియనుందని వెల్లడించారు. బిజినెస్ బాగా జరిగినప్పుడు ఎందుకు క్లోజ్ చేస్తున్నారనే వార్తలూ లేకపోలేదు. రెస్టారెంట్ ప్రారంభించిన రెండేళ్లకి పార్టనర్ మనీష్‌తో ఆమెకు విభేదాలు మొదలయ్యాయన్నది అక్కడి మీడియాలో వార్త. దీనికి కారణంగా అగ్రిమెంట్‌ని కంటిన్యూ చేయకుండా డ్రాపవ్వాలని ఇద్దరు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: మహీంద్రా నుంచి కొత్త పికప్ ట్రక్.. రూ. 25 లక్షలతో త్వరలో లాంచ్!

ప్రస్తుతం హాలీవుడ్ మూవీ బ్లఫ్ చిత్రీకరణలో బిజీగా ఉంది ప్రియాంకచోప్రా. ఆస్ట్రేలియాలో షూటింగ్ జరుగుతోంది. యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరణ సమయంలో ఆమె మెడకు గాయాలయ్యాయి. మరి ఇప్పటికైనా రెస్టారెంట్ బిజినెస్ నుంచి ఎందుకు డ్రాపయ్యిందో ప్రియాంకచోప్రా చెబుతుందో లేదో చూడాలి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News