Big Stories

Ola Electric New Features: ఓలా ఎలక్ట్రిక్‌లో కొత్త ఫీచర్.. ప్రత్యేకత ఏంటో తెలుసా?

Ola Electric New Features: ఓలా ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో అగ్రస్థానంలో ఉంటుంది. కంపెనీ ఓలా నుంచి వచ్చిన అన్నీ మోడళ్లను మొరుగ్గా ఉంచేందుకు నిరంతరం క‌ృషి చేస్తోంది. అయితే కంపెనీ తన చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్ S1 కోసం ఒక అప్‌డేట్‌ను విడుదల చేసింది. ఓవర్-ది-ఎయిర్ (OTA) సహాయంతో స్కూటర్ అప్‌డేట్ చేయబడింది.

- Advertisement -

సర్వీస్ సెంటర్‌కి వెళ్లకుండానే ఈ అప్‌డేట్ కూడా తీసుకోవచ్చు. దీని కోసం వినియోగదారులు తమ స్కూటర్‌ను ఇంటర్నెట్‌కు కనెక్ట్ చేయాలి. ఈ కొత్త అప్‌డేట్ చాలా అద్భుతమైన, ఉపయోగకరమైన ఫీచర్లను అందిస్తుంది. దీని గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

కొత్త అప్‌డేట్ తర్వాత వెకేషన్ మోడ్ ఫీచర్ ఓలా ఎస్1లో అందుబాటులోకి వస్తుంది. మీరు ఇంటి నుండి బయటకు వెళ్లినప్పుడు వెకేషన్ మోడ్ ఉపయోగపడుతుంది. ఈ మోడ్‌ను ఆన్ చేసిన తర్వాత స్కూటర్  బ్యాటరీ డిచ్ఛార్జ్ అవదు. అంటే బ్యాటరీ ఎక్కువ సేపు ఛార్జ్ అయి ఉంటుంది.

Also Read: జస్ట్ 6 రూపాయలే..160 రోజులు అన్‌ లిమిటెడ్ కాలింగ్.. ఫ్రీగా OTTలు!

ఒక విధంగా స్కూటర్ స్లీప్ మోడ్‌లోకి వెళుతుంది. దీనితో పాటు అప్‌డేట్ తర్వాత తాజా రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా దీనికి యాడ్ చేశారు. ఈ ఫీచర్ స్కూటర్‌ను నడుపుతున్నప్పుడు ఛార్జింగ్‌ కోసం సహాయపడుతుంది.

కొత్త అప్‌డేట్ తర్వాత ఫైండ్ మై స్కూటర్ మళ్లీ అందుబాటులోకి వస్తుంది. ఇప్పుడు ఫైండ్ మై స్కూటర్ ఫీచర్‌తో పాటు రైడింగ్ స్టేటస్, స్కూటర్ ఎనర్జీ సంబంధిత సమాచారం కూడా అందుబాటులో ఉంటుంది. ఫైండ్ మై స్కూటర్ సహాయంతో మీకు స్కూటర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఇది కాకుండా ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఇతర మార్పులు చేయలేదు.

ఇది రెండవ జనరేషన్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఇది మల్టీ టోన్ కలర్ స్కీమ్‌లో విడుదల చేశారు. ఇంకా హెడ్‌ల్యాంప్, రౌండ్ మిర్రర్, కొత్త డిస్‌ప్లే కోసం ప్రత్యేక కౌల్‌ చూడొచ్చు. ఇది అల్లాయ్ వీల్స్‌కు బదులుగా స్టీల్ రిమ్‌లను కలిగి ఉంటుంది.

Also Read: జూపిటర్ నుంచి కొత్త స్కూటీ.. కాలేజీ పోరగాళ్లకు పర్ఫెక్ట్ బండి ఇది!

Ola ఎంట్రీ-లెవల్ ఆఫర్ అయిన S1 Xని మూడు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. దీని ధరలు 2kWh వేరియంట్ కోసం రూ. 89,999 నుండి ప్రారంభమవుతాయి. మిడ్-స్పెక్ వెర్షన్‌ను S1 X అని కూడా పిలుస్తారు, అయితే ఇది పెద్ద 3kWh బ్యాటరీని పొందుతుంది. దీని ధర రూ.99,999. X సరీస్‌లో టాప్ వేరియంట్‌గా S1 X+ ఉంది. ఇందులో అదనపు కనెక్టివిటీ ఫీచర్‌లు ఉంటాయి. దీని ధర రూ. 1,09,999.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News