Big Stories

Budget EV Scooters for Women: స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇవి స్పెషల్ గా మహిళల కోసమే..!

Budget EV Scooter’s for Women: ప్రస్తుత కాలంలో ద్విచక్ర వాహనాలు అవసరంగా మారిపోయాయి. ప్రతి ఇంటికి తప్పనిసరి అయిపోయాయి. ఈ క్రమంలో ప్రజలు ఆఫర్డ్‌బుల్ ప్రైస్‌లో అధిక డ్రైవింగ్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. వీటిలో ఒకినావా R30, iVoomi S1 అనే రెండు స్మార్ట్ స్కూటర్లు మార్కె‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ కొత్త జనరేషన్ స్కూటర్ సౌకర్యవంతమైన ప్రయాణం కోసం సింగిల్ పీస్ సీటు, స్టైలిష్ లైట్లతో వస్తుంది. ఈ రెండింటి ఫీచర్లు, ధర గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Okinawa R30
ఇది హై స్పీడ్ స్కూటర్. దీని సీట్ ఎత్తు 735 మిమీ. దీని కారణంగా మహిళలు, వృద్ధులు కూడా సులభంగా డ్రైవ్ చేయవచ్చు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఈ స్కూటర్ దాదాపు 60 కిమీ రేంజ్ ఇస్తుంది. ఇది 25 kmph గరిష్ట వేగాన్ని అందిస్తుంది. ఒకినావా హెవీ లోడ్ స్కూటర్, ఇది ఒకేసారి 150 కిలోల బరువును సులభంగా మోయగలదు. గుంతల రోడ్లపై రైడర్‌ను రక్షించడానికి టెలిస్కోపిక్ ఫ్రంట్ ఫోర్క్స్, ట్విన్-సైడెడ్ రియర్ స్ప్రింగ్స్ సస్పెన్షన్‌ ఉంటుంది. ఇందులో చాలా కలర్ ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. ఈ స్కూటర్‌లో 1.34 KWH లిథియం బ్యాటరీ ప్యాక్ ఉంది.

- Advertisement -

Also Read: భలే డిమాండ్.. ఈ కారు కావాలంటే 14 నెలలు ఆగాల్సిందే!

ఈ స్కూటర్ ఆప్రాన్-మౌంటెడ్ హెడ్‌లైట్, గ్లోస్-బ్లాక్ ఫినిషింగ్‌ను కలిగి ఉంది. స్కూటర్‌లో టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే, ఓడోమీటర్ ఉన్నాయి. ఈ కూల్ స్కూటర్‌లో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఉంది. ఇందులో డిజిటల్ స్పీడోమీటర్, కంఫర్ట్ రైడ్ కోసం సింగిల్ పీస్ సీటు ఉంది. కంపెనీ ఈ స్కూటర్‌లో బాడీ-కలర్ ఫ్రంట్ ఫెండర్ మరియు 250W పవర్‌ను అందిస్తుంది. అలానే ఫ్లాట్ ఫుట్‌బోర్డ్, సింగిల్-పీస్ పిలియన్ గ్రాబ్ రైల్‌ను కలిగి ఉంది. స్కూటర్‌‌ను ఫుల్ ఛార్జ్ చేయడానికి ఐదు గంటల సమయం పడుతుంది. స్మార్ట్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ స్కూటర్ ఎక్స్-షోరూమ్ రూ.61,998గా ఉంది. స్కూటర్‌లో ముందు, వెనుక టైర్లలో డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.

iVoomi S1
ఇది కొత్త జనరేషన్ స్కూటర్. ఇది డ్రైవింగ్ రేంజ్ కోసం 4.2 kWh ట్విన్ బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఈ స్కూటర్ ఒకసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే దాదాపు 80 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ అందిస్తుంది. ఇది లాంగ్ రూట్ స్కూటర్. గరిష్టంగా 57 kmph వేగాన్ని అందిస్తుంది. స్కూటర్‌లో మూడు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఎకో, రైడర్, స్పోర్ట్. స్పోర్ట్స్ మోడ్ టాప్ స్పీడ్ కోసం పనిచేస్తుంది.

Also Read: రూ.1,499లకే EV.. దేశంలోనే చౌకైన ఎలక్ట్రిక్ స్కూటర్.. తక్కువ టైమ్‌కే ఫుల్ ఛార్జ్!

iVoomi S1 ప్రారంభ ధర రూ. 69,999 ఎక్స్-షోరూమ్. ఈ స్కూటర్ మూడు వేరియంట్లలో వస్తుంది. ఇటీవలే కంపెనీ తన కొత్త iVoomi S1 లైట్ స్కూటర్‌ను విడుదల చేసింది. ఇది రూ. 54999కి అందుబాటులో ఉంది. నార్మల్ ఛార్జర్‌తో ఈ స్కూటర్ 4 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఇది GPS ట్రాకర్, ఫైండ్ మై రైడ్ వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. ఈ స్కూటర్ రియర్ టైమ్ మానిటరింగ్ సిస్టమ్, భద్రత కోసం డ్రమ్ బ్రేక్‌తో వస్తుంది. ఇందులో LED హెడ్‌లైట్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News