Big Stories

Oben Electric Bike Launch: కొత్త ఎలక్ట్రిక్ బైక్‌పై రూ.40 వేల డిస్కౌంట్.. 187 కిమీ రేంజ్‌తో రఫ్పాడిస్తుంది..!

Oben Electric Bike Launched: బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ టూ వీలర్ స్టార్టప్ ఒబెన్ ఎలక్ట్రిక్ తన రోర్ ఎలక్ట్రిక్ బైక్‌ను ఇటీవల ఢిల్లీలో విడుదల చేసింది. కంపెనీ దీని ధరను రూ. 1.10 లక్షలుగా నిర్ణయించింది. ఢిల్లీలో మొదటి 100 మంది కస్టమర్లకు రూ.40,000 డిస్కౌంట్‌తో ఒబెన్ రోర్ అందుబాటులో ఉంటుంది. కంపెనీ ఇటీవలే దేశ రాజధానిలోని పితంపురాలో తన మొదటి షోరూమ్‌ను ప్రారంభించింది.

- Advertisement -

ఢిల్లీ ప్రమోషనల్ ఆఫర్‌లో భాగంగా సిటీ కస్టమర్లు ఎలక్ట్రిక్ బైక్‌ను భారీ తగ్గింపులతో కొనుగోలు చేయవచ్చు. ధర తగ్గడంతో ఒబెరాన్ రోర్ రివోల్ట్ RV400, హాప్ ఆక్సో, ఇ-బైక్ సెగ్మెంట్‌లోని వాటి కంటే తక్కువ ధరకు దక్కించుకోవచ్చు. అయితే ఇది లిమిటుడ్ టైమ్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. అంతే కాకుండా ఢిల్లీలో బైక్‌లను ముందుగా కొనుగోలు చేసేవారికి బహుమతులు కూడా అందించనున్నారు. దీని ద్వారా ఎక్కువ మంది ఈ బైకులు కొనుగోలు చేసే అవకాశం ఉందని కంపెనీ భావిస్తోంది.

- Advertisement -

ఢిల్లీకి ధర తగ్గింపుపై ఓబెన్ ఎలక్ట్రిక్ ఫౌండర్, CEO అయిన మధుమిత అగర్వాల్ మాట్లాడుతూ.. ఒబెన్ రోర్ పూర్తిగా భారతదేశంలోనే తయారు చేయబడింది. ఇది నిజంగా మేడ్ ఇన్ ఇండియా ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ బ్రాండ్‌గా మారింది. మేము మొదట్లో ఒబెన్ రోర్‌ను ప్రారంభించినప్పుడు ఢిల్లీలో కస్టమర్‌ల నుంచి మంచి స్పందన లభించింది.

Also Read: బడ్జెట్‌లో మంచి మైలేజీ ఇచ్చే కార్లు.. రూ.3 లక్షలతో కొనుగోలు చేయవచ్చు!

ఇది మాకు కీలకమైన మార్కెట్‌గా మారింది. దాని ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో మా విజయం బలమైన పునాది వేసింది. ఆ విజయాన్ని ఢిల్లీలో నిర్మించేందుకు సిద్ధంగా ఉన్నాం. భారతదేశ EV పరిశ్రమలో అగ్రగామిగా మా స్థానాన్ని బలోపేతం చేయడంలో మాకు నమ్మకం ఉంది.

ఒబెన్ రోర్ బైక్‌లో 8 kW ఎలక్ట్రిక్ మోటారు ఉంటుంది. ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 187 కి.మీ. (IDC) రేంజ్ ఇస్తుందని కంపెనీ వెల్లడించింది. ఈ ఎలక్ట్రిక్ బైక్ 100 కిమీ. 15 kmph గరిష్ట వేగంతో 3 సెకన్లలో 0-40 kmph గంటకు వేగాన్ని చేరుకోగలదు.

Also Read: 100 కిమీ మైలేజీతో బజాజ్ కొత్త బైక్.. జూలై 5న లాంచ్!

ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ను తదుపరి పెద్ద మార్కెట్‌గా మార్చేందుకు ఒబెన్ పెద్ద ప్లాన్ వేస్తోంది. వచ్చే ఏడాది రీజియన్‌ వ్యాప్తంగా 12 షోరూమ్‌లు, సర్వీస్‌ సెంటర్లను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కంపెనీ ప్రస్తుతం తన హోమ్ మార్కెట్ బెంగళూరు నుండి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే ఇటీవల మహారాష్ట్రలోని పూణే, అలాగే కేరళలోని కొచ్చి, తిరువనంతపురంలో కొత్త షోరూమ్‌లను ప్రకటించింది. కంపెనీ నగరాల్లో మొత్తం 8 షోరూమ్‌లను కలిగి ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి 12 నగరాల్లో 50 అవుట్‌లెట్‌లకు విస్తరించే పనిలోపడింది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News