Big Stories

Nokia 3210 Re-entry: 25 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ.. అదరగొడుతున్న నోకియా 3210..బెస్ట్ ఫీచ‌ర్లు ఇవే

Nokia 3210 Re-entry: నోకియా మొబైల్ ఫోన్‌కు తొలినాళ్లలో ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మొబైల్ ఫోన్ అంటే.. వెంటనే అందరికీ గుర్తుకొచ్చే బ్రాండ్ ‘నోకియా’. అంతలా ప్రజాదరణ పొందిన ఈ బ్రాండ్.. స్మార్ట్ ఫోన్ రాకతో మార్కెట్‌లో రాణించలేకపోయింది. దీంతో మొబైల్ వ్యాపారన్ని హెచ్‌ఎండీ గ్లోబల్ సంస్థకు విక్రయించింది. ఈ క్రమంలో తన బ్రాండ్‌ను మార్కెట్‌లో నిలబెట్టేందుకు నోకియా 3210 4G ఫోన్‌ను భారత మార్కెట్‌లోకి విడుదల చేసింది.

- Advertisement -

ధర ఎంతో తెలుసా..?

- Advertisement -

25 ఏళ్ల క్రితం లాంచ్ అయిన నోకియా 3210 4G ఫోన్..మరోసారి అలరించనుంది. ఈ మోడల్ ధర రూ.3,999గా నిర్ణయించారు. ఈ ఫోన్ కొనుగోలు చేసేందుకు అమెజాన్, హెచ్ఎండీ ఈ స్టోర్ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ విషయంలో మరోసారి అదే రెట్రో లుక్‌ను కొనసాగించగా.. ఈ ఫోన్ నీలం, పసుపు, నలుపు రంగుల్లో లభిస్తుంది.

Also Read: ఓరి దేవుడా..! లైకా కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్.. షార్ట్ ఫిల్మ్స్ కోసం కెమెరాలు అవసరమే లేదు.. రెండు 32MP ఫ్రంట్ కెమెరాలు కూడా!

ఫీచర్లు ఎలా ఉన్నాయంటే..

నోకియా 3210 4G ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. 2.4 అంగుళాల క్యూవీజీఏ డిస్ ప్లే..యునిసోక్ టీ 107 ప్రాసెసర్ అమర్చారు. ఇక బ్యాక్ సైడ్ 2 మెగాపిక్సల్ కెమెరా, 64 ఎంబీ ర్యామ్‌తో అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతోపాటు యూట్యూబ్, యూట్యూబ్ షార్ట్స్, న్యూస్, గేమ్స్ కోసం వేరు వేరుగా యాప్స్ ఇచ్చారు. ఎప్పటిలాగే ఇందులో స్నేక్ గేమ్ కొనసాగించగా.. 1450 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. అయితే ప్రత్యేకంగా యూఎస్బీ టైప్ సీ పోర్టుతో వస్తుండడం విశేషం. ఇంకా 3.5ఎంఎం జాక్, ఎంపీ 3 ప్లేయర్, ఎఫ్ఎం రేడియో, డ్యూయల్ సిబ్ 4జీ వోల్ట్ సపోర్ట్‌తో ఈ ఫోన్ రానుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News