Big Stories

2024 Nissan X-Trail Teased: నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV వచ్చేస్తోంది.. టీజర్ చూస్తే పూనకాలే!

2024 Nissan X-Trail Teased: భారతీయ ఆటోమొబైల్ రంగం స్పీడ్‌‌గా దూసుకెళ్తుంది. అంతేకాకుండా వినియోగదారుల అవసరాలను తీర్చడానికి కంపెనీ కొత్త మోడళ్లను మార్కెట్‌లోకి నిరంతరం పరిచయం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా నిస్సాన్ తన ఎక్స్-ట్రైల్ SUVని త్వరలో విడుదల చేయబోతోంది. నిస్సాన్ ఎక్స్-ట్రైల్ 8 సంవత్సరాల తర్వాత భారతదేశంలో తిరిగి వస్తోంది. ఈ ఫేమస్ SUV భారతదేశంలో 2005లో మొదటిసారిగా విడుదలైంది. ఇది నాల్గవ తరంలో భారత మార్కెట్లోకి అందుబాటులోకి రానుంది. ఇందులో భాగంగా కొత్త టీజర్‌ను విడుదల చేసింది.

- Advertisement -

- Advertisement -

ఇది కారు డిజైన్‌పై ఒక గ్లింప్స్‌ ఇస్తుంది. ఈ కొత్త టీజర్‌లో కారు ముందు భాగాన్ని చూడొచ్చు. ఇందులో పైన LED డేటైమ్ రన్నింగ్ లైట్లతో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్‌ను కలిగి ఉంటుంది. గ్రిల్‌కు క్రోమ్ సరౌండ్‌తో అధునాతన బ్లాక్‌అవుట్ ఫినిషింగ్ అందించారు. అల్లాయ్ వీల్ డిజైన్ X-ట్రైల్ టెంకా లేదా టెంకా+ వేరియంట్‌లా కనిపిస్తుంది.

నిస్సాన్ కొత్త ఫోర్త్ జనరేషన్ కారు ఇది. ఇందులో 2.7 మీటర్ల కంటే ఎక్కువ వీల్‌బేస్, 205mm గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంటుంది. అలానే కారు లోపల చాలా పెద్ద స్పేస్ ఉంటుంది . ప్రపంచవ్యాప్తంగా X-ట్రైల్ 5-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది కటుంబ ప్రయాణాలకు కూడా అనుకూలంగా ఉంటుంది.

Also Read: దిమాక్ కరాబ్ బైక్స్.. త్వరలో లాంచ్.. క్రేజ్ వేరే లెవల్..!

ప్రపంచవ్యాప్తంగా ప్రారంభించబడిన ఎక్స్-ట్రైల్ పెట్రోల్, హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్‌లతో వస్తుంది. అయితే, ఇండియా-స్పెక్ మోడల్‌లో 1.5-లీటర్, 3-సిలిండర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ మాత్రమే లభించే అవకాశం ఉందని అంచనా. ఈ ఇంజన్ 201 bhp, 305 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది.

నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను ఫుల్ (CBU) యూనిట్‌గా దిగుమతి చేస్తుంది. హైబ్రిడ్ వేరియంట్ భారతదేశంలో అందుబాటులో ఉండే అవకాశం లేదు. ట్రాన్స్‌మిషన్ గురించి మాట్లాడితే CVT గేర్‌బాక్స్ గేర్‌బాక్స్ ఇందులో కనిపిస్తుంది. X-ట్రైల్ ఆల్-వీల్-డ్రైవ్ (AWD) ఆప్షన్‌తో రావచ్చు. టూ-వీల్-డ్రైవ్ (2WD) వేరియంట్ అవైల్‌బిలిటీని కన్ఫర్మ్ చేయలేదు.

Also Read: మనూరి బండి.. అదరకొట్టిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. ఏంటయ్యా ఆ క్రేజ్!

నిస్సాన్ గతంలో 2022లో X-ట్రైల్ కొత్త వేరియంట్‌ను చూపించారు. జూలై 17 తర్వాత ఎప్పుడైనా దీన్ని మార్కెట్‌లోకి తీసుకురావచ్చు. జ్యూక్, కష్కాయ్ వంటి ఇతర మోడళ్లతో పాటుగా నిస్సాన్ ఎక్స్-ట్రైల్‌ను మొదటిసారిగా  దాదాపు రెండు సంవత్సరాల తర్వాత విడుదల చేయనున్నారు. భారత మార్కెట్లో రానున్న కొత్త కార్లు X-Trail, Toyota Fortuner, MG Gloster వంటి మోడళ్లతో పోటీ పడనున్నాయి. X-Trail అధికారికంగా ప్రారంభించిన తర్వాత మాత్రమే దీని స్పెసిఫికేషన్, ధర వివరాలు వెల్లడి చేయబడతాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News