Big Stories

Upcoming Scooters 2024: ఈ ఏడాది రానున్న బెస్ట్ స్కూటర్ల లిస్టు.. తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు

Upcoming Scooters 2024: ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహనాల మార్కెట్‌లలో భారతదేశం ఒకటి. స్కూటర్లు వాటి ప్రాక్టికాలిటీ, కంఫర్ట్, మెరుగైన రైడింగ్ అనుభవం కారణంగా ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే దేశంలోని ద్విచక్ర వాహనాల కంపెనీలు అనేక కొత్త స్కూటర్లను విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందులో Hero MotorCorp నుంచి Hero Xoom 160 లాంచ్‌తో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లో విడుదల కానుంది. ఇది కాకుండా కంపెనీ Xoom 125Rను కూడా లాంచ్ చేస్తుంది. బజాజ్ చేతక్ కొత్త ఎలక్ట్రిక్ వెర్షన్ తీసుకురానుంది. రాబోయే ఈ మోడల్స్ గురించి  పూర్తి సమాచారం తెలుసుకుందాం.

- Advertisement -

Hero Xoom 160
Hero MotorCorp భారతీయ మార్కెట్‌లో Hero Xoom 160 లాంచ్‌తో ప్రీమియం స్కూటర్ సెగ్మెంట్‌లోకి ప్రవేశించనుంది. ఇది ఈ ఏడాది చివరి నాటికి ప్రారంభించే అవకాశం ఉంది. ఈ మ్యాక్సీ స్కూటర్‌లో 160సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజన్ ఉంటుంది. ఇది పెద్ద విండ్‌స్క్రీన్, పెద్ద స్టాన్స్, బ్లాక్-ప్యాటర్న్ రబ్బర్‌తో కూడిన 14 అంగుళాల వీల్స్ సెట్ కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read: ఈ మూడు ఎలక్ట్రిక్ కార్లకు తిరుగులేదు.. కళ్లు మూసుకొని కొనేయండి!

Hero Xoom 125R
హీరో తన కొత్త Xoom స్కూటర్ సెగ్మెంట్‌ని విస్తరింపజేయాలని భావిస్తోంది. Hero MotorCorp ఈ సంవత్సరం Xoom 125R ను భారత మార్కెట్లో విడుదల చేస్తుంది. ఇది భారతీయ మార్కెట్లో TVS Ntorq 125, Honda Dio 125, Yamaha Ray-ZR 125, Suzuki Avenis 125, Aprilia Storm 125 వంటి ఇతర స్పోర్టీ స్కూటర్లతో పోటీపడుతుంది. స్కూటర్ 9.4 bhp పవర్, 10.16 Nm గరిష్ట టార్క్‌ను రిలీజ్ చేసే 124.6 cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో వచ్చే అవకాశం ఉంది. ఇది CVT గేర్‌బాక్స్‌కు కనెక్ట్ అయి ఉంటుంది.

Bajaj Chetak
బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్‌ను తక్కువ బడ్జెట్‌లో అందించేందకుకు కొత్త వెర్షన్‌ను డెవలప్ చేస్తుంది. గత నెల ఏప్రిల్‌లో ఆన్‌లైన్‌లో ఫోటోలు లీక్ అయ్యాయి. Ola S1X, Ather 450S, TVS iQube వంటి ఈ స్కూటర్‌లు, చేతక్ ఎలక్ట్రిక్ స్టీల్ వీల్స్, రెండు వైపులా డ్రమ్ బ్రేక్‌లు, సాధారణ మోనోక్రోమ్ డిస్‌ప్లే, చిన్న 2.9 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తాయి. దీని ధర రూ. 1 లక్ష (ఎక్స్-షోరూమ్) కంటే తక్కువ ఉండొచ్చు.

Also Read: యమ క్రేజ్.. ఎక్కువగా సేల్ అవుతున్న కార్ ఇదే!

Suzuki Access 125 Facelift
సుజుకి యాక్సెస్ 125 భారతీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న 125cc స్కూటర్‌లలో ఒకటి. త్వరలో మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్ అప్‌డేట్‌ వెర్షన్ రాబోతుంది. ఇది 2024 చివరి నాటికి వచ్చే అవకాశం ఉంది. ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ మొదటిసారిగా ఏప్రిల్‌లో టెస్ట్ చేయబడింది. ఆకర్షణీయమైన లుక్ కోసం కొన్ని ఫీచర్ అప్‌గ్రేడ్‌లతో పాటు రిఫ్రెష్ స్టైలింగ్‌‌లో తీసుకురానున్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News