Big Stories

New-Gen Renault Duster: దేశీయ మార్కెట్‌లోకి మరొక కొత్త కారు.. యమహో యమ ఫీచర్లు.. లాంచ్ ఎప్పుడంటే..?

New-Gen Renault Duster Launch In India Soon: ఆటో మొబైల్ మార్కెట్‌లో కార్లకు మంచి డిమాండ్ ఉంది. అందులోనూ రెనాల్ట్ కార్లకు సూపర్ డూపర్ క్రేజ్ ఉంది. అదే కారణంతో కంపెనీ కొత్త కొత్త కార్లను మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ వాహన ప్రియులను అట్రాక్ట్ చేసుకుంటుంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా తమ కార్లలో రకరకాల సేఫ్టీ ఫీచర్లను అందించి ఆకట్టుకుంటుంది. ఇక తన లైనప్‌ ఇప్పటికే చాలా మోడళ్లను పరిచయం చేసిన రెనాల్ట్ ఇటీవల ‘నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్’ మోడల్‌‌ను టర్కిష్ మార్కెట్లో వదిలింది.

- Advertisement -

ఇక ఇప్పుడు ఆ ‘నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్’ మోడల్‌‌ను భారతదేశ మార్కెట్‌లో విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ మోడల్ లాంచ్‌కు సంబంధించి ఓ అప్డేట్ బయటకొచ్చింది. వచ్చే ఏడాది 2025లో ‘నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్’ మోడల్‌‌ను విడుదల చేయడానికి కంపెనీ సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో టర్కిష్ మోడల్‌లో కనిపించే ఫీచర్ల ఆధారంగా భారతీయ మార్కెట్ కోసం స్పెసిఫికేషన్లను అంచనా వేయవచ్చు.

- Advertisement -

‘నెక్స్ట్-జెన్ రెనాల్ట్ డస్టర్’ మోడల్‌ వెనుక AC వెంట్‌లతో కూడిన క్లైమేట్ కంట్రోల్ ఉంటుందని తెలుస్తోంది. అలాగే ముందువైపు కప్ హోల్డర్‌లు, వెనుక ఆర్మ్‌రెస్ట్‌లు, పవర్ మిర్రర్లు, పవర్ విండోస్, పవర్డ్ డ్రైవర్ సీటు, స్ప్లిట్ ఫోల్డింగ్ రియర్ సీట్లు, లెదర్‌తో స్టీరింగ్ వీల్ వంటి కొన్ని ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇన్ఫోటైన్‌మెంట్, ఇంటీరియర్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వైర్‌లెస్ ఫోన్ మిర్రరింగ్, స్టీరింగ్-మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఛార్జర్, USB ఛార్జింగ్ పోర్ట్‌లతో డ్యూయల్ డిజిటల్ స్క్రీన్‌లను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలాగే బయటవైపు 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్, LED హెడ్‌ల్యాంప్‌లు, ఇంటిగ్రేటెడ్ DRLలతో కూడిన టెయిల్‌ల్యాంప్‌లు ఉండే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

Also Read: బెస్ట్ మైలేజ్ కార్స్.. టాప్-5 ఇవే!

వీటితో పాటు ఇందులో సేఫ్టీ సూట్ విషయానికొస్తే.. నెక్స్ట్ జెన్ రెనాల్ట్ డస్టర్ సేఫ్టీ సూట్‌లో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు ఉండనున్నాయి. అలాగే లెవెల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), స్టెబిలిటీ ప్రోగ్రామ్, ISOFIX చైల్డ్ సీట్ మౌంటింగ్ పాయింట్‌లు, 360-డిగ్రీ కెమెరా వంటివి ఉండే అవకాశం ఉంది. అయితే సన్‌రూఫ్, కనెక్ట్ చేయబడిన కార్ టెక్నాలజీ, లెథెరెట్ అప్హోల్స్టరీ ప్యాకేజీ వంటి కొన్ని ఫీచర్లు ఈ జాబితాలో లేవని తెలుస్తోంది. కాగా ఈ మోడల్ భారతీయ మార్కెట్‌కి అనుగుణంగా మరికొన్ని ఫీచర్లను అందించే ఛాన్స్ ఉన్నట్లు సమాచారం.

ఇంజన్ విషయానికొస్తే.. ఇది ఇంజన్ పెట్రోల్-ఆధారితంగా మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. ఇందులో 1.2 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుందని అంటున్నారు. అది 130bhp పవర్, 230Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో వచ్చే అవకాశం ఉంది. టాప్-స్పెక్ వెర్షన్ 4X4 టెక్నాలజీతో కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఈ మోడల్ కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, ఎమ్‌జి ఆస్టర్, హోండా ఎలివేట్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా వంటి మోడళ్లకు పోటీగా ఉండనున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News