Big Stories

Cheapest Automatic Gearbox Cars: ఫుల్ ట్రాఫిక్ ఉందా..? ఇదిగో బెస్ట్ కార్లు.. ధర మాత్రం చాలా తక్కువ!

Most Affordable Automatic Gearbox Cars: ప్రస్తుతం కారు కొనుక్కునే వారి సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతుంది. అందులోనూ పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ అనేది ప్రధాన సమస్యగా మారిపోయింది. దీంతో చాలా మంది మాన్యువల్ గేర్‌బాక్స్ కార్ల కంటే.. ఎక్కువగా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ కార్లపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందువల్ల అతి తక్కువ ధరలో మార్కెట్‌లో లభిస్తున్న హ్యాచ్‌బ్యాక్‌ల గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

- Advertisement -

మారుతి ఆల్టో కె10

- Advertisement -

భారతీయ ఆటో మొబైల్ మార్కెట్‌లో మారుతి ఆల్టో కె10 కార్లకు మంచి డిమాండ్ అండ్ క్రేజ్ ఉంది. అందుకు ముఖ్య కారణం ఇది అత్యంత చౌకగా లభించడమే. ఇది కేవలం రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల ధర మధ్య అందుబాటులో ఉంది. ఈ కారు పెట్రోల్ మోడల్ 5 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కి 24.09 కి.మీ మైలేజీ అందిస్తుంది.

రెనాల్ట్ క్విడ్

తక్కువ ధరలో లభించే మరో బెస్ట్ కారు రెనాల్ట్ క్విడ్. ఇది రూ.4.70 లక్షల నుంచి రూ.6.45 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 22.3 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది 1.0 త్రీ సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది.

Also Read: అదిరిపోయే ఫీచర్లతో న్యూ జెన్ మారుతి సుజుకి కార్లు.. ఫుల్ డీటెయిల్స్..!

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో

మారుతి సుజుకి ఎస్ ప్రెస్సో మరో బడ్జెట్ కారు. ఇది రూ.4.26 లక్షల నుంచి రూ.6.12 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య అందుబాటులో ఉంటుంది. ఇది 5స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 25.30 కి.మీ మైలేజ్ అందిస్తుంది.

మారుతి సుజుకి సెలెరియో

భారతీయ మార్కెట్‌లో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉన్న మరో కారు మారుతి సుజుకి సెలెరియో. ఇది రూ.4.99 లక్షల నుంచి రూ.7.09 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య అందుబాటులో ఉంటుంది. ఈ కారు లీటర్ పెట్రోల్‌కి 26 కి.మీ మైలేజీ అందిస్తుంది. ఇది 5స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.

టాటా టియాగో

టాటా టియాగో మరో సరసమైన కారు. ఈ కారు రూ.5.56 లక్షల ధర నుంచి రూ.8.90 లక్షల ఎక్స్ షోరూమ్ మధ్య ఉంటుంది. ఇది పెట్రోల్, సిఎన్‌జీ ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఈ రెండూ 5స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఇందులో పెట్రోల్ వేరియంట్ లీటర్ పెట్రోల్‌కి 19.43 కి.మీ మైలేజీ అందిస్తుంది. అందువల్ల ఆటోమేటిక్ గేర్‌బాక్స్ గల కార్‌ కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇవి బెస్ట్ అని చెప్పుకోవచ్చు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News