Big Stories

New Generation Mini Cooper S Booking: మినీ కూపర్ నుంచి కొత్త SUV.. బుకింగ్స్ ఓపెన్.. ఫీచర్స్ అదుర్స్..!

Bookings Open for New Generation Mini Cooper S: మినీ ఇండియా కొత్త తరం కూపర్ S, కంట్రీమ్యాన్ E SUVల ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. ఇది రాబోయే కొన్ని రోజుల్లోనే సేల్‌కు తీసుకొచ్చే అవకాశం ఉంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ నుంచి దీన్ని బుక్ చేసుకోవచ్చు. కస్టమర్‌లు కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ. 1 లక్ష టోకెన్ ఫీజు కింద చెల్లించాల్సి ఉంటుంది. కొత్త జనరేషన్ మినీ కూపర్ 3 డోర్, కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ గత ఏడాది సెప్టెంబరులో ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేశారు. కొత్త మినీ కూపర్‌లోె S 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను ఉంటుంది. కానీ ఇప్పుడు ఎక్కువ పవర్, టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

కొత్త మినీ కూపర్ Sలో రీడిజైన్ చేయబడిన గ్రిల్, 3 కస్టమైజ్ LED DRL సిగ్నేచర్‌తో కొత్త రౌండ్ LED హెడ్‌ల్యాంప్‌లు ఉన్నాయి. కూపర్ Sలో సిల్హౌట్ అలాగే ఉంటుంది. వెనుకవైపు యూనియన్ జాక్-థీమ్ టెయిల్‌లైట్‌లను న్యూ వెర్షన్‌‌లో చూడొచ్చు. క్యాబిన్ మినిమలిస్ట్ థీమ్‌ను కలిగి ఉంది. పెద్ద రౌండ్ 9.4-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే, సెంటర్ కన్సోల్‌లో మినీ ఆపరేటింగ్ సిస్టమ్ 9 ఉంది. యూనిట్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌గా కూడా పనిచేస్తుంది. అయితే హెడ్-అప్ డిస్‌ప్లే ఇప్పుడు స్టీరింగ్ వీల్ కంటే ముందు ఉంటుంది.

- Advertisement -

Also Read: టాటాతో పోటీకి సిద్ధమైన హ్యుందాయ్.. 355 కిమీ రేంజ్‌తో కొత్త ఈవీ

కొత్త జనరేషన్ మినీలో ఎక్స్‌పీరియన్స్ మోడ్ కోసం టోగుల్ స్విచ్, పార్కింగ్ బ్రేక్, గేర్ సెలెక్టర్, స్టార్ట్-స్టాప్ స్విచ్ ఉన్నాయి. క్యాబిన్‌లో వివిధ కలర్ ఆప్షన్ప్ యాంబియంట్ లైటింగ్ కూడా తీసుకొచ్చారు. కూపర్ S పవర్‌లో 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. ఇది 201 bhp పవర్ 300 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇంతక ముందు కూపర్ వేరియంట్‌తో పోలిస్తే కొత్త మినీ 25 bhp, 20 Nm పవర్ పెంచుతుంది.

కొత్త మినీ కూపర్ 0-100 kmph యాక్సిలరేషన్ 6.6 సెకన్లలో వస్తుంది. ఇది పాత వెర్షన్ కంటే 0.1 సెకను స్పీడ్‌గా ఉంటుంది. అయితే పవర్ 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా ఫ్రంట్ వీల్స్‌కు సప్లై అవుతుంది. మినీ కంట్రీమ్యాన్ ఎలక్ట్రిక్ వేరియంట్ రానుంది. ఎలక్ట్రిక్ ఎస్‌యూవీకి కొత్త డిజైన్‌‌లో చూడొచ్చు. క్యాబిన్ కొత్త ఇంటీరియర్‌ లుక్‌లో కనిపిస్తుంది. ఇందులో కొత్త రౌండ్ OLED డిస్‌ప్లే, కొత్త మెటీరియల్స్ ఉన్నాయి.

Also Read: బుమ్రా ఉపయోగించే కార్లు.. ధరలు తెలిస్తే నోరెళ్లబెడతారు!

మినీ కంట్రీమ్యాన్ ఈ 201 bhp పవర్, 250 Nm పీక్ టార్క్‌తో ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. కంట్రీమ్యాన్ ఈ కేవలం 8.6 సెకన్లలో 0-100 kmph వేగాన్ని అందుకోగలదు. కంట్రీమ్యాన్ ఈ 462 కిమీ. ఫీచర్ల విషయానికొస్తే కొత్త మినీ కంట్రీమ్యాన్ E, లెవెల్ 2 ADAS, కనెక్ట్ చేయబడిన టెక్నాలజీ, డిజిటల్ కీ ప్లస్, ఫిష్‌ఐ ఇన్-కార్ కెమెరా, మసాజ్ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్‌ అడ్జెస్ట్‌మెంట్ డ్రైవర్ సీటుతో సహా అనేక లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News