Big Stories

Mihos.. Super features.. : ‘మిహోస్’.. ఫీచర్స్ అదుర్స్..

- Advertisement -

Mihos.. Super features.. : భారత మార్కెట్లోకి మరో సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రవేశించింది. జాయ్ ఇ-బైక్ తయారుచేసే వార్డ్ విజార్డ్… హైస్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ మిహోస్‌ను లాంచ్ చేసింది. రేపటి నుంచి కంపెనీ వెబ్‌సైట్ లేదా దేశవ్యాప్తంగా ఉన్న 6 వందలకుపైగా అధీకృత షోరూమ్‌ల్లో కస్టమర్లు మిహోస్‌ను ఉచితంగా బుక్ చేసుకోవచ్చని తెలిపింది. వచ్చే మార్చి నుంచి దశల వారీగా మిహోస్ డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది.

- Advertisement -

ఇటీవలి ఆటో ఎక్స్‌పో 2023లో… మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఆవిష్కరించారు. ప్రస్తుతం దీని ధరను రూ. 1.49 లక్షలుగా నిర్ణయించారు. అయితే దేశవ్యాప్తంగా తొలి 5 వేల మంది కస్టమర్లకు మాత్రమే ఈ ధరకు మిహోస్‌ను విక్రయిస్తారు. ఆ తర్వాత ధర కాస్త పెరుగుతుందని వార్డ్ విజార్డ్ తెలిపింది.

రెట్రో డిజైన్‌లో, విభిన్న సెన్సార్ల కలయికతో రావడం స్మార్ట్ మిహోస్ ఇ-స్కూటర్ ప్రత్యేకత. అదనపు మన్నిక, సేఫ్టీ కోసం మిహోస్‌ను పాలీడైసైక్లో పెంటాడిన్ తో రూపొందించారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్ల రేంజ్‌ వరకు ప్రయాణించే మిహోస్… 7 సెకన్లలోనే 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది. దీని అత్యధిక వేగం 70 గంటకు కిలోమీటర్లు. నికెల్, మాంగనీస్, కోబాల్ట్ కెమిస్ట్రీతో… 40Ah కెపాసిటీ గల లీఅయాన్ బ్యాటరీని ఇందులో అమర్చారు. దీన్ని ఫుల్ ఛార్జ్ చేయడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది. యాంటీ-థెఫ్ట్ సిస్టమ్, జీపీఎస్ సెన్సింగ్, రియల్-టైమ్ పొజిషన్, జియో ఫెన్సింగ్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఉండట మిహోస్‌ స్పెషాలిటీ. ‘జాయ్ ఇ-కనెక్ట్’ యాప్ ద్వారా మిహోస్‌ని ట్రాక్ చేయొచ్చు. బ్యాటరీ ఛార్జింగ్ పర్సెంటేజిని కూడా రిమోట్‌గానే తనిఖీ చేయొచ్చు. రివర్స్ మోడ్‌ కూడా ఉండటం మిహోస్ ప్రత్యేకత. మెటాలిక్ బ్లూ, సాలిడ్ బ్లాక్ గ్లాసీ, సాలిడ్ ఎల్లో గ్లాసీ, పెర్ల్ వైట్ రంగుల్లో మిహోస్ ఎలక్ట్రిక్ స్కూటర్ అందుబాటులో ఉంది. ఆటో ఎక్స్‌పోలో మిహోస్‌కు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందనీ, అందుకే ఉచితంగా బుక్ చేసుకునే అవకాశం ఇచ్చామని… కంపెనీ తెలిపింది.

Follow this link for more updates:- Bigtv

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News