E-Paper
Advertisement

BMW X7 facelift launch:- బీఎండబ్ల్యూ X7 ఫేస్ లిఫ్ట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

BMW X7 facelift launch:- బీఎండబ్ల్యూ X7 ఫేస్ లిఫ్ట్ లాంచ్.. ధర ఎంతో తెలుసా?

BMW X7 facelift :- జర్మనీకి చెందిన విలాసవంతమైన కార్ల తయారీ కంపెనీ బీఎండబ్ల్యూ… X7 ఫేస్ లిఫ్ట్ కారును భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది పెట్రోల్‌, డీజిల్‌ వేరియంట్లలో అందుబాటులో ఉంది. బీఎండబ్ల్యూ X7 పెట్రోల్‌ ఇంజిన్‌ వేరియంట్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 1.22 కోట్లు కాగా… డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్ ధర రూ.1.25 కోట్లు. విడిభాగాలు దిగుమతి చేసుకుని, చెన్నైలోని ప్లాంట్‌లో ఈ కారును అసెంబుల్‌ చేయనుంది… బీఎండబ్ల్యూ. ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించిన X7ను వచ్చే మార్చి నుంచి డెలివరీ చేస్తారు.

బీఎండబ్ల్యూ X7 పెట్రోల్, డీజిల్… రెండు వేరియంట్లలోనూ ఆరు సిలిండర్ల 3.0 లీటర్ ఇంజిన్‌తో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్‌ గేర్ బాక్స్‌ అమర్చారు. 5 రంగుల్లో లభ్యంమయ్యే ఈ కారు డీజిల్ వేరియంట్ 14.31 కిలోమీటర్ల మైలేజిని, పెట్రోల్ వెర్షన్ 11.29 మైలేజిని ఇస్తుంది. కేవలం 5.8 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు X7. కంఫర్ట్‌, ఎఫిషియంట్‌, స్పోర్ట్‌, స్పోర్ట్‌ ప్లస్‌ అనే నాలుగు డ్రైవ్‌ మోడ్‌లు X7లో ఉన్నాయి.

ప్రయాణికుల భద్రత కోసం ఇందులో అత్యాధునిక ఫీచర్లు ఇచ్చారు. డ్రైవర్, ఫ్రంట్ ప్యాసింజర్ సీట్లతో పాటు సైడ్స్ కూడా ఎయిర్ బ్యాగులు అమర్చారు. రెండు వరుసల సీట్లకు కూడా హెడ్, లెగ్స్ ఎయిర్ బ్యాగులు అమర్చారు. బ్రేక్ అసిస్ట్, ఆటోమేటిక్ డిఫరెన్షియల్ బ్రేక్ తో కూడిన యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఆటో హోల్డ్ ఫంక్షన్ ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు X7లో ఉన్నాయి.

12.3 అంగుళాల ఫుల్లీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ డిస్ ప్లే, 14.9 అంగుళాల హై రిజల్యూషన్ కంట్రోల్ డిస్ ప్లే, సరౌండ్ వ్యూ కెమెరా, రివర్స్ అసిస్టెంట్, స్మార్ట్ ఫోన్ ద్వారా ఫుల్లీ రిమోట్ పార్కింగ్, పనోరమా 3-పార్ట్ గ్లాస్ రూఫ్, 15 ప్రీ-డిఫైన్డ్ సెలెక్టబుల్ లైట్ డిజైన్స్ వంటి ఫీచర్లు X7లో ఉన్నాయి. బిఎండబ్ల్యూ ఇండివిడ్యువల్ ఎక్స్ టెండెడ్ లెదర్ ట్రిమ్ సీట్లును కూడా X7ఫేస్ లిఫ్ట్ లో పొందుపరిచారు.

Follow this link for more updates:- Bigtv

Related News

పహల్గామ్ దారుణం వెనుక పాక్ హస్తం.. బండారాన్ని బయటపెట్టిన లష్కర్ ఉగ్రవాది

కమీషన్ల కోసమే కాళేశ్వరం రిపేర్లు.. ఎనిమిదిన్నర లక్షల ఎకరాలను ఎండబెట్టిన ఘనత కాంగ్రెస్‌దే: కవిత

ఆటో డ్రైవర్ల కష్టాలపై కేంద్రానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ.. ఎల్పీజీ కొరత తీర్చాలని విజ్ఞ‌ప్తి!

Comedian Ali: బ్రేకింగ్.. రాజకీయాలకు గుడ్ బై చెప్పిన కమెడియన్ ఆలీ

Amit Shah: ఉగ్రదాడులను అరికట్టేందుకు కఠిన చర్యలు.. అమిత్ షా ఆదేశాలు

CM Chandrababu comments: చంద్రబాబు హెచ్చరిక, తిరుమల నుంచే ప్రక్షాళన, ఆ ఒక్కటి తప్ప..

Flagpole in Temples: దేవాలయాల్లో ధ్వజస్తంభాన్ని ఎందుకు ఏర్పాటు చేస్తారు..? వాటిపై ఉండే కలశాలల మర్మమేమిటి..?

Central Cabinet: కేంద్రమంత్రులుగా బండి సంజయ్, కిషన్ రెడ్డి..?

Big Stories

×