BigTV English
Advertisement

Business for This Sankranti:ఈ సంక్రాంతికి రూ.500 కోట్ల బిజినెస్

Business for This Sankranti:ఈ సంక్రాంతికి రూ.500 కోట్ల బిజినెస్

Business for This Sankranti:కోట్లు కురిపించడానికి పందెంకోళ్లు దూసుకొస్తున్నాయ్. ఈ ఏడాది జరిగే వ్యాపారం అటుఇటుగా 500 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. వరల్డ్ క్యాసినో బిజినెస్‌నే తలదన్నేలా గోదారి బరుల్లో కోట్ల రూపాయల లావాదేవీలు జరగబోతున్నాయి. ఐదారేళ్ల క్రితం వంద కోట్ల రూపాయలు చేతులు మారాయి. ఒక్కో ఏడాది గడిచే కొద్దీ వంద కోట్లు కాస్తా వందల కోట్లకు చేరుకుంది. ఏపీవ్యాప్తంగా రోజుకు 10 లక్షల నుంచి 15 లక్షల కోడిపందేలు జరుగుతాయి. ఒక్కో బరిలో కనీసంగా గంటకు నాలుగైదు పందాలు నడుస్తాయి.రోజులో 100 పందాల వరకూ జరుగుతాయి. ఈ లెక్కన పెద్ద బరుల ద్వారా నిర్వాహకులకు రూ. 40 కోట్ల వరకూ ఆదాయం వస్తుందని ఓ అంచనా. అసలు ఒకప్పుడు రూ.200 ఉండే కోడి కత్తే ఇప్పుడు రూ.500 అయిందంటే.. ఇక బిజినెస్ ఆ మాత్రం పెరగదా. అందులోనూ కోడికత్తి కట్టేవారికి ఎంత జీతమో తెలుసా. లక్ష రూపాయలు. ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. రోజులు 25వేల చొప్పున.. నాలుగు రోజులకు కలిపి లక్ష రూపాయలు చెల్లిస్తున్నారు. పందెం కోళ్లకు కత్తులు కట్టే నైపుణ్యం ఉన్న వాళ్లు తక్కువగా ఉండడంతో వీరికి కూడా డిమాండ్ పెరిగింది.


సంక్రాంతి పండక్కి ఒక్క గోదావరి జిల్లాల్లో జరిగే బిజినెస్సే రూ.400 కోట్లు. మిగిలిన వంద కోట్లు ఏపీలోని వివిద ఏరియాల్లో జరుగుతుంది. ఒక్క పశ్చిమ గోదావరి జిల్లాలోనే రూ.200 కోట్లు వరకు చేతులు మారతాయి.ఇటు హైదరాబాద్ నుంచి అటు ఎన్ఆర్ఐల వరకు అందరూ వచ్చేది గోదావరి జిల్లాలకే. అందుకే, సంక్రాంతి కోడిపందేలు అంటే గోదావరి జిల్లాలకు అంతగా ఫేమస్ అయ్యాయి.

బరిలో నిలిచే కోడి ధర రూ.3 లక్షలు పలుకుతోంది. పెరువియన్ జాతికి చెందిన కోళ్లను రూ.3లక్షలు పెట్టి కొంటున్నారు పందెం రాయుళ్లు. అసలు ఈ పెరువియన్ జాతి కోడి గుడ్డుతో.. 15 బ్రాయిలర్ కోళ్లు కొనొచ్చు. వీటి గుడ్డు ధరే రూ.3 వేలు పలుకుతోంది. పెరువియన్‌తో పాటు రసంగి, సీతువా, వైట్ నాట్, బ్లాక్ నాట్ జాతి కోళ్ల ధర కూడా రూ.3 లక్షల వరకు పలుకుతుంది. కాస్త అటు ఇటుగా ఉన్న పందెంకోడి రేటే లక్ష రూపాయలు ఉంది. కోడి జాతి, నక్షత్రం, దాని బలాన్ని బట్టి లక్షలు పెట్టైనా సరే కొంటున్నారు. కాకి, నెమలి, డేగ, ఆసిల్, చిలక జాతి కోళ్లు ఒక్కోటి రూ.2 లక్షల వరకు పలుకుతున్నాయి. అసలు పందెం కోడి రేటు మినిమమ్ రూ.10 వేల నుంచి మొదలవుతోంది. పందెంలో కోడి ఓడినా.. మళ్లీ అదో రేటు. ఓడిన కోళ్లకు వేలం వేసి మరీ వేల రూపాయలకు అమ్ముతారు.


సంక్రాంతి బిజినెస్ అంటే కోడిపందేలు మాత్రమే కాదు.. కోతముక్క, లోపల, బయట, పత్తాలు, మూడుముక్కలాటలు కూడా ఉంటాయి. కోతముక్క, పేకాట, నెంబర్లాట, రింగ్‌ ఆట నిర్వాహించాలంటే వేలం పాట ద్వారా దక్కించుకోవాలి. బరుల వద్ద వీటిని ఏర్పాటు చేసుకునేందుకు 60 లక్షల నుంచి 80 లక్షల రూపాయలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. హైదరాబాద్‌, విజయవాడకు చెందిన కొందరు ఈ కాంట్రాక్టులు దక్కించుకున్నారు. పార్కింగ్ స్థలాలను ఏకంగా రూ.10 లక్షలకు దక్కించుకున్నారంటే.. ఏ స్థాయిలో బిజినెస్ జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బరుల వద్ద మద్యం అమ్ముకునేందుకు కూడా వేలం పాట పెట్టారు. ఒక్కో బెల్ట్ షాపును దాదాపు 12 లక్షలు పెట్టి దక్కించుకున్నారు. ఇక బరుల వద్ద బిర్యాని పాయింట్‌ పెట్టుకోవాలంటే రూ.5లక్షలు, చివరికి కూల్ డ్రింకులు, గుట్కాలు, ఖైనీలు, సిగరెట్లు అమ్ముకోవాలన్నా రూ.2లక్షలు వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఇన్ని లక్షలు పెట్టి వ్యాపారం చేస్తున్నారంటే లాభాలు ఇంకెంత రేంజ్‌లో ఉంటాయో ఊహించుకోవచ్చు.

ఏదేమైనా సంక్రాంతి అంటే రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసులు, గంగిరెద్దులు అని చెప్పుకునే రోజులు పోయాయి. కొత్త అల్లుళ్లు సైతం అత్తింటి మర్యాదలను రుచి చూడడానికి ఆసక్తి చూపడం కంటే.. ఏ బరిలో ఎంత పందెం వేస్తున్నారో, తన అదృష్టం ఎలా ఉందో పరీక్షించుకోడానికి ఆరాటపడుతున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×