Big Stories

Yes Bank Layoff’s: ఎస్ బ్యాంకులో భారీగా ఉద్యోగుల తొలగింపు.. రాబోయే రోజుల్లో మరింకొంత మందిపై వేటు

Massive Layoff’s in Yes Bank: ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల నుంచి మొదలుకుని బ్యాంకింగ్ సంస్థల వరకు లే ఆఫ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ప్రముఖ బ్యాంకింగ్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ దాని సంస్థ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటిస్తుంది. ఈ మేరకు తాజాగా 500 మంది ఉద్యోగులపై వేటు వేసింది. ప్రైవేట్ సంస్థ అయిన ఎస్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు మరికొన్ని రోజుల్లోను మరిన్ని లే ఆఫ్స్ ఉంటాయని తెలుస్తోంది.

- Advertisement -

ఎస్ బ్యాంక్ దాని వ్యయాన్ని తగ్గించుకునేందుకే ఉద్యోగాల తొలగింపు చేయాలని నిర్ణయించుకుంది. రానున్న రోజుల్లోను బ్యాంకులో మరిన్ని ఉద్యోగాల తొలగింపులు ఉంటాయని పేర్కొంది. కాగా ప్రస్తుతం తొలగించిన ఉద్యోగులకు 3 నెలల జీతానికి సమానంగా పరిహారాన్ని కూడా అందించినట్లు ప్రకటించింది. బ్యాంకుకు వ్యయం పెరుగుతుండడంతో ఖాతాదారులకు మంచి సేవలను అందించాలని, వాటాదారులకు పూర్తి సామర్ధ్యాన్ని అందించాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎస్ బ్యాంకు వివరణ ఇచ్చింది.

- Advertisement -

కేవలం బ్యాంకు భవిష్యత్తు కోసం మాత్రమే ఉద్యోగుల తొలగింపు జరిగినట్లు పేర్కొంది. ఇక డిజటల్ బ్యాంకింగ్ వైపు వెళ్లేందుకు ఎస్ బ్యాంకు యోచిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు మాన్యువల్ వర్కింగ్ కూడా తగ్గించాలనే ఉద్దేశ్యం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులోను మరిన్ని ఉద్యోగాల తొలగింపు ఉంటుందని సంస్థ పేర్కొనడంతో ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

Also Read: 2024 Nissan X-Trail SUV: నిస్సాన్​ ఎక్స్​-ట్రయల్ లాంచ్‌కు సిద్ధం.. ఇక ఆ మోడళ్లకు గట్టి పోటీ తప్పదు..!

మరోవైపు గత ఆర్థిక సంవత్సరంలో ఎస్ బ్యాంకు నిర్వహణ ఖర్చులు పెరిగాయని సంస్థ ప్రకటించింది. దాదాపు 17 శాతం వరకు పెరిగినట్లు పేర్కొంది. 2023 నుండి 2024 వరకు ఉన్న ఆర్థిక సంవత్సరంలో 12 శాతంకి పైగా పెరిగాయి. 2024 ఆర్థిక సంవత్సరానికి గాను రూ. 3774 కోట్లు ఖర్చు చేయగా, 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 3363 కోట్లు సంస్థ ఖర్చు చేసినట్లు తెలిపింది. మరోవైపు ఈ ఏడాది ముగిసే వరకు 28,000 మంది ఉద్యోగుల ఉండగా అందులో నుండి 484 మంది ఉద్యోగులను హైర్ చేసుకుంది.

తాజాగా ఎస్ బ్యాంకు తన సంస్థ వ్యయాలను తగ్గించుకోవాలని డిజిటల్ బ్యాంకింగ్ పై దృష్టి పెట్టాలని భావిస్తుంది. ఇక ఎస్ బ్యాంకు స్టాక్స్ బీఎస్ఈలో రూ. 23.95తో పోల్చగా మంగళవారం వరకు రూ. 24.02 వద్ద ముగిసింది. ప్రస్తుతం ఎస్ బ్యాంకు మార్కెట్ క్యాప్ రూ. 75, 258 కోట్లుగా ఉంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఎస్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్‌గా ప్రశాంత్ కుమార్ ఉన్నారు. అయితే ప్రశాంత్ బాధ్యతలు స్వీకరించిన 2020 ఏడాదిలోను ఈ విధంగానే పెద్ద మొత్తంలో లేఆఫ్ లు జరిగాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News