Big Stories

Maruti Cars with Twin Cylinders: దుమ్ములేపనున్న మారుతీ.. నాలుగు CNG కార్లు.. మైలేజ్ చూస్తే నమ్మలేరు..!

Maruti Moto Launching Twin Cylinder Cars: మారుతి సుజుకి పోర్ట్‌ఫోలియోలో చాలా వరకు CNG కార్లు ఉన్నాయి. అన్ని కార్లు కంపెనీ సెట్ చేసిన S-CNG ప్లాట్‌ఫారమ్‌తో వస్తాయి. దీని కారణంగా వారి పర్ఫామెన్స్, సేఫ్టీ, ఫీచర్లు, మైలేజీ చాలా స్ట్రాంగ్‌గా, బెటర్‌గా ఉంటాయి. రాబోయే రోజుల్లో అనేక కొత్త మోడళ్లను తన పోర్ట్‌ఫోలియోలో తీసుకురావాలని కంపెనీ భావిస్తోంది. ఇందులో ఒకటి న్యూ జెన్ స్విఫ్ట్. ఇప్పటికే ఆటో మార్కెట్‌లో మారుతి అంటే CNG కార్లు వాటి మైలేజీకి ఫేమస్ అయ్యాయి. అయితే ఈ కార్లలో అతి పెద్ద సమస్య ఏమిటంటే తక్కువ బూట్ స్పేస్ ఉంటుంది.

- Advertisement -

మారుతీ కార్లలో 55 నుండి 60 లీటర్ల CNG ట్యాంక్, దానికి సంబంధించిన ఇతర పరికరాలు బూట్ స్పేస్‌లో ఎక్కువ భాగాన్ని ఆక్రమిస్తాయి. అటువంటి పరిస్థితిలో సామాను ఉంచడానికి స్థలం బాగా తగ్గుతుంది.  కంపెనీ ఇప్పుడు డ్యూయల్ CNG సిలిండర్ టెక్నాలజీని తీసుకురాబోతోంది. టాటా మోటార్స్ తన CNG కార్లలో ఆఫర్ చేస్తోంది. టాటా తన కార్లలో 30-30 లీటర్ల రెండు CNG సిలిండర్లను అందిస్తోంది. డ్యూయల్ సిలిండర్‌తో ఆల్ట్రోజ్‌ను లాంచ్ చేసిన మొదటి కంపెనీ మారుతీ. ఇప్పుడు ఆ సెగ్మెంట్‌లో టియాగో, టిగోర్, పంచ్ పేర్లు కూడా చేరిపోయాయి.

- Advertisement -

మారుతీ తన కొత్త CNG కారు టీజర్‌ను విడుదల చేసింది. మారుతి సుజుకి తన S-CNG ప్లాట్‌ఫారమ్‌కు ట్విన్-ట్యాంక్ సెటప్‌ను కూడా యాడ్ చేస్తూ టీజర్ విడుదల చేసింది. విశేషమేమిటంటే మారుతి ఇప్పటికే సూపర్ క్యారీ వంటి LCV మోడల్స్‌తో ట్విన్ ట్యాంక్ సెటప్‌ను ఉపయోగిస్తోంది. సూపర్ క్యారీ CNG వెహికల్ రెండు CNG ట్యాంకులను కలిగి ఉంది. ఇందులోని ఒక్కో ట్యాంక్ 35 లీటర్ల సామర్థ్యం కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పుడు తన ప్యాసింజర్ వాహనాల కోసం ట్విన్-ట్యాంక్ సెటప్‌ను ప్రారంభించాలని భావిస్తోంది.

Also Read: టాటా నుంచి కొత్త కార్లు.. ఇక EV సెగ్మెంట్‌లో యుద్ధమే

మారుతి S-CNG పోర్ట్‌ఫోలియోలో ప్రస్తుతం ఎంట్రీ-లెవల్ ఆల్టో K10, WagonR, Dzire, Celerio, Eeco, S-Presso, Frontex, Ertiga, Brezza, Grand Vitara ఉన్నాయి. CNG ఆప్షన్ త్వరలో న్యూ జెన్ స్విఫ్ట్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. ఒక్కొక్కటి 25-30 లీటర్ల సామర్థ్యంతో ట్విన్ CNG ట్యాంకులు ఉంటాయి. ట్విన్ ట్యాంక్ సెటప్‌తో స్పేర్ టైర్ బూట్ కిందకు తీసుకువెళుతుంది. మారుతి కార్లలో షార్ట్ సర్క్యూట్‌లను నిరోధించడానికి ప్రత్యేక మెకానిజం ఉంటుంది. మొత్తం CNG సెటప్ లీక్ ప్రూఫ్, రస్ట్-రెసిస్టెంట్‌తో వస్తుంది. గ్యాస్ ఫిల్ చేసేప్పుడు CNG కారు స్టార్ట్ కాకుండా మైక్రో స్విచ్ కంట్రోల్ చేస్తుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News