Big Stories

New Maruti Dzire Launch: మారుతి నుంచి కొత్త డిజైర్.. బాప్రే.. మైలేజ్ 31కిమీ కంటే ఎక్కువే..!

New Maruti Dzire Launch: మారుతి సుజుకి ఇటీవలే తన కొత్త స్విఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 6.49 లక్షలుగా ఉంది. ఈ కారు బెస్ట్ సేల్స్ నమోదు చేసింది. మే నెలలో ఇది అత్యధికంగా అమ్ముడైన మోడల్‌గా నిలిచింది. ఇప్పుడు మారుతి సుజుకి తన కొత్త కాంపాక్ట్ సెడాన్ కారు డిజైర్ ఫేస్‌లిఫ్ట్‌ను తీసుకువస్తోంది. ఈ కారు గురించి ఇప్పటికే అనేక అప్‌డేట్‌లు అందుబాటులో ఉన్నాయి. కొత్త డిజైర్ టెస్టింగ్ సమయంలో చాలా సార్లు కనిపించింది. ఇప్పుడు వచ్చే నెలలో దీన్ని లాంచ్ చేయవచ్చని వార్తలు వస్తున్నాయి. కొత్త డిజైర్ కొత్త ఇంజన్‌తో రానుంది.

- Advertisement -

మారుతి సుజుకి ఫేస్‌లిఫ్టెడ్ డిజైర్‌లో కొత్త Z-సిరీస్ 3 సిలిండర్ ఇంజన్‌ కూడా ఉంటుంది. ఈ ఇంజన్ కొత్త స్విఫ్ట్‌‌లోనూ అందించారు. ఈ 1.2 లీటర్ ఇంజన్ 82 హెచ్‌పి పవర్, 112 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇది 5 స్పీడ్ మ్యాన్యువల్, 5 స్పీడ్ AMT గేర్‌బాక్స్‌తో అమర్చబడి ఉంటుంది. కొత్త డిజైర్‌లో పవర్, టార్క్‌లో కొన్ని చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. కొత్త ఇంజన్ 14 శాతం ఎక్కువ మైలేజీని ఇస్తుందని మారుతి తెలిపింది.

- Advertisement -

న్యూ-జెన్ మారుతి డిజైర్ మొదటిసారిగా స్పైడ్ టెస్టింగ్‌లో 360-డిగ్రీ కెమెరా, ఫ్లోటింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కొత్త టెయిల్ ల్యాంప్ డిజైన్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: CSD క్యాంటీన్లలో హ్యుందాయ్ వెర్నా.. తక్కువ ధరకే దక్కించుకోవచ్చు!

ఇది మూడు సిలిండర్ల ద్వారా వేగాన్ని అందుకుంటుంది. కొత్త డిజైర్ 3 సిలిండర్ ఇంజన్‌ను పొందుతుంది. ఇది చాలా పవర్‌ఫుల్, మెరుగైన మైలేజీని కూడా అందిస్తుంది. ఈరోజుల్లో 4 సిలిండర్ల ఇంజన్ బదులు 3 సిలిండర్ ఇంజన్ ఎక్కువగా వాడుతున్నారు ఎందుకంటే ఒక సిలిండర్ తగ్గితే ఇంజన్ సైజు తగ్గిపోయి ఖర్చు కూడా తగ్గుతుంది. దీని వల్ల కారు ధర కూడా కాస్త తగ్గుతుంది. అంతే కాకుండా మెరుగైన మైలేజీ కూడా లభిస్తుంది.

Also Read: కొత్త లుక్‌తో టీవీఎస్ జూపిటర్.. పిచ్చెక్కిస్తోన్న ఫీచర్లు!

లీకుల ప్రకారం కొత్త డిజైర్‌లో CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ కారు 25kmpl మైలేజీని ఇవ్వగలదు. అయితే CNG మోడ్‌లో దీని మైలేజ్ 31కిమీ కంటే ఎక్కువగా ఉంటుంది. మరో ప్రత్యేకత ఏమిటంటే  కొత్త డిజైర్‌లో రెండు సిఎన్‌జి సిలిండర్‌లు ఉండొచ్చు. దీని కారణంగా దాని బూట్ స్పేస్‌లో ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే దీనికి సంబంధించి కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం రాలేదు. ప్రస్తుతం డిజైర్ ఎక్స్-షోరూమ్ ధర రూ.6.56 లక్షల నుండి ప్రారంభమవుతుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News