Big Stories

Discount on Maruti Cars: మారుతి కార్లపై ఆఫర్ల జాతర.. ఒక్కో కారుపై లక్షల్లో డిస్కౌంట్లు!

Huge Discount on Maruti Car: దేశంలో కార్ల వినియోగం రోజురోజుకు గణనీయంగా పెరుగుతుంది. ప్రతి ఒక్కరూ సొంత కారు ఇంట్లో ఉండాలని భావిస్తున్నారు. ముఖ్యంగా మధ్య తరగతి ప్రజలు కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే దేశపు అతిపెద్ద ఆటోమొబైల్ తయారీదారు మారుతి సుజుకి Nexa డీలర్‌షిప్‌ల ద్వారా అందించే మూడు SUVలపై భారీ డిస్కౌంట్‌లను అందిస్తోంది. ఒక్కోదానిపై లక్షల్లో తగ్గింపులు పొందొచ్చు. ఏ ఎస్‌యూవీపై కంపెనీ ఎంత తగ్గింపును అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

- Advertisement -

Maruti Suzuki Jimny
కంపెనీ తన ఆఫ్-రోడ్ SUV జిమ్నీపై అత్యధిక తగ్గింపును అందిస్తోంది. సమాచారం ప్రకారం ఈ SUV టాప్ వేరియంట్‌లపై రూ. 1.50 లక్షల వరకు ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇంతకుముందు కంపెనీ దీనిపై రూ.50 వేల ఆఫర్ ఇస్తుండగా, ఇప్పుడు దాన్ని రూ.1.50 లక్షలకు పెంచింది. ఈ ఆఫర్ SUV  టాప్ వేరియంట్ ఆల్ఫాపై ఇస్తోంది. జీటా వేరియంట్‌పై కంపెనీ రూ.50 వేల వరకు ఆఫర్లను అందిస్తోంది. మే 2024లో కేవలం 274 యూనిట్లు మాత్రమే సేల్ కావడంతో కంపెనీ ఈ SUVపై అత్యధిక ఆఫర్‌ను అందించింది. దీని షోరూమ్ ధర రూ.12.74 లక్షలు.

- Advertisement -

Also Read: స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇవి మహిళల కోసమే గురూ!

Maruti Grand Vitara
గ్రాండ్ విటారా కూడా Nexa డీలర్‌షిప్‌ల, మారుతి ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఈ ఎస్‌యూవీపై కంపెనీ రూ.1.4 లక్షల డిస్కౌంట్ ఇస్తోంది. ఈ ఆఫర్ దాని న హైబ్రిడ్ వెర్షన్‌పై అందుబాటులో ఉంది. ఇది కాకుండా SUV మైల్డ్ హైబ్రిడ్, జీటా వేరియంట్‌లపై రూ. 64 వేలు, సిగ్మాపై రూ. 34 వేలు, సిఎన్‌జిపై రూ. 14 వేలు వరకు ఆదా చేసుకోవచ్చు. ఇది 10.87 లక్షలు ఎక్స్‌-షోరూమ్‌గా ఉంది.

Maruti Suzuki Fronx
కంపెనీ మూడో ఎస్‌యూవీ ఫ్రాంక్స్‌పై కూడా డిస్కౌంట్ అందిస్తోంది. గతంలో ఇస్తున్న తగ్గింపుని  రూ.20 వేలకు పెంచారు. ఈ SUV టర్బో వేరియంట్‌పై రూ. 77 వేలు, ఇతర వేరియంట్లపైరూ. 32500, సిఎన్‌జి వేరియంట్‌పై రూ. 12 వేల ఆఫర్‌లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.7.51 లక్షలుగా ఉంది.

Also Read: ఇక పెట్రోల్ అక్కర్లేదు గురూ.. రూ.15 వేలకే CNG.. 100 కిమీ మైలేజ్!

NOTE: మారుతీ షోరూమ్‌లు వివిధ నరగాలు, పట్టణాల్లో ఉన్నాయి. వీటి నుంచి మీరు కార్లను కొనుగోలు చేయవచ్చు. అయితే కొన్ని పరిస్థితులు కారణంగా SUVలపై ఆఫర్‌లలో మార్పులు ఉండవచ్చు. మీరు వాహనాన్ని కొనుగోలు చేయడానికి సిద్ధమవుతున్నట్లయితే, సమీపంలోని షోరూమ్‌ నుంచి పూర్తి సమాచారాన్ని తెలుసుకోండి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News