Big Stories

Maruti Suzuki Grand Vitara: మారుతి సుజుకి ఆఫర్ల జాతర.. ఏకంగా రూ.1.08 లక్షలకు పైగా భారీ డిస్కౌంట్ ప్రయోజనాలు.. లాస్ట్ డేట్ ఇదే..!

Maruti Suzuki Grand Vitara: ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఆటో మొబైల్ మార్కెట్‌లో దూసుకుపోతోంది. సేల్స్ విషయంలో తనదైన శైలిలో అదరగొడుతోంది. అదే సమయంలో తమ కార్ల సేల్స్‌ను మరింత పెంచేందుకు కొత్త కొత్త ఆఫర్లను కూడా తీసుకొస్తూ వాహన ప్రియులను అట్రాక్ట్ చేస్తుంది. ముఖ్యంగా కంపెనీ ఈ ఏడాది ప్రారంభం నుంచి ప్రతి నెల తమ కార్లపై మంచి డిస్కౌంట్లను అందిస్తూ వస్తుంది. ఇక ఈ నెల కూడా అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.

- Advertisement -

మారుతి సుజుకీ ఈ జూలై నెలలో గ్రాండ్ విటారాలోని పలు ఎస్‌యూవీలపై దాదాపు రూ.1.08 లక్షలకు పైగా ప్రయోజనాలను అందిస్తున్నట్లు తెలిపింది. అయితే అది ఒక్క నగదు రూపంలోనే కాకుండా ఇతర ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పోరేట్ డిస్కౌంట్ సహా మరిన్నింటిపై ఈ ఆఫర్లు పొందొచ్చు. అలాగే తమ మోడళ్లపై అదనపు వారంటీ కూడా ప్రకటించింది. కాగా గ్రాండ్ విటారాపై వాహన ప్రియులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్న క్రమంలో కంపెనీ ఈ వర్షాకాల సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని ఆఫర్లు ప్రకటించింది. దీని ద్వారా తమ కార్ల సేల్స్ మరింత పెంచుకునేందుకు లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఆఫర్ జూలై 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాగా గ్రాండ్ విటారా ఫుల్ ట్యాంక్ పై ఏకంగా 1200 కి.మీ మైలేజీని అందిస్తుంది.

- Advertisement -

ఇదిలా ఉంటే మారుతి సుజుకి అందిస్తున్న ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. జూలై 2024లో మారుతి సుజుకి అందిస్తున్న డిస్కౌంట్ ఆఫర్లలో గ్రాండ్ విటారాపై రూ.50,000 నగదు డిస్కౌంట్ అందిస్తుంది. అలాగే స్క్రాపేజీ రూ.55,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ.50,000, రూ.3000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ.3000 వరకు గ్రామీణ డిస్కౌంట్, రూ.28,300 వరకు పొడిగించిన వారంటీ వంటివి ఉన్నాయి.

Also Read: హోండా కార్లపై మాన్‌సూన్ డీల్స్.. అదనంగా గిఫ్ట్‌లు కూడా.. ఎప్పటి వరకు ఉంటుందంటే..?

దీంతోపాటు కంపెనీ గ్రాండ్ విటారా హైబ్రిడ్ పెట్రోల్ సిగ్మా వేరియంట్‌పై కూడా పలు ఆఫర్లు ప్రకటించింది. దీనిపై రూ.30,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.3000 కార్పోరేట్ డిస్కౌంట్, రూ.25,000 స్క్రాపేజ్, రూ.3000 వరకు గ్రామీణ డిస్కౌంట్ అందిస్తుంది.

అలాగే గ్రాండ్ విటారా సీఎన్జీ వేరియంట్‌పై అదిరిపోయే ఆఫర్లు కంపెనీ ప్రకటించింది. ఇందులో రూ. 10,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 25,000 స్క్రాపేజ్, రూ. 20,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు గ్రామీణ డిస్కౌంట్ వంటివి లభిస్తున్నాయి.

అంతేకాకుండా గ్రాండ్ విటారా మైల్డ్-హైబ్రిడ్ పెట్రోల్ వేరియంట్‌పై నగదు డిస్కౌంట్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు లభిస్తున్నాయి. అందులో రూ. 30,000 క్యాష్ డిస్కౌంట్, రూ. 30,000 ఎక్స్ఛేంజ్ బోనస్, రూ. 3,000 వరకు కార్పొరేట్ డిస్కౌంట్, రూ. 3,000 వరకు గ్రామీణ డిస్కౌంట్, రూ. 35,000 స్క్రాపేజీ వంటివి పొందొచ్చు. అందువల్ల గ్రాండ్ విటారా కోసం ఎప్పట్నుంచో చూస్తున్నట్లయితే ఇదే మంచి చాయిస్.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News