Big Stories

Maruti Dream Series: అదిరిపోయే న్యూస్.. మీ డ్రీమ్ మారుతీ నిజం చేస్తోంది!

Maruti Dream Series: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ తన కస్టమర్ల కోసం తరచూ ఆకర్షణీయమైన ఆఫర్‌లను అందజేస్తుంది. ఈ నేపథ్యంలో కంపెనీ ఇటీవలే డ్రీమ్ సిరీస్‌ కార్లను ప్రారంభించింది. కొనుగోలుదారులు ఈ డ్రీమ్ సిరీస్ కార్లతో పాటు మరెన్నో వస్తువులను దక్కించుకోవచ్చు. ఇప్పుడు కంపెనీ ఈ ఆఫర్‌ను ఒక నెల పాటు పొడిగించింది. అంటే కంపెనీ ప్రత్యేక డ్రీమ్ సిరీస్ లైనప్ కార్లు జూలై నెల మొత్తం అందుబాటులో ఉంటాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

అన్ని బ్రాండ్‌ల మాదిరిగానే మారుతి సుజుకీ అవుట్‌లెట్లలో కస్టమర్ల సంఖ్య కూడా ఇటీవలి కాలంలో గణనీయంగా తగ్గింది. జూన్ నెలలో, ఆల్టో కె10, ఎస్-ప్రెస్సో వంటి ప్రసిద్ధ మోడళ్ల విక్రయాలలో 33.15 శాతం భారీ క్షీణత కనిపించింది. డ్రీమ్ సిరీస్ లైనప్ ప్రారంభించిన తర్వాత అవుట్‌లెట్లలో కస్టమర్ల సంఖ్య 17 శాతం పెరిగిందని కంపెనీ తెలిపింది. స్పెషల్ ఎడిషన్ మోడల్‌కు ఇప్పటివరకు 21,000 బుకింగ్‌లు వచ్చాయి.

- Advertisement -

Also Read:  మనూరి బండి.. అదరకొట్టిన టీవీఎస్ ఎక్స్‌ఎల్.. ఏంటయ్యా ఆ క్రేజ్!

కంపెనీలోని మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పార్థో బెనర్జీ మట్లాడుతూ “డ్రీమ్ సిరీస్‌కు చాలా మంచి స్పందన వచ్చింది. అందువల్ల మేము దానిని జూలై వరకు కూడా పొడిగించబోతున్నాము. మేము జూన్ నెలలో డ్రీమ్ సిరీస్‌ను ప్రారంభించాము. ఇది వినియోగదారుల సంఖ్య 17 శాతం పెరిగింది. ఈ కీలకమైన ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌లో కొంత కొరత ఉంది. అయితే మేము గత నెలలో 21,000 బుకింగ్‌లను సాధించాము. ఇప్పుడు మేము ఈ ఖాతాదారుల కోసం ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నాము”.

గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో అమ్మకాలు కేవలం 1.2 శాతం మాత్రమే పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో 4,14,055 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈసారి ఈ సంఖ్య 4,19,114 యూనిట్లు. ప్రస్తుతం ఎంట్రీ లెవల్ మోడల్స్ అమ్మకాలు దాదాపు 24 శాతం క్షీణించి 30,816 యూనిట్లకు చేరుకున్నాయి.

ప్రస్తుతం కంపెనీ ఇన్వెంటరీ దాదాపు 37-38 రోజులు. పరిశ్రమలో 30 రోజులకు సరిపడ స్టాక్ ఉంది. దీని గురించి పార్థో బెనర్జీ మాట్లాడుతూ.. “మా ప్రస్తుత స్టాక్ స్థాయి సాధారణం కంటే కొంచెం ఎక్కువగా ఉంది. కానీ ఇది దాదాపు స్టాండర్డ్ రేంజ్‌లో ఉంది. ఈ పరిస్థితిలో లిమిడెడ్-ఎడిషన్ మోడల్‌లు కంపెనీకి వాల్యూమ్‌లతో సహాయం చేస్తున్నాయి. కంపెనీ ఇతర మోడళ్లపై కూడా ఈ వ్యూహాన్ని ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కంపెనీ ఇటీవలే ఫ్రాంక్స్ వెలాసిటీ ఎడిషన్‌ను కూడా విడుదల చేసింది”.

Also Read: నిస్సాన్ ఎక్స్-ట్రైల్ SUV వచ్చేస్తోంది.. టీజర్ చూస్తే పూనకాలే!

మారుతీ కంపెనీ జూన్ 2024 చివరి వరకు దాదాపు 1,64,000 కార్ల ఆర్డర్స్‌ను దక్కించుకోంది. ఇందులో ఎర్టిగా CNG వాటా దాదాపు 26 శాం. అంటే 43,000 యూనిట్లు. కస్టమర్ల అవసరాలను వీలైనంత త్వరగా తీర్చేందుకు ప్రయత్నిస్తున్నామని కంపెనీ తెలిపింది. కానీ దీనికి 2-3 వారాలు పడుతుంది. ఇది ప్రత్యేకమైన కలర్ కారణంగా ఎక్కువగా టైమ్ తీసుకుంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News