Big Stories

Best CNG Cars Under Rs 8 Lakhs: తక్కువ బడ్జెట్ లో ఎక్కువ మైలేజ్ ఇచ్చేవి ఇవే.. ఈ CNG కార్లను అస్సలు మిస్ చేయకండి!

Best CNG Cars Under Rs 8 Lakhs: భారత ఆటో మార్కెట్‌లో CNG కార్లకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. దాదాపు CNG కార్లకు డిమాండ్‌ 40 శాతం పెరిగింది. CNG కార్లను కంపెనీలు అందిస్తాయి. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ ధర పెట్రోల్, డీజిల్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది. మధ్య తరగతి ప్రజలకు ఎక్కువగా వీటినే ఇష్టపడుతున్నారు.ఈ కార్లు ప్రజలకు మంచి మైలేజీని అందిస్తాయి. అంతే కాకుండా ఇంధనంపై ఎక్కువగా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. వాహన తయారీదారులు ప్రజల అభిరుచులకు అనుగుణంగా కార్లను మార్కెట్‌లోకి తీసుకొస్తున్నారు. అనేక CNG వేరియంట్లు దేశీయ మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

- Advertisement -

అయితే మీరు కూడా కొత్త CNG కారును కొనుగోలు చేయాలని చూస్తున్నట్లయితే మార్కెట్ లభించి బెస్ట్ CNGల గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి చాలా పెద్ద కంపెనీలు తక్కువ బడ్జెట్ సెగ్మెంట్‌లో CNG కార్లను ఆఫర్ చేస్తున్నాయి. ఇవి మంచి అమ్మకాలను మాత్రమే కాకుండా మైలేజీని కూడా ఇస్తున్నాయి. ఇప్పుడు 8 లక్షల రూపాయల్లో కొనుగోలు చేసే మూడు CNG కార్లు ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: టాటా మోటర్స్ నుంచి ప్రీమియం EV.. బండి నెక్స్ట్ లెవల్ అంతే!

Maruti Suzuki Alto K10
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఇది ఒకటి. అదే సమయంలో వినియోగదారులు కూడా దీన్ని ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. భారతదేశంలో ఇప్పటివరకు 50 లక్షలకు పైగా యూనిట్లు  మారుతి సుజుకి ఆల్టో K10 అమ్ముడయ్యాయి. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.74 లక్షలు. ఈ కారు 1 కిలోల CNGలో 33.85 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది.

Maruti Suzuki Wagon R
మీరు CNG పవర్‌ట్రెయిన్‌తో కారును కొనుగోలు చేయాలనుకుంటే మీకు మారుతి వ్యాగన్ఆర్‌ను ఒక బెస్ట్ ఆప్షన్‌గా ఉంటుంది. ఈ కారు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న హ్యాచ్‌బ్యాక్ కార్లలో ఒకటి. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ సిఎన్‌జి ప్రారంభ ధర రూ.6.45 లక్షలు. ఈ కారు 1 కిలో సిఎన్‌జిలో 33.47 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుందని కంపెనీ వెల్లడించింది.

Also Read: చెబితే నమ్మరు.. రూ.1.5 లక్షలకే మారుతీ వ్యాగన్ ఆర్.. కిర్రాక్ డీల్ మామ!

Tata Punch
ఇది టాటా మోటార్స్ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. అంతే కాకుండా టాటా పంచ్ ఇటీవలే B-NCAP ద్వారా క్రాష్ టెస్ట్ చేయబడింది. ఇందులో ఈ కారు పూర్తి ఐదు పాయింట్లను స్కోర్ చేసింది. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.7.23 లక్షలు. టాటా పంచ్ 1 కిలోల CNGలో 26.99 కిలోమీటర్లు నడుస్తుందని కంపెనీ పేర్కొంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News