Big Stories

Hyundai i40 Vs Maruti Fronx: మారుతి ఫ్రాంక్స్‌‌కి పోటీగా హ్యుందాయ్‌ ఐ40.. రెండిటిలో ఏది బెటర్?

Hyundai i40 Vs Maruti Fronx: ఇండియా ఆటోమొబైల్​ సెక్టార్​లో హ్యుందాయ్‌, మారుతి సుజికి కార్లకు క్రేజీ డిమాండ్​ ఉంది. హ్యుందాయ్ మార్కెట్‌లోని ఎంట్రీ లెవల్, హ్యాచ్‌బ్యాక్, సెడాన్, SUV వంటి దాదాపు ప్రతి సెగ్మెంట్‌లో వివిధ రకాల వాహనాలను అందిస్తుంది. హ్యుందాయ్ ఐ40 కంపెనీకి చెందిన స్టైలిష్ హ్యాచ్‌బ్యాక్ కారు. ఇది మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో అందించబడిన 5 సీట్ల కారు. అలానే మారుతి కూడా అన్ని విభాగాల్లో రకరకాల కార్లను అందిస్తోంది. ఫ్రాంక్స్‌కు పోటీగా మారుతి త్వరలో ఐ40 కారును దేశీయ మార్కెట్‌లోకి తీసుకొచ్చే అవకాశం ఉంది. ఈ రెండిటిలో ఉన్న ఫీచర్లు, ధరలు, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.

- Advertisement -

Hyundai i40 Specifications
ఇది డీజిల్ ఇంజన్ కారు. దీనిలో 16.5 kmpl అధిక మైలేజీని కంపెనీ పేర్కొంది. కారులో 45 లీటర్ల పెద్ద ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ప్రస్తుతం ఈ కారు భారతదేశంలో అందుబాటులో లేదు. ఈ కారు దక్షిణ కొరియా, గ్లోబల్ మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇండియాలో లాంచ్‌కు సంబంధించి కంపెనీ ఇంకా ఎలాంటి అప్‌డేట్ ఇవ్వలేదు. నివేదికల ప్రకారం ఈ కారును పెట్రోల్‌ ఇంజన్‌తో భారతదేశంలో విడుదల చేయవచ్చు.

- Advertisement -

Also Read: భలే డిమాండ్.. ఈ కారు కావాలంటే 14 నెలలు ఆగాల్సిందే!

హ్యుందాయ్ ఐ40 ప్రారంభ ధర రూ. 16 లక్షలు. ఇది పవర్ స్టీరింగ్‌తో వస్తుంది. ఈ కారులో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 16 అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఈ కారులో ఎయిర్‌బ్యాగ్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, సీట్ బెల్ట్ రిమైండర్ వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో పెద్ద బూట్ స్పేస్ ఉంది.

Maruti Fronx
ఇది ఐదు సీట్ల కారు. ఇది కొత్త జనరేషన్ కోసం 10 కలర్స్‌లో వస్తుంది. ఇందులో 6 స్పీడ్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది. ఈ కారు గంటకు 180 కిమీ వేగాన్ని అందిస్తోంది. కారు టాప్ వేరియంట్లలో అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. కారు ట్యూబ్‌లెస్ టైర్లు, అధునాతన డ్రైవర్ టెక్నాలజీని కలిగి ఉంది. ఈ సిస్టమ్ సెన్సార్‌లపై పని చేస్తుంది. మరొక వాహనం చాలా దగ్గరగా వస్తే హెచ్చరికను జారీ చేస్తుంది. కారులో 998 cc, 1197 cc అనే రెండు ఇంజన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు CNG ఇంజన్ 28.51 km/kg మైలేజీని ఇస్తుంది.

Also Read: స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇవి మహిళల కోసమే గురూ!

ఫ్రాంక్స్‌లో యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది. ఇది నాలుగు టైర్లను కంట్రోల్ చేయడానికి సహాయపడుతుంది. ఈ ఫ్యామిలీ కారు 308 లీటర్ల బూట్ స్పేస్‌తో వస్తుంది. తద్వారా మీరు దూర ప్రయాణాలకు ఎక్కువ లగేజీని సులభంగా తీసుకెళ్లవచ్చు. ఇది 190 మిమీ గ్రౌండ్ క్లియరెన్స్ కలిగి ఉంది. కారులో సీట్ బెల్ట్ రిమైండర్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. బేస్ మోడల్ రూ. 8.71 లక్షల ఆన్-రోడ్ ప్రైస్‌గా ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News