Big Stories

Maruti Suzuki Eeco: రికార్డులు బ్రేక్.. సేల్స్‌లో టాప్ లేపిన మారుతి సుజుకి ఈకో!

Maruti Suzuki Eeco: దేశంలోని అతిపెద్ద కార్ల తయారీ క కంపెనీ మారుతీ సుజుకి జూన్ నెల విక్రయాల నివేదికను విడుదల చేసింది. అన్నిటిలానే ఈసారి కూడా కంపెనీ చౌకైన 7 సీట్ల Eeco అమ్మకాలలో దూసుకుపోయింది. ఈకో విక్రయాల్లో మరోసారి భారీగా వృద్ధి కనిపించింది. ఇది భారతదేశంలో అత్యంత సరసమైన 7 సీట్ల MPV. వ్యక్తిగత అవసరాలకు, అంబులెన్స్‌లలో కూడా దీన్ని ఉపయోగిస్తారు. మారుతి సుజుకి విక్రయాలను పెంచడంలో ఈ కారు కీలక పాత్ర పోషిస్తోంది.

- Advertisement -

గత నెలలో మారుతి సుజుకి 10,771 యూనిట్ల EECO విక్రయించగా, గత ఏడాది ఇదే కాలంలో ఈ సంఖ్య 9,354 యూనిట్లుగా ఉంది. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు బాగానే పెరిగాయి. మారుతి సుజుకి తన మల్టీ-పర్పస్ వ్యాన్‌గా ఈకోను కొత్త ఇంజన్‌తో పరిచయం చేసింది. BS6 ఇంజిన్‌తో విడుదల చేసిన తొమ్మిదవ కారు Eeco. కంపెనీ తన వాహనాలను నిరంతరం BS6కి అప్‌గ్రేడ్ చేస్తోంది.

- Advertisement -

Also Read: వేలానికి హీరో కొత్త బైక్.. 100 మందికి మాత్రమే ఛాన్స్!

Eeco 1.2 లీటర్ నాలుగు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌‌తో వస్తుంది. ఇది 6000 rpm వద్ద 73 bhp పవర్, 3000 rpm వద్ద 101 Nm టార్క్‌ను రిలీజ్ చేస్తుంది. పెట్రోల్‌పై దాని మైలేజీ లీటరుకు 16.11 కి.మీ. దీని CNG వేరియంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఇది 21.8 km/kg మైలేజీని ఇస్తుంది. ఈకో మొత్తం విక్రయాల్లో 17 శాతం CNG వేరియంట్ వాటాను కలిగి ఉంది.

2019లో Eeco మొత్తం అమ్మకాలు లక్ష దాటాయి. ఇది 2018 కంటే 36 శాతం ఎక్కువ. మారుతి ఈకో కంపెనీ లైనప్‌లో తొమ్మిదవ కారు. ఇది BS6 ఎమిషన్ స్టాండర్డ్ ఇంజన్‌తో వస్తుంది. కంపెనీ ఇంతకుముందు మారుతి బాలెనో, ఆల్టో 800, మారుతి వ్యాగన్ ఆర్, మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్, మారుతి ఎర్టిగా, మారుతి ఎక్స్‌ఎల్ 6, మారుతి ఎస్-ప్రెస్సోలను బిఎస్ 6 ఇంజిన్‌తో విడుదల చేసింది.

Also Read: రేసింగ్ థ్రిల్లర్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త బైక్.. ఊపేస్తున్న లుక్!

మారుతి 2010లో భారతీయ మార్కెట్లో Eeco MPVని విడుదల చేసింది. ఇది కేవలం రెండేళ్లలో లక్షకు పైగా యూనిట్లను విక్రయించింది. 2014లో మారుతి ఈకో లక్ష కార్లను విక్రయించింది. కార్గో విభాగంలో దాని డిమాండ్ స్థిరంగా ఉంది. మారుతి ఇప్పటి వరకు 6.5 లక్షలకు పైగా ఈకో యూనిట్లను విక్రయించింది. Eeco  ఎక్స్-షోరూమ్ ధర రూ. 3.80 లక్షల నుండి రూ. 6.84 లక్షల మధ్య ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News