Big Stories

Mahindra Scorpio EV: దెబ్బ అదుర్స్.. మహీంద్రా నుంచి బొలెరో, స్కార్పియో EV వేరియంట్స్!

Mahindra To launch Scorpio And Bolero EV: గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ మార్కెట్‌లో ఎలక్ట్రిక్ సెగ్మెంట్ (EV) కార్ల డిమాండ్‌ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం ఈ విభాగంలో టాటా మోటార్స్ పూర్తి ఆధిపత్యాన్ని చెలాయిస్తుంది. భారతదేశంలో మొత్తం ఎలక్ట్రిక్ కార్ల విక్రయాలలో టాటా మోటార్స్ 65 శాతం కంటే ఎక్కువ వాటా కలిగి ఉంది. టాటా పంచ్ EV, టాటా నెక్సాన్ EV, టాటా టియాగో EV, టాటా టిగోర్ EV ఈ విభాగంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి.

- Advertisement -

అయితే మహీంద్రా కూడా ఈ విభాగంలో భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇప్పుడు కంపెనీ రాబోయే సంవత్సరాల్లో అత్యధికంగా అమ్ముడైన మహీంద్రా స్కార్పియో, బొలెరో ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. వీటి లాంచ్ ఎప్పుడు? ఎటువంటి ఫీచర్లు ఉంటాయి? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం.

- Advertisement -

Also Read: కార్లపై రూ.3 లక్షల డిస్కౌంట్.. ఫుల్ డీటైల్స్‌పై ఓ లుక్కేయండి!

ఇంటర్నెట్‌లోని సమాచారం ప్రకారం మహీంద్రా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సిఇఒ రాజేష్ జెజురికర్ మాట్లాడుతూ కాలక్రమేణా కంపెనీ అన్ని ICE మోడల్‌ల ఎలక్ట్రిక్ వెర్షన్‌లు మార్కెట్‌లోకి తీసుకురానున్నాము. అంతే కాకుండా బొలెరో, స్కార్పియో ఎలక్ట్రిక్ వెర్షన్‌లను కూడా విడుదల చేయడానికి కంపెనీ ప్రయత్నిస్తోందని అన్నారు. మహీంద్రా ఇతర ఎలక్ట్రిక్ మోడల్‌ల మాదిరిగానే రాబోయే మహీంద్రా, బొలెరో EV బ్యాటరీ ప్యాక్, మోటార్ కలిగి ఉంటాయి. అయితే బొలెరో EV, స్కార్పియో EVల లాంచ్ తేదీపై కంపెనీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు.

ఆటో మార్కెట్‌లో ఈ రెండు కార్లు హాట్‌టాపిక్‌గా మారాయి. కస్టమర్లు ఈ ఎలక్ట్రిక్ SUV కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు మహీంద్రా తన అత్యంత డిమాండ్ ఉన్న మిడ్-సైజ్ SUV XUV700 ఎలక్ట్రిక్ వెర్షన్‌ను 2024 చివరి నాటికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. రాబోయే మహీంద్రా ఎలక్ట్రిక్ SUV XUV.e8 గా విడుదల చేయనుంది.

Also Read: బడ్జెట్ తక్కువ మైలేజ్ ఎక్కువ.. ఈ CNG కార్లను మిస్ చేయకండి!

అయితే రాబోయే ఎలక్ట్రిక్ SUV 60kWh, 80kWh బ్యాటరీలను కలిగి ఉండే రెండు బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. మరోవైపు రాబోయే ఎలక్ట్రిక్ SUV ఇంటీరియర్ గురించి మాట్లాడితే ఇది స్టాండర్డ్ మహీంద్రా XUV700 మాదిరిగానే ఉంటుంది. మహీంద్రా రాబోయే ఎలక్ట్రిక్ SUV ధర రూ. 35 లక్షల నుండి రూ. 40 లక్షల వరకు ఉండే అవకాశం ఉంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News