Big Stories

Mahindra Global Pik Up: మహీంద్రా నుంచి కొత్త పికప్ ట్రక్.. రూ. 25 లక్షలతో త్వరలో లాంచ్!

Mahindra Global Pik Up: ప్రపంచ ఆటో మార్కెట్‌లో పికప్ ట్రక్కులకు విపరీతమైన క్రేజ్ ఉంది. ఇవి పూర్తి స్థాయి ఎస్‌యూవీ వాహనాలు. వీటిని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. ఇవి దూర ప్రయాణాలకు చాలా అనుకూలంగా ఉంటాయి. మీ క్యాంప్‌కు సంబంధించిన వస్తువులను ఈజీగా తీసుకెళ్లవచ్చు.ఈ హైఎండ్ SUV బోల్డ్ లుక్స్, సాలిడ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. మహీంద్రా తన కొత్త గ్లోబల్ పికప్‌ ట్రక్‌ను ఈ సెగ్మెంట్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. ప్రస్తుతం కంపెనీ దాని ధర, లాంచ్ తేదీని ఇంకా వెల్లడించలేదు.

- Advertisement -

మహీంద్రా గ్లోబల్ పిక్ అప్ ప్రారంభ ధర రూ. 15 లక్షల నుండి రూ. 25 లక్షల ఎక్స్-షోరూమ్‌లో అందించే అవకాశం ఉంది. అదే సమయంలో కంపెనీ దీనిని సెప్టెంబర్ 2026 నాటికి భారతదేశంలో లాంచ్ చేయనుంది. దీనికి ముందు గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టవచ్చు. మహీంద్రా గ్లోబల్ పిక్ అప్ ట్రక్‌ శాటిన్ టైటానియం గోల్డ్ పెయింట్‌ అందిచవచ్చు. ఇది డ్యూయల్ టోన్ ఆప్షన్ కూడా కలిగి ఉంటుంది.

- Advertisement -

Also Read: బిగ్గెస్ట్ డిస్కౌంట్.. రూ.12 వేలకే ఐఫోన్ 14 ప్లస్.. అసలు కారణం ఇదే!

ఇది అట్రాక్టివ్ లుక్ ఇస్తుంది. ఆరెంజ్, నియాన్ కలర్ హైలైట్స్ ఇందులో కనిపిస్తాయి. మహీంద్రా ఈ పిక్ అప్‌లో LED హెడ్‌లైట్లు, టైల్‌లైట్లు మరియు ఫాగ్ లైట్లు లభిస్తాయి. ఇందులో 2.2 mHawk డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తుంది. అధిక పికప్ కోసం కారులో 6 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను అందించవచ్చు.

మహీంద్రా పికప్‌ ఫీచర్లు

  • కారులో ఐదు సీట్ల ఎంపిక అందుబాటులో ఉంటుంది.
  • మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్లు.
  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్,క్రూయిజ్ కంట్రోల్ ఉంటాయి.
  • 4 వీల్ డ్రైవ్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్.
  • అల్లాయ్ వీల్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్.
  • పిల్లల ఎంకరేజ్‌లు, వెనుక సీటుపై ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు.
  • ఈ కారు గ్రౌండ్ క్లియరెన్స్ 187 మి.మీ.
  • LED ప్రొజెక్టర్ హెడ్‌లైట్, మైలేజ్ సుమారు 15 kmpl.
  • స్టార్ట్/స్టాప్ బటన్, ఫ్రంట్-బ్యాక్ కెమెరా.

మహీంద్రా గ్లోబల్ పిక్ అప్ మార్కెట్‌లోటయోటా హిలక్స్‌తో పోటీపడనుంది. Hilux క్రూయిజ్ కంట్రోల్, 4X4 వీల్ డ్రైవ్‌ కలిగి ఉంటుంది. దీని కారణంగా ఇది గుంతల రోడ్లపై ఎక్కువ పవర్ ఇస్తుంది. ఈ కారులో 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఇది ఇంటీరియర్‌కు డ్యాషింగ్ లుక్‌ని ఇస్తుంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను కలిగి ఉంది. ఈ SUV కారు ఐదు కలర్ వేరియంట్‌లో, లేటెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తుంది.

Also Read: 155 సీసీతో యమహా కొత్త స్కూటర్.. మతిపోగొడుతున్న ఫీచర్లు!

పికప్ సెగ్మెంట్‌లో ఇసుజు V-క్రాస్ వపర్‌ఫుల్ SUV. ఇది మాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ రెండింటిలోనూ వస్తుంది. ఈ కూల్ SUV 2 వీల్, 4 వీల్ డ్రైవ్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. ఈ కారు బేస్ మోడల్ రూ. 26.51 లక్షలకు అందుబాటులో ఉంది. ఇందులో 1898 సిసి పవర్ ఫుల్ డీజిల్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ 160.92 బిహెచ్‌పి పవర్ ఇస్తుంది. 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. ఈ కారులో హిల్ స్టార్ట్, క్రూయిజ్ కంట్రోల్, రియర్ వ్యూ కెమెరా వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News