Big Stories

Mahindra XUV400 Offers: మహీంద్రా ఆఫర్ల వర్షం.. XUV400 రూ.4 లక్షల డిస్కౌంట్!

Mahindra XUV400 Offers: ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా తన XUV400 ఎలక్ట్రిక్ SUVపై జూన్‌లో భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ఈ నెలలో ఈ కారుపై కంపెనీ రూ.4 లక్షల వరకు తగ్గింపును ఇస్తోంది. డిసెంబర్ 2023 నుండి కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారుపై ఆఫర్‌ను ప్రారంభించింది. దీనిపై ఇప్పటి వరకు రూ.4 లక్షల ఆఫర్‌ వస్తోంది. XUV400 కంపెనీకి దేశంలోనే మొదటి ఎలక్ట్రిక్ SUV. కంపెనీ పాత స్టాక్‌ను క్లియర్ చేయాలనుకుంటోంది. దీని కారణంగా వినియోగదారులకు దీనిపై భారీ బెనిఫిట్ పొందుతారు.

- Advertisement -

XUV400 మోడల్ సంవత్సరం 2023పై కంపెనీ మొత్తం రూ. 4 లక్షల తగ్గింపును అందిస్తోంది. ఇందులో క్యాష్ డిస్కౌంట్‌తో పాటు టూల్స్, బోనస్, కార్పొరేట్, ఇతర రకాల ప్రయోజనాలు అందుబాటులో ఉంటాయి. మరోవైపు కంపెనీ XUV400 మోడల్ ఇయర్ 2024పై రూ. 50,000 వరకు తగ్గింపును అందిస్తోంది. ఇది కంపెనీ నుండి ఈ మోడల్‌పై ఉన్న భారీ డిస్కౌంట్. దీని ఎక్స్-షోరూమ్ ధరలు రూ.15.49 లక్షల నుండి రూ.17.49 లక్షల వరకు ఉన్నాయి.

- Advertisement -

మహీంద్రా కొత్త PRO వేరియంట్‌లు EC PRO, EL PRO వేరియంట్‌ల పేరుతో విడుదల చేయబడ్డాయి. కొత్త EVలో అప్‌డేట్ డ్యాష్‌బోర్డ్, కొత్త ఫీచర్లు, డ్యూయల్ టోన్ థీమ్ ఇంతకముందు కంటే ఎక్కువ టెక్నాలజీ ఉన్నాయి. దీని పాత డ్యాష్‌బోర్డ్, క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ డిజైన్ మరింత అడ్వాన్స్‌గా కనిపిస్తాయి. డ్యాష్‌బోర్డ్ ప్యాసింజర్ వైపు ఇప్పుడు స్టోరేజ్ ప్లేస్‌లో పియానో ​​బ్లాక్ ఇన్సర్ట్‌ని చూస్తారు.

EVలో వెథర్ కంట్రోలో ఉంది. ఇది ఇప్పుడు XUV700, స్కార్పియో N లాగా కనిపిస్తుంది. ఇది కాకుండా XUV400  సెంట్రల్ AC వెంట్ కూడా పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ యూనిట్‌కు తగ్గట్టుగా ఉంటుంది. XUV700 లాగా స్టీరింగ్ వీల్ కూడా ఇన్‌స్టాల్ చేయబడింది. XUV400 క్యాబిన్‌లో అనేక కొత్త ఫీచర్లు చేర్చబడ్డాయి. వీటిలో పెద్ద 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే ఉన్నాయి.

ఇందులో బ్యాక్ సీటు పాసెంజర్ కోసం డ్యూయల్ జోన్ AC, టైప్-C USB ఛార్జర్, కొత్త బ్యాక్ AC వెంట్లు ఉన్నాయి. ఇది కాకుండా ఇది వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్, పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు వంటి సౌకర్యాలను కూడా కలిగి ఉంది. ఇప్పుడు దీనికి పనోరమిక్ సన్‌రూఫ్ కూడా లభిస్తుంది. ఇందులో సన్‌రూఫ్‌ను చేర్చడం ఇదే తొలిసారి. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, రివర్స్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP) వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని 34.5 kWh బ్యాటరీ ప్యాక్ 375Km రేంజ్ ఇస్తుంది. 39.4kWh బ్యాటరీ ప్యాక్ 456Km రేంజ్ ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News