Big Stories

Mahindra Thar 5-Door Production Begins: ప్రొడక్షన్ స్టార్ట్.. థార్ బుకింగ్స్‌కు టైమ్ ఆగయా!

Mahindra Thar 5-Door Production Begins: మహీంద్రా తన 5-డోర్ల థార్ ఉత్పత్తిని ప్రారంభించింది. కంపెనీ పూణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో దీన్ని తయారు చేస్తోంది. దీనిని థార్ ఆర్మడగా వెల్లడించింది. మహీంద్రా ఇంతకుముందు ప్రతి నెలా 5-డోర్ల థార్ 2,500 యూనిట్లను ఉత్పత్తి చేయాలని ప్లాన్ చేసింది. అదే సమయంలో దాని వార్షిక ఉత్పత్తి దాదాపు 30,000 యూనిట్లుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. అయితే ఇప్పుడు ఉత్పత్తి సామర్థ్యాన్ని నెలకు దాదాపు 6,000 యూనిట్లకు పెంచారు. ప్రతి సంవత్సరం సుమారు 70,000 యూనిట్లు ఉత్పత్తి చేయనున్నారు.

- Advertisement -

న్యూ థార్ బుకింగ్‌‌ల కోసం వెయిటింగ్ పీరియడ్ మొదటి నెల నుండి పెరిగే అవకాశం ఉంది. మహీంద్రా తన రాబోయే ఆఫ్‌రోడ్ SUV 5-డోర్ థార్‌ను ఆగస్టు 15న విడుదల చేయనుంది. కంపెనీ డీలర్లు కూడా అనఫియల్ బుకింగ్‌ను ప్రారంభించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి. ఇందుకోసం డీలర్ షిప్ రూ.25,000 నుంచి రూ.50,000 వరకు టోకెన్ అమౌంట్ తీసుకుంటోంది.

- Advertisement -

Also Read: ఎన్‌ఫీల్డ్‌తో పోటీకి సిద్ధమైన హోండా.. త్వరలో రెండు స్టన్నింగ్ స్కూటర్లు!

మహీంద్రా 5-డోర్ థార్‌లో లభించే ఇంజన్ గురించి మాట్లాడితే దీనికి 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ లభిస్తుంది. ఇది 203bhp పవర్ రిలీజ్ చేస్తుంది. రెండవ ఆప్షన్‌‌గా 2.2-లీటర్ డీజల్ ఇంజన్ ఉంటుంది. ఇది 175bhp పవర్ రిలీజ్ చేస్తుంది. అదే సమయంలో మరొక 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 117bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ మినహా, మిగిలిన రెండు పవర్‌ట్రెయిన్‌లు దాని 3-డోర్ మోడల్‌లో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయి.

5-డోర్ల థార్‌పై వచ్చిన ఫోటోలను చూస్తుంటే దీని డిజైన్ ఇప్పటికే ఉన్న 3-డోర్ థార్ మాదిరిగానే ఉంటుంది. అయితే దీని బాడీ ప్యానెల్‌లు పూర్తిగా కొత్తవిగా ఉంటాయి. ఇది పొడవాటి పిల్లర్స్, స్లాట్డ్ ఫ్రంట్ గ్రిల్, రౌండ్ హెడ్‌లైట్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు, టెయిల్‌గేట్-మౌంటెడ్ స్పేర్ వీల్, మస్క్యులర్ బంపర్ సెక్షన్, రెక్టాంగిల్ టెయిల్ ల్యాంప్‌లతో కూడిన బాక్సీ షేప్ కలిగి ఉంటుంది. స్డాండర్ట్‌ని పెంచడానికి దీని ట్రాక్ చాలా పెద్దదిగా ఉంటుంది.

5 డోర్ థార్ దాదాపు 300 మిమీ ఎక్కువ వీల్ బేస్ కలిగి ఉంటుంది. ఇందులో అల్లాయ్ వీల్స్ సరికొత్తగా ఉంటాయి. దాని వెనుక డోర్ హ్యాండిల్‌పై పిల్లర్స్ కనిపిస్తాయి. ఇది ఎడిటెడ్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. అయితే క్యాబిన్ ఇతర ఫీచర్లు 3-డోర్ మోడల్ మాదిరిగానే ఉంటాయి. టెస్ట్ ప్రోటోటైప్ వెనుక సీట్లతో మాత్రమే కనిపిస్తుంది. అయితే ఇందులో రెండో వరుస వెనుక బెంచ్ సీటు ఉంటుందా లేక బూట్ స్పేస్ మాత్రమే ఉంటుందా అనే దానిపై క్లారిటీ లేదు.

Also Read: రంగు పడింది.. సరికొత్త కలర్స్‌లో మహీంద్రా XUV700.. ఈసారి ఏ రంగో..!

5- డోర్ థార్ 6 కలర్ ఆష్షన్స్‌లో లాంచ్ చేయవచ్చు. ఇతర ఫీచర్ల గురించి చెప్పాలంటే.. ఇది వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ సపోర్ట్‌తో కూడిన 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ AC, మల్టీ-ఫంక్షనల్ స్టీరింగ్ వీల్, రూఫ్ మౌంటెడ్ స్పీకర్లు, మల్టిపుల్ ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ స్టార్ట్ కంట్రోల్, EAC వంటి మరిన్ని స్టాండర్డ్ ఫీచర్లను కలిగి ఉంటుంది.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News