Big Stories

Two Wheeler CNG Kit: ఇక పెట్రోల్ అక్కర్లేదు గురూ.. రూ.15 వేలకే CNG.. ఏకంగా 100 కిమీ మైలేజ్

Two Wheeler CNG Kit: ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్‌ను బజాజ్ విడుదల చేయనుంది. దీనికి కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జూలై 5న కంపెనీ బైక్‌ను లాంచ్ చేయనుంది. దాని CNG సిలిండర్ సీటు కింద ఉండే అవకాశం ఉంది. అయితే ఆటో పరిశ్రమలో ఇది అత్యధిక మైలేజ్ ఇచ్చే టూ వీలర్ కానుంది. దీని ప్రారంభ ధర సుమారు 80 వేల రూపాయలు. మీకు ఇప్పటికే ద్విచక్ర వాహనం ఉండి కూడా కొత్త CNG బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

- Advertisement -

అప్పుడు మీరు సుమారుగా రూ.లక్ష వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంటే కేవలం మైలేజీ కోసమే ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టాల్సి వస్తోంది. అయితే మీకు కావాలంటే మీరు మీ పాత బైక్‌లోనూ CNG కిట్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. ఈ పనిని మార్కెట్‌లోని చాలా కంపెనీలు చేస్తున్నాయి. దీని ద్వారా డబ్బు ఆదా అవుతుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -

పెట్రోలు, సిఎన్‌జి ధరలో పెద్ద తేడా ఏమి ఉండదు. ద్విచక్ర వాహనంలో సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడం వల్ల మీకు తరచూ పెరిగే పెట్రోల్ ఖర్చు నుంచి ఉపశమనం లభిస్తుంది. CNG ధరలు పెట్రోల్ కంటే తక్కువ. అంతేకాకుండా ఎక్కువ మైలేజీని కూడా ఇస్తుంది. దీని అర్థం మీ వాహనం తక్కువ ఖర్చుతో ఎక్కువ నడుస్తుంది. సీఎన్‌జీ ధర కిలో రూ.75గా ఉన్నాయి.

Also Read: భలే డిమాండ్.. ఈ కారు కావాలంటే 14 నెలలు ఆగాల్సిందే!

కాగా పెట్రోల్ ధర లీటరుకు దాదాపు రూ.95. అంటే రెండింటి మధ్య రూ.20 తేడా ఉంది. అంతే కాదు పెట్రోల్‌తో నడిచే బైక్ 70కిలోమీటర్ల వరకు నడుస్తుంది. ఇది CNGలో 100Km నుండి 120Km మైలేజీని ఇస్తుంది. చాలా కంపెనీలు CNG కిట్‌లను ఇన్‌స్టాల్ చేస్తున్నాయి. ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఫ్యాక్టరీ అమర్చిన CNG కిట్‌తో కూడిన ద్విచక్ర వాహనాన్ని విడుదల చేయలేదు.

మార్కెట్‌లో సిఎన్‌జితో నడిచే అన్ని ద్విచక్ర వాహనాలు థర్డ్ పార్టీల ద్వారా ఇన్‌స్టాల్ చేయబడ్డాయి. LOVATO అనే కంపెనీ CNG కిట్‌లను అందిస్తోంది. ఈ కిట్‌ను అమర్చేందుకు దాదాపు రూ.15 వేలు ఖర్చవుతుంది. మీరు ఈ ఖర్చును 1 సంవత్సరంలోపు తిరిగి పొందుతారని కంపెనీ పేర్కొంది. మీరు మీ ద్విచక్రవాహనాన్ని ఎంత ఎక్కువగా నడుపుతారో, అంత త్వరగా కిట్ మొత్తం డబ్బు తిరిగి ఆదా చేస్తారు.

Also Read: స్మార్ట్‌ఫోన్ ధరకే ఎలక్ట్రిక్ స్కూటర్లు.. ఇవి మహిళల కోసమే గురూ!

అయితే ఇప్పటి వరకు ఈ కిట్‌ను స్కూటర్లలో మాత్రమే అమర్చారు. బైక్‌లలో దీన్ని ఇన్‌స్టాల్ చేయడానికి స్పేస్ ఉండదు. ఈ కిట్ స్కూటర్ బూట్ స్పేస్ దగ్గర కంఫర్ట్‌గా ఉంటుంది. స్కూటర్ పెట్రోల్, సిఎన్‌జి రెండింటిలోనూ నడుస్తుంది. స్కూటర్‌లో సిఎన్‌జి కిట్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి సుమారు 4 గంటలు పడుతుంది. దీని కోసం కంపెనీ ఒక స్విచ్‌ను ఇన్‌స్టాల్ చేస్తుంది. దీని ద్వారా CNG నుండి పెట్రోల్‌కి లేదా పెట్రోల్‌కు CNG మోడ్‌కి మారవచ్చు. కంపెనీ ముందు భాగంలో రెండు సిలిండర్‌లను ఇన్‌స్టాల్ చేస్తుంది. అదే సమయంలో దాని కంట్రోల్ మెషిన్ సీటు కింద పార్ట్‌లో ఉంటుంది

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News